అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.

అంతగా భయపెట్టని ఆత్మల కథ !!

Are there souls?……. దెయ్యాలు,ఆత్మలను నమ్మే వారు కొందరు..అంతా ట్రాష్ అని కొట్టేసేవారు ఇంకొందరు. ఈ చర్చలు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి.ఈ సినిమా ఆత్మలున్నాయని చెబుతోంది. హర్రర్ థ్రిల్లర్ జానర్ లో తీశారు ఈ ‘ఈషా’ (Eesha) సినిమాను. అమెజాన్ లో  స్ట్రీమింగ్ అవుతోంది. పేరుకే హారర్ సినిమా కానీ భయపడి పోయేంత గొప్పగా ఏమీ …

చురకలు అంటించడంలో ఆయన స్టయిలే వేరు !!

Taadi Prakash…………….. తెలుగు దినపత్రికల్లో మొట్టమొదట రాజకీయ కవితలు రాసిన వాళ్లెవరో చెప్పండి? అని ఎడిటర్‌ నండూరి రామ్మోహనరావు ఒక మధ్యాహ్నం వేళ విజయవాడ ఆంధ్రజ్యోతి ఆఫీసులో అడిగారు నన్ను.‘ఇంకెవరు! రాంభట్ల కృష్ణమూర్తి గారేగా’ అన్నాను చాలా కాన్ఫిడెంట్‌గా! ఆయన నా భుజమ్మీద చిన్నగా కొట్టి ‘మీతో అదే వచ్చింది’ అన్నారు. మీతో అంటే కమ్యూనిస్టులతో …

పంచ మాధవ క్షేత్రాల గురించి విన్నారా ?

 Pancha Madhava Kshetras …………. శ్రీ మహావిష్ణువు (మాధవుడు) కొలువైన అత్యంత ప్రాచీనమైన ఐదు పుణ్యక్షేత్రాలను పంచ మాధవ క్షేత్రాలు  అంటారు. పురాణాల ప్రకారం కృతయుగంలో దేవేంద్రుడు అసుర చక్రవర్తి అయిన వృత్తాసురుడిని వధించాడు. అయితే, వృత్తాసురుడు గొప్ప వేద పండితుడు (బ్రాహ్మణుడు) కావడంతో, ఇంద్రుడికి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది. ఆ పాపం వల్ల ఇంద్రుడి …

అదరగొట్టే పాత్రల్లో అక్షయ్ ఖన్నా!!

Fantastic characters…………….. అక్షయ్ ఖన్నా విలనిజం గురించి చెప్పాలంటే… అది ఒక ‘సైలెంట్ సునామీ’ లాంటిది. బాలీవుడ్‌లో విలన్ అంటే కేకలు వేయడం, భయంకరంగా నవ్వడం అనే పాత పద్ధతిని పక్కన పెట్టి, కేవలం తన కళ్ళలోని తీక్షణతతో, గంభీరమైన నడకతో, సూటిగా గుచ్చుకునే డైలాగ్ డెలివరీతో ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టించడం అక్షయ్ ఖన్నా …

‘ముంబై’ లో రాత్రివేళ రంగుల లోకం!!

Mohammed Rafee ……………… నాలుగు రోజులుగా ముంబయి థానే వెస్ట్ లో వున్నాను. మన హైదరాబాద్ మోడల్ సానియా సింగ్ ఎప్పటి నుంచో ముంబయి లో ఉండి అవకాశాలు వెతుక్కుంటున్నారు. తన ఆహ్వానం మేరకు వీకెండ్ లో మిత్రుడు ఆల్విన్ జార్జ్ తో కలసి అంథేరి లోని ఒక డ్యాన్స్ బార్ కు వెళ్ళాను. మతిబోయింది …

అంగారకుడిపై జీవ జాలం జాడలు ?

Traces of life on Mars ?………………. నాసా (NASA) 2021లో అంగారక గ్రహంపైకి పంపిన పెర్సెవరెన్స్ రోవర్ (Perseverance Rover) పరిశోధన ఇంకా పూర్తి కాలేదు. ఇది ప్రస్తుతం తన ఐదవ ఏడాది పరిశోధనలను కొనసాగిస్తోంది. ఫిబ్రవరి 18, 2021న జెజీరో క్రేటర్ (Jezero Crater)లో దిగిన ఈ రోవర్, కనీసం 2031 వరకు …

అచ్చం అమ్మాయిలా నవ్వుతూ, కన్నుగీటుతూ, మాట్లాడే రోబోలు !!

Humanoid robot…………. చైనాలోని షాంఘైలో DroidUp  అనే స్టార్టప్ కంపెనీ ‘మోయా’ (Moya) పేరిట హ్యూమనాయిడ్ రోబోను ఆవిష్కరించింది. ప్రపంచంలోనే మొట్టమొదటి జీవక్రియలను అనుకరించే హ్యూమనాయిడ్ రోబో ఇది.ఈ రోబో మనిషిలా  నవ్వుతుంది..కన్నుగీటుతుంది.తల ఊపుతుంది.,కళ్లలోకి చూస్తూ మాట్లాడుతుంది. సాధారణ రోబోల్లా కాకుండా, దీని శరీరం మనిషిలాగే 32 నుంచి 36 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను కలిగి …

ఆమె’డాక్టర్ డిగ్రీ’పై వివాదం !!

Mohammed Rafee ……………… టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల పేరుకు ముందు డాక్టర్ చేరింది! డబ్బులిచ్చి తీసుకునే గౌరవ డాక్టరేట్ కాదు! పరిశోధన చేసి తీసుకున్నది కాదు! ఇది మెడికల్ డాక్టరేట్! పక్కా నాలుగున్నరేళ్లు చదివి పాసైతే వచ్చే డాక్టర్ డిగ్రీ! విచిత్రం ఏమిటంటే ఇప్పుడు శ్రీలీల డాక్టర్ డిగ్రీపై వివాదం రాజుకుంది! కనీసం 80 శాతం …

ఎవరీ మాలిక్ కాఫర్ ? అతగాడి కథేంటి ?

Siva Racharla …………… మధుర మీనాక్షి సాక్ష్యం చెప్పిన చరిత్ర… ప్రతాపరుద్రుడు కప్పం కట్టిన చరిత్ర……కోహినూర్ వెలుగు చూసిన చరిత్ర….వీర బల్లాలదేవుడు ఓడిపోయిన చరిత్ర…. మధుర మీనాక్షి గుడి తగలబడిన చరిత్ర…… బీబీ నాంచారి పుట్టిన చరిత్ర…. వీటన్నింటితో  ముడిపడిన కథ మాలిక్ కాఫర్ ది.  సంజయ్ లీలా బన్సాలి పద్మావతి సినిమా వివాదం ఖిల్జి, …
error: Content is protected !!