కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.

రక్తం గడ్డ కట్టే చలిలో గస్తీ … సియాచిన్ లో సైనికుల కష్టాలు! (2)

Government spends thousands of crores for patrolling………………. సియాచిన్ ప్రాంతంలో కాపలా కాసే సైనికులు తప్పనిసరిగా తమ వద్ద కిరోసిన్ ఉంచుకుంటారు. గతంలో క్యాన్స్ లో కిరోసిన్ సరఫరా అయ్యేది. అవసరమైనపుడు స్టవ్ వెలిగించి వెచ్చదనాన్ని ఆస్వాదిస్తారు. ప్రస్తుతం బేస్ క్యాంప్ నుంచి సైనికులు కాపలా ఉండే పోస్ట్ లకు పైప్ లైన్ ద్వారా …

రక్తం గడ్డ కట్టే చలిలో గస్తీ … సియాచిన్ లో సైనికుల కష్టాలు! (1)

Sacrifices for the country ………………….. సియాచిన్ గురించి తరచుగా మనం వార్తల్లో వింటుంటాం. సముద్ర మట్టానికి దాదాపు 5 వేల మీటర్ల ఎత్తులో ఈ సియాచిన్ ప్రాంతం ఉన్నది. మంచు గడ్డలతో కూడిన ప్రాంతమిది. కారాకోరం పర్వత శ్రేణిలో పెద్ద హిమనీ నదం ఇది. సుమారు 20 వేల అడుగుల ఎత్తయిన ఈ పర్వతం …

‘హలం’ ఉంటే కోలాహలమే !!

Bharadwaja Rangavajhala ……………………………………… టాలీవుడ్ లో చాలా మంది నాట్యతారలు మెరిసారు. అందులో అడపాదడపా హీరోయిన్ రోల్స్ చేసిన వాళ్లూ ఉన్నారు. అయితే వ్యాంపిష్ రోల్స్ వేస్తూనే మధ్యలో పూర్తి స్థాయి హీరోయిన్ పాత్రలు చేసిన తారల్లో ఎల్.విజయలక్ష్మి, హలం కొంచెం  ప్రత్యేకంగా కనిపిస్తారు. హలం వ్యాంప్ రోల్స్ చేస్తూనే ఓ సూపర్ డూపర్ హిట్ …

సీన్ కానరీ స్టయిలే వేరు !

Goverdhan Gande అత్యద్భుతమైన విన్యాసాలు.ఒళ్ళు గగుర్పొడిచే సాహసాలు,  ప్రాణాలు హరిస్తాయేమోననే భయం.  మనం మునుపెన్నడూ చూడని విచిత్రమైన ఆయుధాలు,సంభ్రమాశ్చర్యాలు కలిగించే అత్యద్భుతమైన వాహనాలు. వీటి మధ్య శృంగార దృశ్యాలు. అంతా నిజమేననిపించే,ఆసక్తికరమైన కథనం,అద్భుత నటనా కౌశలం .అత్యంత సాంకేతిక నైపుణ్య ప్రతిభా ప్రదర్శన.ఇదంతా తెరపై దర్శనమిస్తూ ప్రేక్షకులను కళ్ళార్పకుండా తెరకు కట్టి పడేసే దృశ్య మాలికల …

జటేశ్వరుని దర్శనం … అరుదైన అనుభవం !

The last of the five kedaras …………………….. పంచ కేదారాలలో చివరిది కల్పనాధ్ క్షేత్రం. ఉత్తరాఖండ్ లోని చమోలి జిల్లా గర్వాల్ ప్రాంతంలోని ఉర్గాం లోయ లో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయం సముద్ర మట్టానికి  2200 మీటర్ల ఎత్తులో ఉంటుంది. చుట్టూ దట్టమైన అడవులు, కొండలు, కోనల మధ్య చిన్న గుహలో …

మధ్య మహేశ్వరుడి ని దర్శించడం కష్టమే!

This is one of the Panch Kedara temples…………………. “మధ్యమహేశ్వర్” దేవాలయం ఉత్తరాఖండ్ లోని రుద్రప్రయాగ్ జిల్లాలో ఉంది. ఈ ఆలయం సముద్ర మట్టానికి 3437 మీటర్ల ఎత్తులో, చౌకాంబ,నీలకంఠ్, కేదారనాథ్ పర్వతాలకు అభిముఖ దిశలో కనిపిస్తుంది. ఇది అత్యంత శక్తివంతమైన దేవాలయమని భక్తులు నమ్ముతారు. పంచ కేదార ఆలయాల్లో ఇదొకటి.  ఇక్కడ శివలింగం …

ఎముకలు కొరికే చలిలో ….

Lowest Temperatures………………………..  మామూలు చలిగాలుల వీస్తేనే మనం గజగజా వణికిపోతాం. రగ్గులు కప్పుకుంటాం.స్వెట్టర్లు ధరిస్తాం.శీతాకాలంలో మన దేశంతో పాటు ప్రపంచంలోని పలు నగరాలలో, గ్రామాల్లో ఉష్ణోగ్రతలు బాగా పడిపోతాయి. మరీ గడ్డకట్టి పోయే చలి అయితే వామ్మో ఇక చెప్పనక్కర్లేదు. అలా గడ్డ కట్టి పోయే చలి ఉండే ..మంచు పడే ప్రదేశాలు ఉన్నాయా ? …

ఈ రుద్రనాథుడిని దర్శించారా ?

Third Temple of the Panch Kedara Kshetras ………………………… పంచ కేదార క్షేత్రాల్లో రుద్రనాథ్ ఆలయం మూడవది.ఈ ఆలయం ఉత్తరాఖండ్ లోని గర్హ్వాల్ హిమాలయ పర్వతాలలో ఉంది. నంది రూపంలో ఉన్న శివుని ముఖ భాగం వెలసిన చోటు ఇది. ఇక్కడ శివుణ్ణి నీలకంఠ్ మహాదేవ్ అని పిలుస్తారు. తెల్లవారు జామున జరిగే అభిషేక సమయంలో …

పెత్తందారులపై సమరశంఖం !!

Subramanyam Dogiparthi………………………  Award winning movie బక్కోళ్ళ సినిమా . అంటే కేవలం బక్క జీవుల మీద సినిమా అనే కాదు . నిర్మాతలు , నటులు అందరూ ఈ సినిమా తీసేనాటికి బక్కోళ్ళే . 18 మంది నిర్మాతలు తలా పది వేలు వేసుకుని ఈ సినిమాను నిర్మించారట.సినిమా ప్రొడక్షన్ పేరు కూడా శ్రామిక …
error: Content is protected !!