ఇదొక మోడరన్ ‘రాబిన్ హుడ్’ కథ !!

Sharing is Caring...

Rough action drama ……..

‘డీసీ’ (DC – దేవదాస్ చంద్ర) సినిమా రా అండ్ రఫ్ యాక్షన్ డ్రామా..  డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ హీరోగా అరంగేట్రం చేసిన ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వం వహించారు.  సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రం  ప్రస్తుతం Sun NXT లో తెలుగు వెర్షన్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

కథ ఏమిటంటే ?

సర్కార్ ముఠాలో దేవదాస్ (లోకేష్ కనగరాజ్) కీలక సభ్యుడు. ఈ ముఠా పోలీసుల ఆయుధాలను దొంగిలిస్తుంటుంది. ఓ సామాన్యుడు తన కొడుకు చదువు కోసం దాచుకున్న ఏడు లక్షల రూపాయల సొమ్ముని పోలీసులు కాజేసి అతడిని దారుణంగా చంపేస్తారు.ఈ అన్యాయానికి ప్రతీకారంగా దేవదాస్ బృందం పోలీసులపై దాడి చేస్తుంది.ఈక్రమంలో ఒక స్పెషల్ టీం వీళ్ల కోసం వేట మొదలుపెడుతుంది.

దేవదాసు హోటల్ లో దాక్కున్నప్పుడు గాయని పార్వతి (సంజన కృష్ణమూర్తి)తో పరిచయం అవుతుంది. ఆమెను దాసు ఇష్టపడతాడు. పోలీసుల దాడి చేసినపుడు ఆమె ప్రాణాలు కోల్పోతుంది. ఆ తర్వాత వేశ్యగా ఉన్న చంద్ర (వామికా గబ్బి)కు సాయం చేసి ఆమెను సురక్షితంగా బయటకు తీసుకొస్తాడు. పోలీసులు గాలింపులో ఈ ముఠా దొరికిందా ?అంతమైందా అనేది మిగతా కథ.

దర్శకుడిగా అందరికీ పరిచయమైన లోకేష్, ఈ చిత్రంలో పూర్తి స్థాయి హీరోగా తొలి ప్రయత్నంలోనే చాలా ఇంటెన్స్, గ్రిటీ పెర్ఫార్మెన్స్ ఇచ్చి ఆకట్టుకున్నారు. ఎక్కవగా డైలాగులు లేకుండా కళ్ళతోనే భావాలను పలికించాడు.ఎమోషనల్ సీన్స్‌ను చాలా ఎఫెక్టివ్‌గా పండించారు. మొదటి సినిమా అయినప్పటికీ గ్యాంగ్‌స్టర్ పాత్రలో ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకుంది.

పార్వతిగా సంజన కృష్ణమూర్తి చాలా అందంగా కనిపించడమే కాకుండా, తన నటనతో భావోద్వేగాలకు గురిచేస్తుంది. దేవదాస్ జీవితంలోకి చంద్ర ప్రవేశించిన తర్వాత వచ్చే సీన్స్, వారిద్దరి మధ్య కెమిస్ట్రీ,  యాక్షన్ సీక్వెన్స్‌లలో వామికా గబ్బి పవర్ ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకుంటాయి. ఆపాత్రలో వామికా ఒదిగిపోయింది.ఆమె క్యారెక్టర్ గ్రాఫ్ సాధారణంగా మొదలై ఆ తర్వాత చాలా పవర్‌ఫుల్‌గా మారుతుంది. లోకేష్‌తో ఆమె కెమిస్ట్రీ, యాక్షన్ సీన్లలో ఆమె చూపించిన బోల్డ్‌నెస్…ఇంటెన్సిటీ బాగున్నాయి. 

దేవదాస్‌ను పట్టుకోవడానికి ప్రయత్నించే సాడిస్టిక్ పోలీస్ ఆఫీసర్‌గా కృష్ణ దయాళ్ చాలా పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆయన నటన  సినిమా యాక్షన్ సీన్స్‌కు మంచి బలాన్ని ఇచ్చింది.దేవదాస్ పక్కన ఉండే ప్రధాన అనుచరుడిగాకిట్టి  పాత్రలో  అవినాష్ ఒదిగిపోయారు. కొన్ని సీరియస్ పరిస్థితుల్లో ఆయన ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్ చాలా సహజంగా అనిపిస్తాయి. మిగతా నటులు అంతా బాగా చేశారు .

రొటీన్ గ్యాంగ్‌స్టర్ పగలు, ప్రతీకారాల నేపథ్యంలో సెకండాఫ్ కొద్దిగా సాగదీతగా అనిపిస్తుంది. రాత్రంతా తమను ఇంట్లో ఉంచుకున్నందుకు కృతజ్ఞతగా డబ్బు ఇవ్వడానికి వచ్చి లోకేష్ పోలీసులకు దొరికి పోయే సీన్ బాగుంటుంది.ఆ సీన్ లో లోకేష్ఇంటి యజమాని చేతిలో డబ్బు పెట్టి వాడికేసి చూసిన చూపు అద్భుతంగా వచ్చింది.

వ్యభిచార గృహం నుంచి అమ్మాయిలను రక్షించే సీన్స్ బాగా వచ్చాయి. వయలెన్స్ డోస్ ఎక్కువగా ఉన్నప్పటికీ సినిమాలో ఎమోషన్స్ కు ప్రాధాన్యత ఇచ్చారు.కథ పాతదే అయినా కొన్నిసీన్స్, విజువల్ స్టైల్ వల్ల సినిమా యాక్షన్ లవర్స్‌ని మెప్పిస్తుంది. ఒక మోడరన్ రాబిన్ హుడ్ ను దృష్టిలో పెట్టుకుని ఈ కథ తయారు చేశారు .    

అనిరుధ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) సినిమాకి ప్రాణంగా నిలిచింది. సినిమాటోగ్రాఫర్ ముఖేష్ జి  విజువల్స్ ఈ సినిమాకి ఒక మేజర్ అసెట్. సినిమాను చాలా స్టైలిష్‌గా, రా అండ్ డార్క్ అండర్‌వరల్డ్ వాతావరణం ప్రతిబింబించేలా షూట్ చేశారు.సినిమా రా అండ్ రస్టిక్ లుక్‌లో చాలా స్టైలిష్‌గా కనిపిస్తుంది. యాక్షన్ కొరియోగ్రఫీ బాగుంది. 

సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకొని సాలిడ్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.ఈ చిత్రం థియేట్రికల్ రన్ ముగిసే సమయానికి  ₹105 కోట్ల కు పైగా  గ్రాస్ వసూళ్లను సాధించింది.

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!