Priyadarshini Krishna ………….
Byjus….ఈ పేరు వినని భారతీయులు, తల్లిదండ్రులు ఉండరు అంటే అతిశయం కాదు…20011 lo ఒక ప్రైవేట్ ట్యుటోరియల్స్ గా ప్రారంభం అయిన ఈ బైజు Ravindran మెల్లమెల్లగా ఒక పెద్ద ఆన్లైన్ ట్యుటోరియల్ సంస్థగా ఎదిగాడు.
2015 సంవత్సరం మొదలు ప్రపంచం మొత్తం పాండమిక్ లో లాకైనా కాలం వరకు సంచలనం సృష్టించిన పేరు … ఒక విధంగా తల్లిదండ్రులకు చేతికి తమ పిల్లలకు మెరుగైన బోధన చేయించడానికి దొరికిన ఒక మంచి ఆయుధం.తర్వాత స్వయంకృతాపరాధాల వల్ల 22 బిలియన్ల యూనికార్న్ స్టార్టప్ గా ఎదిగిన ఈ edu-tech కంపెనీ zero కి పడిపోయింది.
ఈ అంశం మీద ఎందరో ఎన్నో కథనాలు రాశారు… కొందరు కొన్ని కాన్స్పిరసీ థియరీలు కూడా రాశారు …
కానీ, ఇప్పుడీ ఈ రోజు ఈ విషయం మనం ఎందుకు చర్చించుకోవాలి అంటే , నిన్న లేటెస్ట్ గా byjus మళ్లీ వార్తల్లోకి వచ్చింది.
సింగపూర్ కోర్ట్ బైజుస్ ప్రమోటర్ రవీంద్రన్ కి 6 నెలల జైలు శిక్ష విధిస్తూ ఉత్తర్వులు జారీచేసింది …
ఎందుకు …?!
బైజుస్ సంస్థ financial collapse అయిన సందర్భం లో Qatar Holdings అనే సంస్థ బైజుస్ పైన failure to comply with multiple asset-disclosure వ్యాజ్యం వేసింది … అనేకసార్లు నోటీసులు ఇచ్చినా కూడా బైజూస్ రెస్పాండ్ అవక పోవడంతో contempt of court కింద సింగపూర్ కోర్ట్ ఈ రూలింగ్ జారీచేసింది.
అసలు ఇదంతా ఎలా జరిగింది బైజుస్ ఈ ఊబిలోకి ఎలా కూరుకుపోయింది …?!
ఒక్కసారిగా వచ్చిపడిన ఇన్వెస్ట్మెంట్లను విచ్చల విడిగా ఖర్చు పెట్టడం, ముందుచూపు లేకుండా వచ్చిన ఇన్వెస్ట్మెంట్లను తిరిగి సొంత పెట్టుబడులుగా ఇతర కంపెనీలకు తరలించడం. భారీ మొత్తంలో అడ్వర్టిజ్మెంట్స్, బ్రాండంబాసిడర్స్, క్రికెట్ ఎండోర్మెంట్స్, ఫుడ్బాల్ దిగ్గజం మెస్సీ ని బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకోడానికి భారీ మొత్తాలు ఖర్చు పెట్టడం వంటి తప్పిదాలు చేశారు.
తల్లిదండ్రుల ట్రస్ట్ ని కోల్పోవడం, నియమించుకున్న టీచర్లకు సరైన వేతనాలు ఇవ్వకపోవడం, పిల్లలను మోటివేట్ చెయ్యడానికి మార్కెటింగ్ ఏజెంట్లను నియమించి అప్పుల వాళ్ల మాదిరిగా తమ ప్రొడక్టులను కొనమని పీడించడం … అసలు విషయం అయిన ఎడ్యుకేషన్ ని పక్కన పడేసి పిల్లలను ప్రోడక్ట్స్ గా చూసి వారినుండి భారీ రుసుములతో బైజుస్ ట్యాబ్ ని కొనిపించడానికి అనేక ఎత్తులు వెయ్యడం లాంటి అనేక దిగజారుడు పనులకు పాల్పడింది.
భారత్ లో బైజుస్ విద్యార్థులు , వారి తల్లిదండ్రులు ఇన్ని కష్టాలను ఎదుర్కుంటూ ఉంటే బైజూస్ ప్రమోటర్స్ మాత్రం దుబాయి కి రిలోకేట్ అయిపోయి వివిధ దేశాల్లో ఆస్తులు సమకూర్చుకోవడం … ఇలా ఒకటి కాదు వందల కారణాలు బైజుస్ ని పతనావస్థకు చేర్చాయి.
యూనికార్న్ గా ఎదిగిన బైజూస్ సంస్థకి సొంత CFO చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ లేకపోవడం పెద్ద పొరపాటు… బైజుస్ flagship కంపెనీ అయిన Think & Learn PvtLtd కి తొలుత నుండి Deloitte కంపెనీ ఆడిటర్స్ గా వుంది. ఒకానొక 12 బిలియన్ల డాలర్ల టర్మ్ లోన్ విషయాన్ని తమతో చర్చించలేదని దాని వివరాలు పంచుకోకుండా తమకు నచ్చినట్లు వ్యవహరిస్తూ ఉండటంతో విసిగిపోయిన డెలాయిట్ ఇకపై తాము ఆడిటర్స్ గా వ్యవహరించబోమని రిసైన్ చేసేసింది.
white హాట్ జూనియర్ అనే మరొక ఎడ్యుకేషన్ కంపెనీ ని టేకోవర్ చేసిన తర్వాత అదొక వైట్ ఎలిఫెంట్ గా మారిపోయి బైజుస్ ఊబిలోకి కూరుకుపోడానికి కారణం అయింది. సరిగ్గా ఈ వ్యవహారమే ఉద్యోగులను లేఆఫ్ చేసే విధంగా పరిణమించింది.
సరిగ్గా ఇదే సమయం లో గోరుచుట్టు మీద రోకలి పోటులాగా ఇన్వెస్టర్స్ బ్యాకఫ్ అయిపోవడం ప్రారంభించడం, స్పాన్సర్షిప్ అమౌంట్ రికవరీ కోసం బోర్డు ఆఫ్ కంటోల్ ఫర్ క్రేకెట్ ఇండియా (BCCI) బైజూస్ మీద insolvency petition వేసింది … ఇవన్నీ తడిసి మోపెడు అయ్యి బైజు ఫౌండర్ రవీంద్రన్ తలకు చుట్టుకున్నాయి.
పెరుగుట విరుగుట కొరకే అనే నానుడి ని నిజం చేసింది బైజుస్ సంస్థ ….నడమంత్రంగా వచ్చి పడిన ధనాన్ని ఎలా ఖర్చుపెట్టుకోవాలో తెలియక లేదా అత్యాశకు పోయి కన్ను మిన్ను కానకుండా విచ్చల విడిగా వ్యవహరించి పీకలమీదికి తెచ్చుకున్నాడు… ఇదంతా కేవలం బైజు రవీంద్రన్ స్వయంకృతాపరాధం.

