ఎవరీ సిద్ధార్థ శర్మ.. ఏమిటాయన కథ ?

Sharing is Caring...

Priyadarshini Krishna…………

ఇంద్రి ….2023 లో spirits market లో చాలా పేరు సంపాదించుకుంది, అవార్డులు కైవసం చేసుకున్న single malt whisky. ఇది హర్యానా కు చెందిన Piccadilly Distilleries నుండి ఉత్పత్తి అవుతున్న బెవరేజ్….
ఈ కంపెనీని తొలుత 1967 లో కేదార్నాథ్ శర్మ స్థాపించినప్పటికీ కాలక్రమేణా చాలా కారణాలవల్ల ఒడుదుడుకులకు లోనయ్యింది. 

కేదార్నాథ్ మనవడు సిద్ధార్థ శర్మ ఈ కంపెనీ ని తిరిగి 2010 లో పునరుద్ధరించిన పిదప 2022 నాటికి బాగా ఊపందుకుని లాభాల బాట పట్టడమే కాకుండా బెవరేజస్ వ్యాపారంలో మొదటిస్థానం లో నిలిచింది. 

ఎవరీ సిద్ధార్థ శర్మ …?!

అంతరించిపోయిన వ్యాపారాన్ని పునరుద్ధరించడమే కాదు, నిజానికి అతడు కూడా పునరుత్థానం పొందాడు ….
ఈ వ్యాసం చదివినప్పుడు నాతో మీరు ఏకీభవించక మానరు.. సరే, ఇప్పుడొక నిజ సంఘటన గురించి మాట్లాడుకుందాం. 

1999 లో ఢిల్లీ లోని మెహరోలి ప్రాంతంలోని ఒక చాలా హైఫై బార్ & రెస్టారెంట్ లో కి ఒక నలుగురు యువకులు వెళ్లారు. అప్పటికే టైం 12 అవుతుండటం తో, అక్కడ ఉన్న బార్ టెండర్ టైం అయిపోయింది ఇప్పుడు డ్రింక్స్ సర్వ్ చెయ్యడం కుదరదు అని వినయంగా చెప్పింది.

కానీ, ఈ వెళ్లిన యువకులు బడాబాబు ల జులాయి కొడుకులు, అప్పటికే తాగి తాగి ఉండటం వల్ల బార్ టెండర్ చెప్పిన విషయాన్ని ఇగో కి పోయి దురుసుగా ప్రవర్తించారు. ఆరోజుఅక్కడ బార్ టెండర్ గా ఉన్నది ఒక పాతికేళ్ల మహిళ, మోడల్ రంగం లో తనకంటూ పేరు సంపాదించుకున్న జెస్సికా లాల్. 

ఒక ఆడది తమలాంటి బడా బాబులకు మందుపొయ్యను అంటుందా ? అని ఒక్కసారిగా ఇగో నషాలానికి ఎక్కిన క్రమంలో ఆ ముగ్గురిలో ఒకడైన మను శర్మ తన తుపాకీతో గాలిలోకి రెండు రౌండ్లు కాల్చినా కూడా అతనికి డ్రింక్స్ నిరాకరించింది జెస్సికా .. దీనితో పిచ్చి కోపంతో పాయింట్ బ్లాంక్ లో జెస్సికా నుదుటిపైన కాల్చాడు.

కాపాడే నాథుడే లేని ఆ దురదృష్టకరమైన రాత్రి వేళ అక్కడి జనాలు ఏంజరుగుతుందో అర్థం చేసుకునే లోపునే జస్సికా కుప్పకూలి విగత జీవి అయిపోయింది ….అందరూ తేరుకునే లోపున ఆ గంతకులు అక్కడినుండి పారిపోయారు … ఇంతలోనే తెల్లవారిపోయింది.

బార్ స్టాఫ్ పోలీసులకు సమాచారం ఇచ్చి జెస్సికని హాస్పిటల్ తరలించిన ఉపయోగం ఏముంది , ఆమె ఆ రోజు రాత్రి కే ప్రాణం విడిచింది కదా ..పరారైన నలుగురిని ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన సమాచారం బట్టి ఎవరెవరు అనేది గుర్తించారు.

అనేక సంవత్సరాలు వివిధ కోర్టుల్లో కేసు నడిచిన తరువాత 2006 లో ఈ కేసు కి సంబంధించిన అoదరిని ఢిల్లీ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ఈ జడ్జిమెంట్ తో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన జెస్సికా కుటుంబo దోషులను వదిలేది లేదు అని దీనిపై ఇంకా పోరాడాలి అని తీర్మానించుకున్నారు.

జెస్సికా చెల్లెలు సబ్రీనా రేయింబవళ్ళు తన శక్తికోడ్చి ఒకపక్క వృద్ధుడైన తండ్రిని పోషించుకుంటూ కేసు, చనిపోయిన తన అక్కకు న్యాయం జరిగేంతవరకు వదిలేది లేదని మీడియా తో అనేక సార్లు చెప్పింది.ఈ పోరాటానికి దేశంలోని ప్రముఖ మీడియా సంస్థలు, పౌరులు అండగా నిలిచారు.

‘ఇండియా గేట్’ వద్ద ప్రజలు క్యాండిల్ ర్యాలీలు చేస్తూ రోడ్లపైకి వచ్చారు. ప్రజా బాహుళ్యం నుండి వచ్చిన విపరీతమైన ఒత్తిడి కారణంగా ఢిల్లీ హైకోర్టు ఈ కేసును రీ-ఓపెన్ చేసి, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా రోజువారీ విచారణ చేపట్టింది.

సరిగ్గా 300 రోజుల తర్వాత ఢిల్లీ హైకోర్టు బెంచ్ మను శర్మని దోషిగా నిర్ణయిస్తూ జీవిత ఖైదు విధించింది. సుప్రీంకోర్టు కు వెళ్లిన మనుశర్మ కు సుప్రీం లో ఎటువంటి ఊరట దొరకలేదు, హైకోర్టు విధించిన శిక్షనే  2010 లో సుప్రీం ఖరారు చేసింది. 14 ఏళ్ల కారాగార శిక్ష ముగియక ముందే 2020 లో GOOD BEHAVIOUR కారణంగా మనుశర్మ విడులయ్యాడు. 

ఈ జెస్సికా లాలా హత్య కేసు కి ‘indri’ విస్కీ కి ఏంటి సంబంధం అనుకుంటున్నారా?

జెస్సికా ని హత్య చేసి జీవిత ఖైదు అనుభవించిన ఆ మను శర్మ నే విడుదలైన తర్వాతా సిద్ధార్థ శర్మ గా పునర్జన్మ ఎత్తాడు. సిద్ధార్థుడు గౌతముడైనట్లు మనువు సిద్ధార్థుడయ్యాడు.మనుశర్మ తండ్రి వినోద్ శర్మ అప్పటికే హర్యానా నుండి కాంగ్రెస్ పార్టీ పై మూడుసార్లు గెలిచిన MLA…. అంతే కాకుండా మను శర్మ బాబాయ్ అప్పటి రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ కి స్వయానా అల్లుడు.

కాలక్రమంలో తల్లి శక్తిరాణి శర్మా BJP లో చేరి పొజిషన్లో ఉండగా, మనుశర్మ తమ్ముడు కార్తికేయ శర్మ ఏకంగా రాజ్యసభ MP గా ఉన్నాడు. తండ్రి వినోద్ శర్మ ఈ కేసు జరుగుతున్నప్పుడు కాంగ్రెస్ లో వుండగా ప్రస్తుతం BJP లో వున్నాడు.

అంతే కాకుండా ఈ కుటుంబం newX, sunday guardian ఇంకా అనేక రీజినల్ వార్తా సంస్థల అధిపతి అయ్యారు. మనుశర్మ నే సిద్ధార్థ అనే విషయం బయటకు రాకపోయి వుండేది. Forbes సంస్థ ఈ సిద్ధార్థ శర్మ ని కొనియాడుతూ ఇంటర్వ్యూలు అచ్చువేసింది. ఈ వ్యాసాలు చూసిన స్కాట్లాండ్ కి చెందిన కొన్ని డిస్టిలరీస్ సంస్థలు అసలు ఎవరి సిద్ధార్థ ఇంత తక్కువసమయం లో నే ఇంతా ఎలా ఎదిగాడు అని తవ్వగా మొత్తం చరిత్ర బయటకు వచ్చింది.  

ఆ విధం గా ఒకానొక రాత్రి తనకు విస్కీ ఇవ్వలేదన్న ఒక మహిళను హత్య చేసిన వ్యక్తి ఇప్పుడు స్వయంగా విస్కీ బ్రాండ్ కి అధిపతి అయ్యాడు ….ఈ రియల్ స్టోరీ ఆధారంగానే బాలీవుడ్‌లో విద్యాబాలన్, రాణీ ముఖర్జీ ప్రధాన పాత్రల్లో ‘నో వన్ కిల్‌డ్ జెస్సికా’ (No One Killed Jessica) అనే సూపర్ హిట్ సినిమా కూడా వచ్చింది.

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!