Suspense thriller……..
‘ఈషో’ (Eesho) 2022 నాటి మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్.. సోనీ లివ్ (SonyLIV) లో తెలుగు డబ్బింగ్ వెర్షన్‌తో అందుబాటులో ఉంది. ప్రముఖ దర్శకుడు నాదిర్షా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో వర్సటైల్ యాక్టర్ జయసూర్య, జాఫర్ ఇడుక్కి ప్రధాన పాత్రలలో నటించారు. బాలికల లైంగిక వేధింపుల నేపథ్యంలో రాసుకున్న కథ ఇది.
కథ ఏమిటంటే ?
రామచంద్రన్ పిళ్లై (జాఫర్ ఇడుక్కి) ఒక ఏటీఎమ్ సెక్యూరిటీ గార్డు. ఒక పెద్ద మనిషిపై బాలల లైంగిక వేధింపుల (POCSO) కేసు నమోదు అవుతుంది. అందులో పిళ్లై కీలకమైన ప్రత్యక్ష సాక్షి. కోర్టులో సాక్ష్యం చెబితే తన ప్రాణాలకే ముప్పు ఉందని అతనికి తెలుసు, దాంతో తీవ్రమైన భయాందోళనల మధ్య ఏటీఎమ్‌లో నైట్ డ్యూటీ చేస్తుంటాడు.
సరిగ్గా అదే రాత్రి, ఈషో (జయసూర్య) అనే అపరిచితుడు ఆ ఏటీఎమ్ వద్దకు వస్తాడు. అతను ఎవరు? పిళ్లైని చంపడానికి వచ్చిన మనిషా? లేక రక్షకుడా? ఆ ఒక్క రాత్రిలో వారిద్దరి మధ్య ఏం జరిగింది? ఆ పోక్సో కేసు విచారణ ఏమైంది? అనేదే మిగతా ఉత్కంఠభరితమైన కథ.
జయసూర్య కెరీర్లో ఎప్పుడూ లేనంత విభిన్నంగా, మిస్టీరియస్ గ్రే షేడ్స్ ఉన్న పాత్రలో అద్భుతంగా నటించారు. ముఖ్యంగా భయపడుతూ, అమాయకత్వం ప్రదర్శించే సెక్యూరిటీ గార్డు పాత్రలో జాఫర్ ఇడుక్కి నటన సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది.
సినిమా నిడివి కేవలం 1 గంట 45 నిమిషాలు మాత్రమే ఉండటం పెద్ద ప్లస్ పాయింట్. ఎక్కడా అనవసరమైన లవ్ స్టోరీలు, కామెడీ ట్రాకులు లేకుండా డైరెక్ట్‌గా పాయింట్లోకి వెళ్తుంది.
సెక్యూరిటీ గార్డు రామచంద్రన్ పిళ్లై దగ్గరకు ఈషో ఒక అపరిచితుడిగా ఎంట్రీ ఇచ్చే సీన్ చాలా ఉత్కంఠభరితంగా ఉంటుంది. ఆ సమయంలో ఇద్దరి మధ్య జరిగే సంభాషణలు ప్రేక్షకుడిలో క్యూరియాసిటీని పెంచుతాయి.ఈషో మాట్లాడే ప్రతి మాట, చెప్పే చిన్న చిన్న కథలు… పిళ్లైని మానసికంగా మరింత భయపెడతాయి. “అసలు ఈషో మంచివాడా, చెడ్డవాడా? పిళ్లైని చంపడానికి వచ్చాడా లేక కాపాడటానికా?” అనే సస్పెన్స్ మెయింటైన్ అయ్యే సీన్లు బాగుంటాయి.
తనను ఎవరో చంపడానికి వస్తున్నారనే భయంతో ఉన్న ఒక సామాన్య వృద్ధుడి ఆవేదనను, టెన్షన్‌ను జాఫర్ ఇడుక్కి తన ముఖ కవళికలతో అద్భుతంగా పండించారు. ఆయన భయపడే ప్రతి సీన్ ప్రేక్షకుడిని కూడా కథలో లీనమయ్యేలా చేస్తుంది. కథ మధ్యలో వచ్చే ఫ్లాష్‌బ్యాక్ సీన్లు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.
సినిమా ముగింపు వైపు వెళ్లేకొద్దీ ఈషో అసలు క్యారెక్టర్ ఏంటి అనేది రివీల్ అయ్యే సీన్, చివరి 15 నిమిషాల్లో వచ్చే డ్రామా ప్రేక్షకులను సాటిస్ఫై చేస్తుంది.ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాకు కావాల్సినన్నిట్విస్టులు లేకపోయినా కొన్ని ట్విస్ట్స్ బాగుంటాయి. ప్రేక్షకులు ఊహించలేరు.
ప్రారంభంలో వచ్చే కొన్ని సన్నివేశాలు, ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్ కథనంలో వేగాన్ని తగ్గిస్తాయి. తీవ్రమైన సామాజిక అంశాన్ని తీసుకున్నప్పటికీ, కోర్టు సీన్స్ అంత బలంగా అనిపించవు. నటీ నటులంతా బాగా నటించారు.
‘ఈషో’ సినిమా బాక్సాఫీస్ వద్ద కాకుండా నేరుగా ఓటీటీ వేదికైన సోనీ లివ్ (SonyLIV) లో విడుదలయ్యింది.కథాంశం ఒక సామాజిక సమస్యకు సంబంధించింది కావడంతో ఓటీటీలో ఈ సినిమాకు మంచి వ్యూస్ వచ్చాయి. ఆ పరంగా డిజిటల్ ప్లాట్ఫామ్లో ఇది సేఫ్ ప్రాజెక్ట్‌గా నిలిచింది.
ఈషో’ సినిమాకు సినిమాటోగ్రఫీ .. నేపథ్య సంగీతం కథలోని మూడ్‌ను, ఆ రాత్రి వేళ జరిగే సస్పెన్స్‌ను ప్రేక్షకుడు ఫీల్ అయ్యేలా చేయడంలో కీలక పాత్ర పోషించాయి. కెమెరామెన్ రాబీ వర్గీస్ రాజ్ సన్నివేశాల చిత్రీకరణ బాగుంది. రాత్రి వేళ చీకటి వాతావరణాన్ని విజువల్స్‌లో చాలా సహజంగా చూపించారు. లైటింగ్ ,నీడలను వాడుకున్న విధానం కథలోని భయాన్ని, ఉత్కంఠను పెంచింది.
జయసూర్య కళ్లలోని మిస్టరీని, అలాగే జాఫర్ ఇడుక్కి ముఖంలోని భయాందోళనలను చూపించడానికి వాడిన క్లోజప్ షాట్స్ నటీనటుల పర్ఫార్మెన్స్ను మరింత బాగా ఎలివేట్ చేశాయి. ఈ సినిమాకు రాహుల్ రాజ్ నేపథ్య సంగీతం అతిపెద్ద బలం. ఇది రెగ్యులర్ థ్రిల్లర్ సినిమాల్లా కేవలం పెద్ద శబ్దాలతో కాకుండా, చాలా సైలెంట్‌గా ఉంటూనే బ్యాక్‌గ్రౌండ్‌లో టెన్షన్‌ను బిల్డ్ చేస్తుంది.
‘ఈషో’ ఒక రొటీన్ రివెంజ్ డ్రామా అయినప్పటికీ కథనం కొంత కొత్తగా ఉంటుంది. గూస్బంప్స్ వచ్చే రేంజ్ ట్విస్టులను ఆశించకుండా, ఒక మంచి సోషల్ మెసేజ్ ఉన్న సాధారణ థ్రిల్లర్ చూడాలనుకుంటే సోనీ లివ్‌లో చూడవచ్చు.

