కహానీలు… వివిధ పత్రికల్లో, వెబ్సైట్లలో ప్రచురితమై ,ప్రశంసలు పొందిన కథలు … పాఠకులను ఆకట్టుకునే కామెడీ, థ్రిల్లర్ ,సస్పెన్స్ , హారర్ ,హార్ట్ టచింగ్ స్టోరీస్. వివిధ రంగాలలో వ్యక్తులు సాధించిన విజయాలు… ఆ విజయం వెనుక దాగిన స్ఫూర్తి నిచ్చే అంశాలు .. ఇంకా నచ్చిన పుస్తక పరిచయాలు , సమీక్షలు.
fighting of copy cats …………………………… ‘వీర సుత్తి’ పత్రిక లో ఆ కథ చదవగానే సుత్తిశ్రీ కి పట్టలేని ఆవేశం వచ్చింది. బీపీ పెరిగి కాసేపు మనిషి చెట్టు కొమ్మలా ఊగిపోయాడు. “నా కథనే కాపీ కొట్టి బహుమతి గెలుచుకుంటావా సీతా ! నీ సంగతి చూస్తా! ఫేస్ బుక్ లో నిన్ను ఎండ …
అసుర సంధ్య వేళ. ఆకోటలో అడుగు పెట్టాం. కోటను చూడాలని నేను మిత్రులు సాదిక్,వేణు అక్కడికి వెళ్ళాం.అది బీదర్ కోట.విశాల ప్రదేశంలో కోట ను రెండు భాగాలుగా నిర్మించారు.ముందు వైపు కొత్త కోట.దాని వెనుక దూరంగా పాతకోట. చరిత్రకు సాక్ష్యాలుగా కోట లోపల రకరకాల కట్టడాలు.కోట గోడను ఆనుకొని చుట్టుతా శిధిల భవనాలు. మొండిగోడలు ,కూలిన …
“దెయ్యం క్యారెక్టర్ నువ్వే చేయాలి” డైరెక్టర్ గారు ఆ మాట అనగానే ఉలిక్కిపడ్డాను. “నేనేంటి దెయ్యం క్యారెక్టర్ ఏంటి ? సార్” అన్నాను. “నీకు మంచి పేరు వస్తుంది. నా మాట నమ్ము.” అన్నాడు ఆయన. కాదంటే వచ్చిన వేషం కూడా పోతుంది. వేరే దారి లేక ‘సరే’ అన్నాను. దెయ్యాలంటే నాకు చిన్నప్పటినుంచి భయం. …
కాలింగ్ బెల్ కొట్టాను …. ఎవరో అమ్మాయి వచ్చి తలుపు తీసింది.ఆమె వాలకం చూస్తే పని అమ్మాయిలా ఉంది. ‘సార్ రమ్మన్నారు’ అని చెప్పా……’ వెళ్లి హాల్లో కూర్చోండి’ అంది. ఆ అమ్మాయి లాన్ లో నుంచి ఇంటి వెనుక వైపుకి వెళ్ళింది. అది చాలా ఓల్డ్ బిల్డింగ్. లోపలకు వెళ్లాను. సున్నం కొట్టించి ఎన్నాళ్లు అయిందో. కూర్చున్న 15 నిమిషాలకు ఆయన …
మా ఇంటికి దగ్గర్లో ‘భలే పార్కు’లో ఒక్కణ్ణీ కూర్చుని తీవ్రంగా ఆలోచిస్తున్నాను.ఉన్నట్లుండి ఎవరో, “ఆత్మారాం గారూ, నాకు మీ సాయం కావాలి” అనడం విని తలెత్తి చూస్తే, సుమారు ముప్పైఏళ్ల యువకుడు.చూస్తూనే గుర్తుపట్టి ఉలిక్కిపడి, “మీరు మానస్ కదూ!” అన్నాను. మరుక్షణం వళ్లు గగుర్పొడిచింది. మానస్ సుధేష్ణ అనే యువతిని కిడ్నాప్ చేసి, ఆమెను విడిపించే …
ఆ రోజు ఉదయమే టీవీ ఛానెల్స్ లో వస్తున్న బ్రేకింగ్ న్యూస్ ని చూసి అదిరిపడింది అనిత.”పటాంచెరులో ఓ అపార్ట్మెంట్ నాలుగో అంతస్తు నుండి పడి రాగిణి అనే ఓ యువతి మృతి.” అని తెలుపుతూ ఆమె ఫొటోని చూపించారు.ఆ దుర్వార్త విని ఆమె ఫొటోని చూడగానే ఆమె తన ఫ్రెండ్ రాగిణే అని నిర్ధారణ …
“మీరెప్పుడైనా దెయ్యాన్ని చూసారా?” ఆర్ జే గాయత్రి శ్రోతల్ని అడుగుతోంది. ఇదేదో ఇంట్రెస్టింగ్ విషయంలా అనిపించి రేడియో వాల్యూం పెంచాడు రాహుల్. అతడు జాతీయ రహదారి 65లో విజయవాడకు ఒంటరిగా వెళుతున్నాడు. చుట్టూ పరిసరాలలో ఒక్క వాహనం లేదు. చీకట్లు అలుముకుంటున్నాయి. పక్షులు తమ తమ గూళ్లకు చేరుకుంటున్నాయి. మనసులో ఏదో మూల భయమున్నా “పాతికేళ్ళ …
” నా పేరు సురేష్ ! మిమ్మల్ని చూడగానే నాలో ప్రేమ పుట్టింది. దానికి కారణం నాకు తెలీదు. నా ప్రేమను మీరు అంగీకరించాలి.మిమ్మలని వివాహం చేసుకుంటాను ” అంటూ ఎదురుగా నిలుచుని చెబుతున్న ఆ అందమైన యువకుడిని కన్నార్పకుండా చూడసాగింది పరిమళ . నవ్వొచ్చింది ఆమెకి. ఏం చెప్పాలో అర్థం కాక కాసేపు తటపటాయించి …
దినేష్ ఆ రోజు రాత్రి ఒంటరిగా మార్చురీ రూమ్ లోకి ప్రవేశించాడు.టైమ్ చూసాడు.పన్నెండు దాటుతోంది. అతడు ఒకసారి గదినంతా నిశితంగా పరిశీలించాడు.గదిలో చాలా ప్రశాంతంగా వుంది.ప్రాణంలేని ఎన్నో విగత జీవులమధ్య తనొక్కడే ప్రాణమున్న జీవి! ఆ ఊహకి ఎందుకో అతనికి నవ్వొచ్చింది. మనిషి జీవితం శాశ్వతం కాదు. ‘జాతస్య మరణం ధృవం’ పుట్టినవానికి మరణం, మరణించినవానికి …
error: Content is protected !!