ఇదొక యాక్షన్-అడ్వెంచర్ మూవీ !!

Sharing is Caring...

Action-adventure film…………..

రిటర్న్ టు ది జురాసిక్ (Return to the Jurassic – 2025)  హాలీవుడ్ మూవీ  ‘జురాసిక్ పార్క్’ స్ఫూర్తితో రూపొందిన ఒక లో-బడ్జెట్ చైనీస్ వెబ్ యాక్షన్-అడ్వెంచర్ చిత్రం. లీ ఫీ (Li Fei) దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా జనవరి 17, 2025న చైనాలో విడుదలైంది. దీని నిడివి కేవలం 69 నిమిషాలు (1 గంట 9 నిమిషాలు) మాత్రమే.

కథాంశం

క్యాన్సర్‌ను నయం చేసే ‘ఫైర్ హెల్ మాన్‌లోటస్’ (Fire Hell Manlotus) అనే అరుదైన మొక్క కోసం ఒక మారుమూల ద్వీపానికి వెళ్లిన శాస్త్రవేత్తలు, సైనికుల బృందం అక్కడ పాడుబడిన జురాసిక్ పార్క్ లోప్రాణాంతక డైనోసార్లను (వెలోసిరాప్టర్లు) ఎదుర్కొని ఎలా ప్రాణాలతో బయటపడ్డారు అనేదే ఈ సినిమా కథ.

ఈ  చైనీస్ చిత్రంలో ప్రధానంగా సర్వైవల్ యాక్షన్ సీన్స్ , డైనోసార్ల వేట సన్నివేశాలు హైలైట్‌గా నిలుస్తాయి.  పరిశోధన బృందం అరుదైన ‘ఫైర్ హెల్ మాన్‌లోటస్’ (Fire Hell Manlotus) మొక్క కోసం ద్వీపంలోకి అడుగుపెట్టిన తర్వాత, అక్కడ పాడుబడిన పాత జురాసిక్ ల్యాబ్ శిథిలాలు, భారీ డైనోసార్ల పాదముద్రలను కనుగొనే సన్నివేశం ఉత్కంఠను రేకెత్తిస్తుంది.

ప్రమాదకరమైన లోయ ప్రాంతంలో ప్రాణాలను పణంగా పెట్టి క్యాన్సర్ నివారణకు ఉపయోగపడే ఆ అరుదైన మొక్క ను   బృందం సేకరించే సన్నివేశం కథలో కీలక మలుపుగా నిలుస్తుంది.మొక్కను సేకరించిన తర్వాత తిరిగి వెళ్తున్న బృందంపై వెలోసిరాప్టర్ల (Velociraptors) గుంపు ఒక్కసారిగా దాడి చేయడం,  ఆ క్రమంలో బృందం సభ్యులు చెల్లాచెదురయ్యే యాక్షన్ సీక్వెన్స్ సినిమాలో ప్రధాన ఆకర్షణ.  

చివరికి మిగిలిన సభ్యులు డైనోసార్ల బారి నుండి తప్పించుకుని ద్వీపం నుండి బయటపడే క్లైమాక్స్ సన్నివేశాలు ఆసక్తికరంగా సాగుతాయి.జంతువుల పట్ల మనుష్యులు ఎంత క్రూరంగా ప్రవర్తిస్తారో చక్కగా చూపారు. అదే సమయంలో తోడు వచ్చిన సిబ్బంది పట్ల మానవత్వం లేకుండా వ్యవహరిస్తారో తెరపై దర్శకుడు బాగా చూపారు

ఎడ్వర్డ్ గు ప్రధాన శాస్త్రవేత్త పాత్రలో తన పరిధి మేరకు ఫర్వాలేదనిపించాడు.యాంగ్ జు కు యాక్షన్ సన్నివేశాల్లో మంచి స్క్రీన్ ప్రెజెన్స్ లభించింది.  ప్రతినాయక ఛాయలున్న పాత్రలో మైఖేల్ మావో నటన ఆకట్టుకుంటుంది. బృందంలోని ఇతర సభ్యులుగా కనిపించిన నటులు డైనోసార్ల బారిన పడే సహాయ పాత్రలకే పరిమితమయ్యారు.  

హాలీవుడ్ చిత్రాల స్థాయిలో అద్భుతమైన ఫ్రేమ్స్ లేకపోయినా, ఒక సాధారణ చైనీస్ మాన్‌స్టర్ వెబ్ మూవీగా చూడటానికి సరిపడా నాణ్యతతో కెమెరా పనితనం సాగింది. దట్టమైన అడవులు, లోయలు, పాడుబడిన ల్యాబ్ సెట్టింగ్‌లను కెమెరాలో బంధించిన తీరు బాగుంది.. ఇవి కథకు కావాల్సిన మిస్టరీ వాతావరణాన్నిఅందించాయి. డైనోసార్లు దాడి చేసే యాక్షన్ సీక్వెన్స్‌లలో కెమెరా పనితనం బాగుంది.   

ఈ సినిమా Airtel Xstream Play, అమెజాన్ ప్రైమ్ లో ఉంది..ఆసక్తి ఉన్నవారు చూడ వచ్చు   

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!