Priyadarshini Krishna……..
మీరు మీ ఫ్రెండ్స్ తో కలిసి ఒక కంపెనీ స్థాపించారు… ఎన్నో కలలతో ఎంతో కష్టపడి ఒక ప్రాజెక్ట్ సంపాదించారు… ఐతే …. కొన్ని అవకతవకలు జరిగి మిమ్మల్ని మీ కంపెనీ ని blacklist చేశారు, మీరు అప్పటివరకు సంపాదించుకున్న పేరు పరువు ప్రతిష్ట డబ్బు అన్ని పోయాయి..అప్పుడు మీరు ఏం చేస్తారు ….?!?!
భగవంతుడా ….ఇక చావే శరణ్యమా …అనుకుంటూ వైరాగ్యం లోకి పోతారు, కొండొకచో పోతారు కూడా …..!!కానీ, ఒక కంపెనీ ఏంచేసింది, ఎలా ఎదిగింది, ఎలా బతికి బట్ట కట్టింది చూసి నేర్చుకోవాల్సిందే…. ఆరునెలలు తిరగకుండానే పేరు బోర్డు మార్చేసి కొత్తరూపాన్ని సంతరించుకుని ఇంతకీ పదిరెట్లు ఉత్సాహంతో ధైర్య సాహసాలతో ముందుకు దూసుకుపోయింది…ఆ కంపెనీ పేరే ‘Globerina’ గ్లోబరీనా … yes మీరు విన్నది (చదివింది) కరెక్టే …
ఇప్పుడీ కంపెనీ పేరు గ్లోబరీనా కాదు, నూతనంగా face-off చేసుకుని వచ్చిన ‘Coempt EduTeck’ కోఎంప్ట్ ఎడ్యుటెక్ సంస్థ…. ఎస్ మళ్లీ మీరు చదివింది కరెక్ట్ ..తాజాగా CBSE ఫలితాల్లో గందరగోళానికి తావు ఇచ్చి, పోర్టల్ ని హ్యాకర్స్ సులువుగా హాక్ చేసే విధంగా రూపుదిద్దిన గొప్ప సంస్థ….ఇంత జరిగినా అసలు ఒకసారి కుడా Blacklist అవలేదు..
తర్వాత, ఎంత పేరు మార్చుని వస్తే మటుకు ఏమాత్రం బ్యాక్గ్రౌండ్ చెక్ చేయకుండా అప్పనంగా దొంగల చేతికి తాళాల గుత్తిని ఇచ్చేస్తారో మనలాంటి సామాన్యులకు అర్థం కాదు….పైగా రెండు సంస్థల్లో సేమ్ ప్రమోటర్స్… CEO చైర్మన్ కూడా VSN రాజు నే….ఆల్రెడీ ఒకసారి పిల్లల జీవితాలతో ఆడుకున్న కంపెనీనే ఎలా నమ్మి బిడ్డింగ్ లో చోటు ఇచ్చారో అసలు ఆ ప్రక్రియ ఏంటో ఎవరికి అంతుపట్టదు.
IT రంగం లో దిగ్గజంగా ఇప్పటికే పలుమార్లు నిరూపించుకున్న TCS ను తోసి రాజని (లిటరల్లీ) CBSE కాంట్రాక్టు దక్కించుకుంది ……దీని గురించి ఒకసారి కూ లంకషంగా పరిశీలిద్దాం.2019 లో విడుదలైన తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. పరీక్ష రాసిన 9.7లక్షల మంది విద్యార్థులలో ఏకంగా 3.8 లక్షల మంది ఫెయిల్ అయినట్లు బోర్డు ప్రకటించింది.
మార్కుల కేటాయింపులో జరిగిన సాంకేతిక తప్పుల కారణంగా ఒత్తిడి తట్టుకోలేక 20 మందికి పైగా విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో ఇంటర్ బోర్డు పరిపాలన, పరీక్షల డిజిటలైజేషన్ సాఫ్ట్‌వేర్ బాధ్యతలను ‘గ్లోబరీనా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్’ (Globarena Technologies) అనే సంస్థ చూసింది. అయితే, ఆ వివాదం జరిగిన ఆరు నెలల లోపే గ్లోబరీనా సంస్థ తన పేరును ‘కోఎంప్ట్ ఎడ్యు టెక్ ప్రైవేట్ లిమిటెడ్’గా మార్చుకుందని రికార్డులు చెబుతున్నాయి.
ఆ తర్వాత జరిగిన పరిణామాలు రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించాయి. ఈ సంస్థ వెలిసి అప్పటికి ఆరునెలలు మాత్రమే … దీనిపైన కేసు ఏమయిందో .. ఎవరిని శిక్షించారో అప్పటి ప్రభుత్వానికే ఎరుక… హడావిడిగా పేరు మార్చుకుని కొత్త అవతారం ఎత్తి ఈ సారి ఏకంగా సెంటర్ లో నే పాగా వేసింది ఈ సంస్థ… ఒక విధంగా VSN రాజు పట్టువదలని విక్రమార్కుడే…!
CBSE నిర్వహించే పరీక్షల జవాబు పత్రాల డిజిటల్ స్కానింగ్, e-evaluation, టెండర్ ప్రక్రియలో ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)కు గట్టి పోటీ ఇస్తూ, హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ‘కోఎంప్ట్ ఎడ్యు టెక్ ప్రైవేట్ లిమిటెడ్’ (Coempt Edu Teck) ఈ భారీ కాంట్రాక్టును దక్కించుకుంది.
టెండర్ రికార్డుల ప్రకారం.. సాంకేతిక విలువలలో టీసీఎస్ కంటే రెండు మార్కులు ఎక్కువ సాధించడమే కాకుండా, ఆర్థిక బిడ్‌లో భారీ వ్యత్యాసంతో కోఎంప్ట్ ఈ విజయాన్ని అందుకుంది.ఈ ఏడాది సీబీఎస్‌ఈ పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టిన ఆన్-స్క్రీన్ మార్కింగ్ (OSM) పోర్టల్‌లో కొన్ని సాంకేతిక లోపాలు తలెత్తడం, ఫలితాల అనంతర సేవల్లో ఆలస్యం జరగడంపై విద్యార్థులు, మూల్యాంకనదారుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి.
రీ-ఇవాల్యుయేషన్ పోర్టల్ ప్రారంభంలో జరిగిన ఆలస్యం కారణంగా ఈ టెండర్ ప్రక్రియ, సదరు వెండర్ ఎంపికపై ప్రస్తుతం అందరి దృష్టి పడింది.ఈ టెండర్ లో ఎంపిక చేసే సంస్ధ కోసం నిర్వహించే Technical Evaluation Sheet పరిశీలిస్తే, మొత్తం 100 మార్కులకు గాను కోఎంప్ట్ 91 మార్కులు సాధించగా TCS89 మార్కులు పొందింది.
ఉద్యోగుల సంఖ్య, CMMI, ISO సర్టిఫికేషన్లు, సొల్యూషన్ ఆర్కిటెక్చర్, సెక్యూరిటీ, డిజాస్టర్ రికవరీ ప్లానింగ్ వంటి కీలక విభాగాలలో రెండు కంపెనీలూ పూర్తి మార్కులు సాధించి సమవుజ్జీలుగా నిలిచాయి.టర్నోవర్ పరంగా చూస్తే రెండు సంస్థలకూ భారీ వ్యత్యాసం ఉంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ. 2,67,021 కోట్ల ఆదాయం, 5.84 లక్షల మందికి పైగా ఉద్యోగులతో ఉన్న టీసీఎస్‌కు వార్షిక టర్నోవర్ విభాగంలో పూర్తి 5 మార్కులు వచ్చాయి.
గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో రూ. 50 కోట్ల నుంచి రూ. 60 కోట్ల మధ్య టర్నోవర్ నమోదు చేసిన కోఎంప్ట్ ఈ విభాగంలో 2 మార్కులు మాత్రమే సాధించింది. అయితే, మానవ వనరుల సామర్థ్యం (Manpower) విభాగంలో మాత్రం ఇరు కంపెనీల వద్ద 100 కంటే ఎక్కువ మంది సిబ్బంది ఉన్నందున బోర్డు రెండింటికీ గరిష్టంగా 15 మార్కులు కేటాయించింది.
so…. TCS కి ఈ ప్రాజెక్ట్ దక్కలేదు…ఇన్ని అవకతవకలు జరిగి ఇంత గందరగోళం జరుగున్నప్పుడు దీనిపైనా జవాబు చెప్పాల్సిందిగా VSN రాజు అడిగితే ‘పోర్టల్ ను హ్యాక్ చేసిన కుర్రాడు మేము టెస్టింగ్ కోసం వాడిన సర్వర్ని హ్యాక్ చేశాడు అది క్లయింట్ కోసం ఉద్దేశించినది కాదు. అది డమ్మీ టెస్టింగ్ కి కేటాయించినది … పబ్లిక్ కోసం కాదు’ అని గందర గోళపు సమాధానం చెప్పడం గమనార్హం..
లక్షలమంది పిల్లల ఆశలను చిదిమేసిన, దాదాపు ఇరవై మంది పిల్లల ప్రాణాలను తీసుకోడానికి కారణం అయిన ఈ సంస్థని, దాని నిర్వాహకులను ఎం చెయ్యాలో సామాన్య ప్రజలుగా మీరే ఆలోచించండి ..

