చౌక ధరలో గోదావరి టెంపుల్ టూర్ !!

Sharing is Caring...

Godavari Temple Tour IRCTC Package ………..

గోదావరి టెంపుల్ టూర్ పేరుతో IRCTC ఓ కొత్త టూర్ ప్యాకేజ్ తీసుకొచ్చింది. అన్నవరం, అంతర్వేది, ద్రాక్షారామం క్షేత్రాలను ఈ ప్యాకేజీలో దర్శించవచ్చు. ఈ టూర్ లో కొంత భాగం రైలులో కొనసాగుతుంది. ఆయా క్షేత్రాలకు బస్ ద్వారా వెళ్లి వెనక్కి వస్తాం.ఈ ప్యాకేజీలో స్లీపర్ అండ్ థర్డ్ ఏసి అందుబాటులో ఉన్నాయి.

ఈ టూర్ ప్రతి శుక్రవారం లింగంపల్లి నుంచి రాత్రి 08:30 గంటలకు ప్రారంభం అవుతుంది. ప్యాకేజి ని ఎంచుకుని ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవాలి.

DAY1…. శుక్రవారం లింగంపల్లి రైల్వే స్టేషన్ నుంచి రాత్రి 08:30 గంటలకు, సికింద్రాబాద్ రాత్రి 09:15 గంటలకు (రైలు నంబర్ 12738) GOUTHAMI EXPRESS ఎక్కగానే టూర్ మొదలవుతుంది. రాత్రంతా ప్రయాణం చేయాలి.

DAY 2….. శనివారం ఉదయం 04:38 గంటలకు రాజమండ్రి స్టేషన్ చేరుకుంటారు. అక్కడినుంచి హెూటల్లో చెక్ ఇన్ అవుతారు. ఫ్రెషప్ అయ్యాక .. రాజమండ్రి నుంచి 80 కి.మీ దూరంలో ఉన్న అన్నవరం వెళ్లి శ్రీ సత్యనారాయణ స్వామివారి దర్శనం చేసుకొంటారు.సాయంత్రం మళ్లీ రాజమండ్రి తిరిగి వస్తారు. గోదావరి ఘాట్, ఇస్కాన్ ఆలయాన్ని దర్శించి రాత్రి అక్కడే బస చేస్తారు.

DAY 3…. ఆదివారం హెూటల్లో చెక్ అవుట్ చేసి అంతర్వేదికి బయలుదేరుతారు. అక్కడ లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం చేసుకుంటారు ..తర్వాత బీచ్ చూస్తారు. అనంతరం శ్రీ బాల బాలాజీ ఆలయం.. అప్పనపల్లి, విఘ్నేశ్వర ఆలయం.. అయినవల్లి చూస్తారు. సాయంత్రం ద్రాక్షారామం ఆలయ దర్శనం చేసుకొని రాజమండ్రి రైల్వే స్టేషన్ కి చేరుకుంటారు. 08:18 గంటలకు (రైలు నంబర్ 12737 ) GOUTHAMI EXPRESS ఎక్కుతారు. రాత్రంతా ప్రయాణం సాగుతుంది.

DAY 4.. సోమవారం ఉదయం సికింద్రాబాద్ స్టేషన్ కి 04:35 గంటలకు చేరతారు. తర్వాత లింగంపల్లికి 05:55 గంటలకు చేరుకుంటారు. దీంతో టూర్ ముగుస్తుంది.

ఈ ప్యాకేజీలో ట్రావెల్ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. భోజనం .. బ్రేక్ ఫాస్ట్ సదుపాయం లేదు. హోటల్ బస మాత్రమే ఉంటుంది.ప్యాకేజి ధరలు ఇలా ఉన్నాయి. 

అవసరమైతే కింది చిరునామా లో Contact చేయవచ్చు IRCTC – South Central Zone
9-1-129/1/302,3rd Floor, Oxford Plaza,
 S.D. Road, Secunderabad, TelanganaMob: 8287932229 / 8287932228 / 9701360701

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!