‘Kerala Hills and Waters’ IRCTC package …………………..
ప్రకృతి అందాలకు పెట్టింది పేరు కేరళ. ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి భారత్‌తో పాటు విదేశీయులు కూడా క్యూ కడుతుంటారు. మరీ ముఖ్యంగా శీతా కాలంలో కేరళ అందాలను చూడడానికి రెండు కళ్లు చాలవు. ప్రకృతి ప్రేమికుల కోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఆకర్షణీయమైన టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది.
‘కేరళ హిల్స్ అండ్ వాటర్స్’ పేరుతో IRCTC ఈ టూర్ ప్యాకేజీని అందిస్తోంది. హైదరాబాద్ నుంచి కేరళకు 5 రాత్రులు, 6 రోజుల పాటు ఈ టూర్ సాగుతుంది. టూర్ ప్యాకేజీలో భాగంగా మున్నార్, అలెప్పీతో పాటు పలు ప్రకృతి రమణీయ ప్రాంతాలు కవర్ అవుతాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఈ టూర్ ప్రారంభమవుతుంది.
ఈ ‘కేరళ హిల్స్ అండ్ వాటర్స్’ టూర్ ప్యాకేజీలో భాగంగా మొదటి రోజు అంటే డిసెంబర్ 3 వ తేదీన.. మధ్యాహ్నం 12.20 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో రైలు ఎక్కాల్సి ఉంటుంది.
రాత్రంతా ప్రయాణం చేసి.. రెండో రోజు మధ్యాహ్నం 12.55 నిమిషాలకు ఎర్నాకులం రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి మున్నార్ వెళతారు.అనంతరం అక్కడ హోటల్‌లో చెక్ ఇన్ అయిన తర్వాత.. సాయంత్రం మున్నార్ పట్ణణాన్ని వీక్షిస్తారు. రాత్రి బస మున్నార్‌లోనే ఉంటుంది. 4వ రోజు హోటల్‌లో టిఫిన్ చేసిన తర్వాత అలెప్పీకి వెళ్తారు.
అక్కడ హోటల్‌లో చెకిన్ అయిన తర్వాత బ్యాక్ వాటర్ సందర్శన ఉంటుంది. రాత్రి అలెప్పీలోనే బస ఉంటుంది. 5వ రోజు హోటల్ నుంచి చెక్ అవుట్ అయ్యి.. ఎర్నాకులం వస్తారు. అక్కడి నుంచి ఉదయం 11.20 గంటలకు తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది. మరునాడు అంటే 6వ రోజు మధ్యాహ్నం 12.20 గంటలకు సికింద్రాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
ఇక టూర్ ప్యాకేజీ విషయాకొస్తే.. కంఫర్ట్ క్లాస్ లో సింగిల్ షేరింగ్ రూ. 32,830, డబుల్ షేరింగ్‌కు రూ. 19,070గా నిర్ణయించారు. ఇక ట్రిపుల్ షేరింగ్ విషయానికొస్తే రూ. 15,590గా ఉంది. స్టాండర్డ్ క్లాస్‌లో సింగిల్ షేరింగ్‌కు రూ. 30,130.. డబుల్ షేరింగ్‌కు రూ.16,370… ట్రిపుల్ .రూ 12,880 గా నిర్ణయించారు.
5 నుంచి 11 ఏళ్ల చిన్నారులకు ప్రత్యేక ధరలు ఉంటాయి. పూర్తి వివరాలు, ప్యాకేజీని బుక్ చేసుకోవడం కోసం IRCTC వెబ్సైట్ ను సందర్శించండి.లేదా ఈ క్రింది నంబర్లకు ఫోన్ చేయండి.. 9701360701,9281495843…. ప్రతి మంగళవారం ఈ ప్యాకేజ్ అందుబాటులో ఉంటుంది. నల్గొండ, గుంటూరు,తెనాలి ప్రాంత వాసులు కూడా ఆయా స్టేషన్స్ నుంచి రైలు ఎక్కవచ్చు.