ఈ విగ్రహాల మిస్టరీ ఏమిటో ?

Sharing is Caring...

పై ఫొటోలో కనిపించే  విగ్రహాలను ఎవరు స్థాపించారు ? ఆ ప్రదేశానికి ఎలా వచ్చాయి ? వీటి ద్వారా ఏ సందేశం ఇస్తున్నారు అనే విషయాలు ఇప్పటికి ఎవరికి తెలీవు. ఈ విగ్రహాలు మటుకు ఈస్టర్ ద్వీపం లో ఉన్నాయి. ఈ ద్వీపం చిలీ దేశానికి పశ్చిమంగా దక్షిణ పసిఫిక్‌ మహాసముద్రంలో 3,800 కి.మీ దూరంలో ఉంది.  చిలీ నియంత్రణలో ఈ ద్వీపం ఉంది. 

ఈ ద్వీపం ప్రపంచంలోనే అత్యంత తక్కువ జనాభా ఉన్న ఒంటరి ద్వీపం. అతి చిన్నది కూడా. దీన్నే రపనుయి ద్వీపంగా కూడా పిలుస్తారు. ఎపుడో కొన్నివేల ఏళ్ళ నాడు ఇక్కడ ఈ  విగ్రహాలను స్థాపించారని అంటారు.ఈ విగ్రహాలకు మనిషి ఆకృతిని పోలిన ముఖాలు మాత్రమే ఉంటాయి. కాళ్ళు, చేతులు ఉండవు. 1955 లో అక్కడికి వెళ్లిన పురావస్తు పరిశోధకులు వీటి గురించి కూపీ లాగేందుకు ప్రయత్నించారు.

ఒక్కో విగ్రహం ఎత్తు 3 నుండి 36 అడుగులు మేర ఉంటుంది. బరువు 20 టన్నుల వరకు ఉంటుందని అంచనా. వెయ్యికి పైగా ఇటువంటి శిల్పాలు అక్కడ ఉన్నాయని పరిశోధకులు కనుగొన్నారు. ఈ విగ్రహాలను ఎవరు నిర్మించారో చెప్పలేకపోయారు. అసలు ఆ విగ్రహాల అమరికను ను చూస్తే అబ్బురమనిపిస్తుంది. వీటిని మోయి విగ్రహాలు అంటారు.  

అంత బరువైన విగ్రహాలను ఎలా నిలబెట్టారో మరి ?పాలినేసియన్‌ ప్రజలు వీటిని నిర్మించారని ఒక వాదన ప్రచారం లో ఉంది. అక్కడ దొరికిన రుజువులను బట్టి ఈస్టర్‌ ద్వీపవాసులు ఈ శిల్పాలను నిర్మించారని పరిశోధకులు అంచనా వేశారు. విగ్రహాలను ఎక్కడో తయారు చేసి లాగుడు బండ్లపై ఇక్కడికి తరలించారని భావిస్తున్నారు.

అప్పట్లో ఈ ద్వీపంలో ఇరవై వేలకు పైగా జనాభా ఉండేవారట. కాలక్రమంలో జనాభా సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. అందుకు దాడులు, వలసలు, ప్రకృతి వైపరీత్యాలే కారణమని గుర్తించారు. ఒక దశలో అంటే 1877 నాటికి 111 మంది మాత్రమే అక్కడ నివాసం ఉన్నట్టు సమాచారం. కాలక్రమేణా జనాభా సంఖ్య పెరుగుతోంది .. 2012 నాటికి 5167 మంది జనాభా ఉండగా, ఆసంఖ్య 2023 నాటికి 8,600 కి పెరిగింది

ఈ దీవికి దగ్గర్లో ఉన్న దీవుల్లో కూడా జనావాసాలు తక్కువగా ఉన్నాయట. 1888 లో ఈస్టర్‌ ద్వీపాన్నిచిలీ దేశం స్వాధీనం చేసుకుంది. ప్రస్తుతం చిలీలో ఈస్టర్ ప్రత్యేక భూభాగం.ఇక్కడ వాతావరణం చల్లగా ఉంటుంది. ప్రస్తుతం ఇక్కడ తక్కువగా జనావాసాలున్నాయి.

చిలీ నుంచి విమాన సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. అక్కడ విగ్రహాలు , జాతీయ ఉద్యానవనం తప్ప మరేమీ చూసేందుకు లేవు. అయినా ఇక్కడి ప్రత్యేకమైన సంస్కృతిని చూడటానికి ప్రపంచం నలుమూలల నుండి పర్యాటకులు వస్తుంటారు. ఇక్కడ  డాక్యుమెంటరీ ఫిలిమ్స్ తీస్తుంటారు.  

—————— KNM

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!