వేలిపై వేసే సిరా చుక్కకు డిమాండ్ అంత ఇంతా కాదు !!

Sharing is Caring...

This ink is used to prevent fake votes………

ఓటు వేసే సమయంలో వేలిపై వేసే సిరా చుక్క కనీసం 72 గంటల వరకు చెరిగిపోకుండా ఉంటుంది. వేలిపై నీరు పడితే  ఇది మరింత నలుపుగా మారి ఎక్కువ సమయం ఉంటుంది. ఈ సిరా తయారీలో సిల్వర్‌ నైట్రేట్‌ను ఉపయోగిస్తారు. ఆకారణంగానే  సిరా చెరిగిపోకుండా ఉంటుంది. దీని వల్ల ఒకే వ్యక్తి  మళ్ళీ వచ్చి ఓటు వేయడం కుదరదు.  నకిలీ ఓట్లు వేయడాన్ని నిరోధించేందుకు ఈ సిరా ను ప్రత్యేకంగా ఉపయోగిస్తారు.

ఈ సిరాను మైసూర్ పెయింట్స్ కంపెనీ తయారుచేస్తుంది.  ఈ సిరా కు డిమాండ్ కూడా బాగా ఉంది. ఈ సిరాను ఉత్పత్తి చేయడానికి భారతదేశంలో అధికారం కలిగిన ఏకైక సంస్థ మైసూర్ పెయింట్స్ మాత్రమే. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈ సంస్థకు  రూ.55 కోట్ల ఆర్డర్‌ జారీ చేశారు. యుద్ధ ప్రాతిపదికన ఆ సంస్థ సిరా తయారు చేస్తున్నది.

ఎన్నికల కమీషన్ ఆర్డర్ మేరకు  26.55 లక్షల సిరా బాటిళ్ల ను సరఫరా చేసేందుకు సంస్థ ఏర్పాట్లు చేసింది.10 mg ఇంక్‌ ఉండే ప్రతి సీసా దాదాపు 700 మంది ఓటర్ల కోసం ఉపయోగిస్తారు.. నకిలీ ఓట్లను నియంత్రిచేందుకు దీనిని మించిన సాధనం లేదు.  2024 సార్వత్రిక ఎన్నికల కోసం సంస్థ అందుకున్న ఆర్డర్ అతిపెద్దది. ఇప్పటికే సంస్థ ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూ అండ్‌ కాశ్మీర్‌కు  సిరా బాటిళ్లను సరఫరా చేసింది.   కేరళ , కర్ణాటక , ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లకు సిరా ను పంపిణీ చేయబోతున్నది.

సంస్థ దేశీయ అవసరాలను తీరుస్తూనే .. ఎగుమతి ఆర్డర్‌లను కూడా అమలు చేస్తున్నది.  ప్రపంచవ్యాప్తంగా ఎన్నోదేశాలు  ఓటింగ్ ప్రక్రియలో ఈ సంస్థ సిరానే ఉపయోగిస్తున్నాయి.  ప్రతి ఎన్నికకు  ఓటర్ల సంఖ్య పెరుగుతున్న క్రమంలో సంస్థ ఉత్పత్తికి డిమాండ్ కూడా పెరుగుతున్నది. ఇటీవలే  కంబోడియా, ఫిజి దీవులు, సియెర్రా లియోన్, గినియా-బిస్సావు వంటి దేశాలకు సిరాను ఎగుమతి చేసింది.  మరికొన్ని దేశాలనుంచి ఆర్దర్లు అందుకున్నది.

వేలిపై వేస్తె చెరగని ఇంక్ ఫార్ములేషన్‌లో కీలకమైన సిల్వర్ నైట్రేట్ ధర హెచ్చుతగ్గుల కారణంగా, ప్రతి సీసా ధర మారింది. గత  ఎన్నికలలో రూ.160 కి ఇవ్వగా దాన్ని  రూ. 174 కి సవరించింది.  సంస్థ  సాంప్రదాయ గ్లాస్ వైల్స్‌కు ప్రత్యామ్నాయంగా మార్కర్ పెన్నులను అభివృద్ధి చేసే అవకాశాలను పరిశీలిస్తున్నది. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం చారిత్రాత్మక ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో  చెరగని సిరా ను తయారు చేస్తున్న సంస్థ కర్ణాటక ప్రభుత్వ రంగ సంస్థ కావడం విశేషం.

కెమికల్-రెసిస్టెంట్ పెయింట్స్, ఎనామెల్స్ , ప్రైమర్స్ , డిస్టెంపర్స్ , సీలింగ్ వాక్స్ , పోస్టల్ స్టాంప్ క్యాన్సిలేషన్,  పాలిష్‌లు వంటి ఇతర ఉత్పత్తులను కూడా సంస్థ  తయారు చేస్తుంది. ఈ సంస్థను 1937లో మహారాజా కృష్ణరాజ వడియార్ IV  స్థాపించారు. తర్వాత కాలంలో ప్రభుత్వం  స్వాధీనం చేసుకుని నడుపుతోంది.

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!