అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా , న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.

రణరంగంగా మారిన తైవాన్ పార్లమెంట్ !!

తైవాన్ పార్లమెంట్‌  రణరంగం గా మారింది. సభ్యులు పరస్పరం దాడులకు దిగారు.  అమెరికా నుంచి పంది, గొడ్డు మాంసం దిగుమతిపై తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. ఈ అంశంపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య  తీవ్ర వాగ్యుద్ధం జరిగింది. అంతటితో ఆగకుండా ఒకరిపై ఒకరు మాంసం ముద్దలు విసురుకుంటూ, పిడిగుద్దులకు దిగారు. దీంతో సభలో  కొంత …

ఇదే రామాయణం నాటి పంపా సరోవరం !

మన దేశంలో ఎన్నో సరోవరాలు ఉండగా, వాటిలో ఐదు ‘పంచ సరోవరాలు’ గా ప్రసిద్ధికెక్కాయి. వాటిలో మానస సరోవరం, పంపా సరోవరం, పుష్కర్‌ సరోవరం, నారాయణ సరోవరం, బిందు సరోవరం ఉన్నాయి. ముందుగా  పంపా సరోవరం గురించి తెలుసుకుందాం. పంపా సరోవరం కర్ణాటక రాష్ట్రంలోని హంపీకి దగ్గర్లో ఉంది. ఈ సరోవరం రామాయణకాలం నాటిదని ప్రతీతి. …

వ్యధార్త జీవుల యదార్ధ చిత్రం !

”పడమటి కనుమలు” ( మేర్కు తొడర్చిమలై  ) తమిళ సినిమా  ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. ఇది పడమటి కనుమలలోని మున్నార్ అడవులు,కొండలపై జరిగిన కత.ఆ పెద్దపెద్ద కొండలకు దిగువన తమిళనాడులోని ఒక చిన్న పల్లెలో కత ప్రారంభమవుతుంది. ఆ పల్లె నుండి మున్నార్ కొండలపై వుండే ఏలక్కాయ తోటల్లో,ఆ పల్లె ప్రజలు కూలీలుగా పనిచేస్తుంటారు.ఇక్కడ ఎత్తయిన పడమటి …

దుమ్మెత్తి పోసుకుంటున్న నేతలు … మౌనంగా చూస్తున్న ఓటర్లు !

హైదరాబాద్ ‌జీహెచ్ ఎంసీ  ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. రాజకీయ పార్టీల నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు.  ప్రధానంగా   బీజేపీ-ఎంఐఎం పార్టీల నేతల  ప్రసంగాలు దుమారం రేపుతున్నాయి. నేతలు పదునైన విమర్శలు కలకలం రేపుతున్నాయి. ముందెన్నడూ ఈ రీతిలో ప్రచారం జరగలేదు. ఎన్నికలు దగ్గర పడేకొద్దీ విమర్శలు .. వాగ్గానాల జోరు కూడా …

మౌన వ్యూహంలో మర్మం ఏమిటో ?

‘పయ్యావుల కేశవ్’ కు చురుకైన నాయకుడని పేరుంది . కానీ గత కొంత కాలంగా ఆయన మౌనంగా ఉంటున్నారు.  ఆ మద్య బీజేపీ లో చేరబోయి మళ్ళీ వెనుకడుగు వేశారని కూడా అంటారు. గత ఎన్నికల్లో  టీడీపీ నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల‌లో కేశవ్ ఒక‌రు. 2019లో వైసీపీ గాలులు వీచినప్పటికీ తట్టుకుని ఉరవకొండ …

చూడాల్సిన క్షేత్రం ‘ఘటిక సిద్ధేశ్వరం’ !     

అత్యంత ప్రాచీన శైవక్షేత్రాల్లో ఘటిక సిద్దేశ్వరం ఒకటి. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దానికి పూర్వం ఇక్కడ ఆలయం వెలసినట్లు స్థల పురాణం చెబుతోంది. సప్త రుషులలో ఒకరైన అగస్త్య మహర్షి ఈ క్షేత్రంలో తపస్సు చేసి ఉమామహేశ్వరుల కల్యాణం జరిపినట్లు నిత్యనాథసిద్ధాచార్యులు రసరత్నాకర గ్రంథంలో పేర్కొన్నట్టు చెబుతారు.ఇక్కడి  శివుడు సిద్దేశ్వరునిగా, అమ్మవారు ఇష్టకామేశ్వరిగా కొలువై వున్నారు. …

ఎవరీ స్టిల్స్ భూషణుడు ?

డ్రీమ్ గాళ్ హేమమాలిని, గ్లామర్ స్టార్ కాంచన, అభినేత్రి వాణిశ్రీ ఇలా అనేక మంది తారల తొలి మేకప్ స్టిల్స్ తీసిన ఖ్యాతి గొల్లపల్లి నాగ భూషణరావు అలియాస్ స్టిల్స్ భూషణ్ ది.   బాపు తీసిన దాదాపు అన్ని సినిమాలకూ భూషణే స్టిల్ ఫొటోగ్రాఫర్. ఏవో చిన్న అభిప్రాయబేదాలతో సంపూర్ణ రామాయణం మరింకేదో సినిమాకు ఆయన పనిచేయలేదు. తప్ప …

మందు బాబులను మించిన విశ్లేషకులు లేరబ్బా!

ఉన్నట్లుండి పొద్దున్నే వర్షం మొదలైంది. రైతు బజారు నుంచి వస్తుండగా ఊహించని వాన ఊపందుకుంది. కనీసం గొడుగైనా చేతిలో లేకపోవడంతో గబాలున ఎదురుగా కనిపించిన ఆటో స్టాండు దగ్గరకు పరుగెత్తాను. వరుసగా పదికి పైగా ఆటోలు పార్క్ చేసున్నాయి. అందరు ఆటో డ్రైవర్లూ కలిపి రెండు ఆటోల్లో సర్దుకుని మాటా మంతీ ఆడుతున్నారు. సరిగ్గా వారి …

అధినేత్రి నిర్ణయాల వెనుక సలహాలు ఆయనవే !

అహ్మద్ పటేల్ ..కాంగ్రెస్ నేతల్లో ఆయన తెలియని వారుండరు. అందరూ ఆయనను  అహ్మద్ భాయి అని పిలుస్తారు. ఇందిరా, రాజీవ్,సోనియా,రాహుల్ గాంధీ లకు ఆయనే సలహాదారుడిగా పనిచేశారు. గాంధీ కుటుంబానికి అత్యంత నమ్మకమైన వ్యక్తి. ఇబ్బందుల్లో ఉన్న సమయాల్లో ఆయన వ్యూహాలే పార్టీ ని ముందుకు నడిపించాయి. గుజరాత్ కి చెందిన అహ్మద్ పటేల్ గాంధీ …
error: Content is protected !!