అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా , న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.

నాదెండ్ల తో నాలుగు మాటలు !!

నాదెండ్ల భాస్కరరావు. 1984 లో ఆయనకొక సంచలనం.  అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ను పదవి నుంచి దించేసి తాను సీఎం అయ్యారు. 1983లో ఎన్టీఆర్‌ తెలుగు దేశం పార్టీ ని స్థాపించినప్పుడు నాదెండ్ల ఆయనతో కలిసి నడిచారు. నాడు  ఎన్టీ రామారావు సీఎం గా నాదెండ్ల భాస్కరరావు  ఆర్థిక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. …

కోట్లు ఆర్జించిన స్టార్ కొరియోగ్రాఫర్ చివరికి అలా ..

Star choreographer………………………………….. ముఖ్యమంత్రులు గా చేసిన సినీ స్టార్స్ చేత అదిరిపోయే స్టెప్పులు వేయించిన ఖ్యాతి ఆయనది. ఆ రోజుల్లో ఆ పాటలు,నృత్యాలు చూసి ప్రేక్షకులు ఈలలు, కేకలు, చప్పట్లతో హర్షం వ్యక్తం చేసేవారు. ముఖ్యమంత్రులు అయిన సినీ స్టార్స్ ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలితలు కాగా వారిచే స్టెప్పులు వేయించింది మరెవరో కాదు సలీం. డాన్స్ …

జైల్లో ఆమరణ దీక్ష చేయబోతున్నసాయిబాబా !

నాగ్ పూర్ సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ప్రొఫెసర్ సాయిబాబా ఈ నెల  21 వ తేదీ నుండి ఆమరణ నిరాహార దీక్ష‌ చేపట్టాలని నిర్ణయించారు. 90 శాతం అంగవైకల్యంతో సహా అనేక రకాల అనారోగ్యాలతో ఇబ్బంది పడుతున్న సాయిబాబాకు జైలు అధికారులు సరైన వైద్యం అందించడం లేదు. కుటుంబ సభ్యులు ఇచ్చిన మందులను కూడా ఆయనకు చేరనివ్వడం లేదు. ఖైదీల …

అబ్బబ్బా… అంబాజీ పేట పొట్టిక్కల రుచే వేరు !!

అమలాపురం దగ్గర్లోని అంబాజీపేట… పొట్టిక్కలకు ఫేమస్. ఇక్కడ తయారయ్యే పొట్టిక్కలు.ఇడ్లీలాంటివే. కానీ ప్రత్యేకమైనవి. ఇవి కూడా ఇడ్లీ లాగానే ఆవిరిపై వుడుకుతాయి. అయితే, పనస ఆకుల్లో చుట్టి వండుతారు వీటిని. ఇడ్లీలాగానే వుండే ఈ వంటకానికి ఇడ్లీకన్నా ఎక్కువ డిమాండ్ వుంటుంది. కొబ్బరికాయల వ్యాపారం నిమిత్తం ఇతర ప్రాంతాలనుంచి వచ్చేవారు పొట్టిక్కలంటే పడిచస్తారు. పొట్టిక్కలకు ఆ …

ఉండవల్లి కి క్లాస్ పీకిన కేసీఆర్ ! ఎపుడు .. ఎలా ?

కాంగ్రెస్ నాయకుడు ఉండవల్లి అరుణ్ కుమారుడికి తెరాస నేత కేసీఆర్ (సీఎం కాక ముందు) ఒక సందర్భంలో క్లాస్ పీకారట. ఈ ఘటన గురించి స్వయంగా ఉండవల్లి అరుణ్ కుమార్  చెప్పారు. ఇది జరిగింది  ఇపుడు కాదు ..2005 జులై 20 వ తేదీన.  ఢిల్లీ వెళ్లే  విమానంలో కేసీఆర్ , ఆలే నరేంద్ర , ఉండవల్లి …

జగన్ లేఖపై మన లాయర్ల ది వ్యూహాత్మక మౌనమా ?

ఏపీ సీఎం జగన్  సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కి రాసిన లేఖ పై ఢిల్లీ న్యాయవాదులు స్పందిస్తున్నారు కానీ తెలుగు రాష్ట్రాల నుంచి ఏ లాయర్ కూడా స్పందించినట్టు కన్పించలేదు. జగన్ సీజే కి లేఖ రాయడం పై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఢిల్లీ బార్ అసోసియేషన్, మరి కొంతమంది లాయర్లు విరుచుకుపడ్డారు. …

బతకటానికి..జీవించడానికి తేడా వివరించే గొప్ప పుస్తకం !

MNR……………………………………………………… బహుశా రివ్యూలకు అందనిది ఈ పుస్తకం అనేది నా భావన. అందుకే నా అనుభూతిని మాత్రమే రాస్తున్నాను. నాకు తెలియని మిత్రులకి నన్ను పరిచయం చేశావు. నావి కాని ఇళ్లల్లో నాకు స్థానాన్నిచ్చావు.దూరాన్ని దగ్గర చేసి, పరదేశిని నా సోదరుడుగా మార్చావు. – రవీంద్ర నాథ్ ఠాగూర్.ఈ వాక్యాలు రవీంధ్రనాథ ఠాగూర్ రాశారు. వాటిని …

‘నవత’రం మెచ్చిన నిర్మాత కృష్ణంరాజు !

కేవలం డబ్బు సంపాదనే కాకుండా…అభిరుచితో చలన చిత్ర ప్రవేశం చేసిన నిర్మాతల్లో నవతా కృష్ణంరాజు ఒకరు. ఆయన నిర్మించిన చిత్రాలకు ప్రేక్షకుల్లో స్పెషల్ క్రేజ్ ఉండేది. దర్శకుడు ఎవరు? హీరో ఎవరు లాంటి వేమీ పట్టించుకునేవారు కాదు ఆడియన్సు. అది నవతా కృష్ణంరాజు తీసిన సినిమా అంతే…డెఫినెట్ గా బాగుంటుందనే నమ్మకం. ఆ నమ్మకాన్ని చివరి …

సాల్జ్ బర్గ్ మంచు గుహల్లో భారీ శివలింగం !

అమర్నాథ్ గుహల్లో కొలువైన  మంచు శివలింగం గురించి అందరికి తెలుసు . అలాంటిదే  పై ఫొటోలో కనిపించే భారీ మంచు శివలింగం. ఈ శివలింగాన్నిదర్శించేందుకు కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వెళ్తుంటారు. ఆస్ట్రియా రాజధాని సాల్జ్ బర్గ్ కి సమీపంలో 40 కిలోమీటర్లు మేరకు విస్తరించిన మంచు గుహలు ఉన్నాయి. అందులో ఈ భారీ మంచు …
error: Content is protected !!