ఆ ‘థియోపెట్రా’ గుహల్లో ఏముంది ??

Sharing is Caring...

Researches of archaeologists………………….

ఆదిమానవుల ఉనికి ఉందని చరిత్రకారులు చెబుతూనే ఉన్నారు.  అందుకు చారిత్రక ఆధారాలు ఏమిటి అనే అంశంపై పురావస్తు శాస్త్రవేత్తలు ఇప్పటికీ పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. గ్రీస్‌ లోని థెస్సాలీలో మధ్య గ్రీకు ప్రాంతంలో థియోపెట్రా అనే గుహ వద్ద పురావస్తు శాఖ ఎన్నో ఏళ్లుగా తవ్వకాలు నిర్వహించింది.

ఆ తవ్వకాల్లో మానవజాతి మూలాలు కొన్నిబయట పడ్డాయి. మనుషుల ఎముకలు, వారు ఉపయోగించిన రాతి పనిముట్లు, జంతువుల ఎముకలు, పురాతన మానవ నిర్మిత నిర్మాణాలను పరిశోధకులు కనుగొన్నారు. 130 వేల ఏళ్ల క్రితం నుంచే మానవులు ఉన్నారని రేడియో కార్బన్‌ ఆధారాలు చెబుతున్నాయి. వారిలో నియాండర్తల్‌ అనే మానవ జాతి  ఒకటని పరిశోధకులు చెబుతున్నారు. 

పరిశోధకులు చెప్పిన మేరకు ఈ జాతి వారు బలిష్టంగా కండలు తిరిగి ఉండేవారని, విచిత్రమైన కనుబొమ్మలు, పొడుచుకుని వచ్చినట్లు ముక్కులు కలిగి ఉండేవారు.  ఈ నియాండర్తల్‌ జాతి  … మానవుల జీవన  విధానం కంటే భిన్నంగా జీవితాన్ని గడిపేవారు. కొన్ని రకాల అడవి జంతువులను వేటాడే వారు.

తమను తాము రక్షించుకునేందుకు కఠినమైన గుహ వాతావరణంలో జీవించేవారు. ఐరోపా అంతటా ఉన్న గుహల్లో వీరు ఉండేవారు. అంతేగాదు థియో పెట్రా గుహ వారు నిర్మించిన గుహల్లో ఒకటి. ఇక్కడ నుంచి మానవులు సుమారు 50 వేల ఏళ్ల క్రితం నిష్క్రమించారు. ఈ త్రవ్వకాలలో  2 నుండి 7 సంవత్సరాల వయస్సు గల పిల్లలుగా భావిస్తున్న నలుగురు వ్యక్తుల పాదముద్రలను కనుగొన్నారు.

తర్వాత కాలంలో మరో మానవ జాతి .. గొర్రెల కాపర్లు కూడా ఈ గుహలను వినియోగించారు.  గుహలో దొరికిన వస్తువులలో పురాతన శిలాయుగం, మధ్యశిలాయుగం, నియోలిథిక్ కాలానికి చెందిన రాతి పనిముట్లు, అలాగే నియోలిథిక్ కుండలు, ఎముకలు,  15000, 9000.. 8000 BC నాటి అస్థిపంజరాలు .. ఆహారపు అలవాట్లను తెలియ జెప్పే మొక్కలు విత్తనాలు  ఉన్నాయి.

థియోపెట్రా గుహ ముందు  23,000 సంవత్సరాల నాటి పురాతన రాతి గోడ ఉంది. చల్లని గాలుల నుంచి నివాసితులను రక్షించడానికి ఈ ఎత్తైన గోడ నిర్మించి ఉంటారని భావిస్తున్నారు. ఆ నాటి మానవ నిర్మిత నిర్మాణానికి ఇది ఒక ఉదాహరణ!

1987 నుంచి ఇక్కడ  తప్పకాలు జరుగుతున్నాయి. ఈ గుహ ఒక లోయ పైన సుమారు వంద మీటర్లు(330 అడుగులు) వరకు విస్తరించి ఉంది. దీన్ని థియోపెట్రా రాక్‌ అని పిలిచే వారు.ఈ గుహకు సమీపంలో పినయోస్‌ నదికి చెందిన లెథాయోస్‌ అనే ఉప నది ప్రవహిస్తుంది.

పురావస్తు పరిశోధకులు మొదట్లో  థియోపెట్రా గుహ స్థానిక గొర్రెల కాపరులు తమ జంతువులును ఉంచడానికి తాత్కాలిక ఆశ్రయంగా ఉపయోగించేవారని భావించారు. కానీ ఈ గుహ తవ్వేకొద్ది కొత్త విషయాలు బయట పడ్డాయి. ఈ గుహ ఉన్న ప్రదేశాన్ని మ్యూజియం గా మార్చారు. ఎవరైనా సందర్శించవచ్చు.

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!