ఇదొక డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ !!

Sharing is Caring...

 Crime thriller……….

‘మర్డర్ ఇన్ మాహిమ్’ (Murder in Mahim)  క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇది . జెర్రీ పింటో రాసిన నవల ఆధారంగా దర్శకుడు రాజ్ ఆచార్య దీనిని తెరకెక్కించారు.

కథాంశం ఏమిటంటే ?
ముంబైలోని మాహిమ్ రైల్వే స్టేషన్ పబ్లిక్ టాయిలెట్‌లో ఒక యువకుడి శవం అత్యంత ఘోరమైన స్థితిలో దొరుకుతుంది. ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేయడానికి సీనియర్ పోలీస్ ఆఫీసర్ శివాజీ జెండే (విజయ్ రాజ్) రంగంలోకి దిగుతాడు. ఈ విచారణలో అతనికి తన పాత స్నేహితుడు, రిటైర్డ్ జర్నలిస్ట్ అయిన పీటర్ డిసౌజా (అశుతోష్ రాణా) సహాయం చేస్తాడు.

ఆ తర్వాత జరిగే వరుస హత్యలన్నీ ముంబైలోని గే కమ్యూనిటీ (LGBTQ+) చుట్టూ తిరుగుతుంటాయి. ఈ క్రమంలో పీటర్ తన సొంత కొడుకు రహస్యాన్ని కూడా తెలుసుకోవాల్సి వస్తుంది. అసలు ఆ హత్యలు చేస్తుంది ఎవరు? ఎందుకు చేస్తున్నారు? అనేదే ఈ సిరీస్ కథ.

విజయ్ రాజ్ , అశుతోష్ రాణా లాంటి సీనియర్ నటులు తమ అద్భుతమైన నటనతో ఈ సిరీస్‌ను నిలబెట్టారు.కేవలం ఒక సాధారణ మర్డర్ మిస్టరీలా కాకుండా, సమాజంలో LGBTQ+ కమ్యూనిటీ ఎదుర్కొనే వివక్ష, మానసిక సంఘర్షణ,వారిపై జరిగే నేరాలను దర్శకుడు చాలా సెన్సిటివ్‌గా, ఎక్కడా హద్దులు దాటకుండా చూపించారు.

అశుతోష్ రాణా అతని కొడుకు మధ్య వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్, మారుతున్న సమాజాన్ని ఒక తండ్రి ఎలా అర్థం చేసుకోవాలో చెప్పే విధానం హృదయానికి హత్తుకుంటుంది. 2013 కాలం నాటి ముంబై నగరాన్ని, మాహిమ్ పరిసరాలను సినిమాటోగ్రఫీ ద్వారా చాలా డార్క్‌గా, నైపుణ్యంతో ఆవిష్కరించారు

ఇదొక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అయినప్పటికీ, కథ  నెమ్మదిగా సాగుతుంది. కొన్నిఎపిసోడ్లలో ల్యాగ్ ఎక్కువగా ఉండటం వల్ల థ్రిల్ ఆశించే ప్రేక్షకులకు కాస్త ఓపిక అవసరం. సిరీస్ చివరి 2 ఎపిసోడ్లకు వచ్చేసరికి అసలు విలన్ ఎవరు అనేది సస్పెన్స్ ప్రియులు సులభంగా ఊహించేయవచ్చు. క్లైమాక్స్ ట్విస్ట్ అంతగా షాక్ ఇవ్వదు.కథలో సస్పెన్స్ పెంచడానికి ప్రవేశపెట్టిన కొన్ని సపోర్టింగ్ క్యారెక్టర్లను ముగింపులో సరిగ్గా వాడుకోకుండా వదిలేశారు.

ఈ వెబ్ సిరీస్ మొత్తం 8 ఎపిసోడ్లుగా సాగుతుంది. కథనం అక్కడక్కడా కాస్త నెమ్మదించినప్పటికీ, సిరీస్‌లో ప్రేక్షకులను ఆకట్టుకునే  భావోద్వేగాలకు గురిచేసే సన్నివేశాలు, ఎపిసోడ్స్ కూడా ఉన్నాయి. సిరీస్ ప్రారంభమే చాలా ఆసక్తికరంగా ఉంటుంది.

ఎపిసోడ్ 4 , 5  బాగుంటాయి. ఈ రెండు ఎపిసోడ్లు సిరీస్‌కే గుండెకాయ లాంటివి. ఇన్వెస్టిగేషన్ ముదురుతున్న కొద్దీ, కేవలం బయటి వ్యక్తులే కాదు.. అశుతోష్ రాణా (పీటర్) సొంత కుటుంబ సభ్యులు కూడా ఈ గే కమ్యూనిటీ మర్డర్ మిస్టరీ వలలో చిక్కుకున్నారనే నిజం బయటపడుతుంది.

ఒక వైపు విజయ్ రాజ్ డిపార్ట్‌మెంట్ ఒత్తిడిని తట్టుకుంటూ విచారణ చేయడం, మరోవైపు అశుతోష్ రాణా తన సొంత కొడుకు రహస్యాన్ని తెలుసుకుని షాక్‌కు గురయ్యే ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి.

వరుస హత్యలు చేస్తున్న అసలు కిల్లర్ ఎవరు అనేది చివరి ఎపిసోడ్‌లోనే బయటపడుతుంది.విజయ్ రాజ్,  అశుతోష్ రాణా ఇద్దరూ కలిసి కిల్లర్‌ను పట్టుకోవడానికి వేసే ప్లాన్, ముగింపు ప్రేక్షకుడికి నచ్చుతాయి.  

ఈ వెబ్ సిరీస్‌లో విజయ్ రాజ్ తండ్రి పాత్ర పేరు దుల్లార్ జెండే ఈ పాత్రను ప్రసిద్ధ సీనియర్ నటుడు, సీఐడీ (CID) సీరియల్ ఫేమ్ శివాజీ సతామ్ పోషించారు. ఆ పాత్రను మలచిన తీరు బాగుంది.  తండ్రి చేసిన తప్పు వల్ల సమాజంలో ఎదురైన అవమానం కొడుకైన శివాజీ జెండే (విజయ్ రాజ్) మనసులో ఒక పెద్ద గాయంగా మిగిలిపోతుంది. అందుకే అతను తన తండ్రిని పూర్తిగా క్షమించలేడు.

ఇద్దరి మధ్య ఒక రకమైన నిశ్శబ్ద యుద్ధం, కోపం,అసహనం నిరంతరం కొనసాగుతుంటాయి. తండ్రిపై ఉన్న ఆ కోపమే విజయ్ రాజ్ పాత్రలో ఎప్పుడూ ఉండే చిరాకు, కోపానికి  ప్రధాన కారణం. ఆ ఫ్రస్ట్రేషన్ అతని సొంత భార్యాపిల్లలపై కూడా ప్రభావం చూపుతుంది.సిరీస్‌లో ఈ తండ్రి-కొడుకుల మధ్య వచ్చే సంభాషణలు చాలా రియలిస్టిక్‌గా ఉంటాయి. 

మొత్తం మీద చూస్తే, అశుతోష్ రాణా-అతని కొడుకు మధ్య ఉండే ఆధునిక జనరేషన్ గ్యాప్ ఒక వైపు ఉంటే.. విజయ్ రాజ్-శివాజీ సతామ్ మధ్య ఉండే ఇగో. తండ్రి తాలూకు తప్పుల ప్రభావం ఈ సిరీస్‌ను మరింత రక్తికట్టించాయి.. లేడీ si రబ్బానీ, ఆమె స్నేహితురాలి (రెహనా) ల మధ్య వచ్చే కొన్ని నిశ్శబ్ద సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.  

సంగీత దర్శకుడు నీల్ అధికారి ఈ సిరీస్‌కు కథనానికి తగ్గట్టుగా ఎంతో విలక్షణమైన, డార్క్ థీమ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు.LGBTQ+ కమ్యూనిటీని అటు పోలీసులు ,కొందరు స్వార్ధపరులు ఎలా దోపిడీ చేస్తున్నారో రాజ్ ఆచార్య ఆసక్తికరంగా తెరకెక్కించారు ఈ సిరీస్  jio hot star  తెలుగు వెర్షన్ లో ఉంది.. ఆసక్తి ఉన్నవారు చూడవచ్చు.  

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!