మహనీయుడు ఆదిశంకరుడు !!

Sharing is Caring...

హిందూ మతం ప్రమాదంలో ఉందా. సనాతన ధర్మానికి ముప్పు రాబోతుందా.ఇది కేవలం రాజకీయ నినాదం అని ఒక వర్గం,కాదు కళ్ళముందరి నిజాన్నిచూడలేని స్థితిలో హిందువులు బతుకుతున్నారు అని ఇంకో వర్గం వాద ప్రతివాదాలు చేస్తుంటాయి. వారు దేని ఆధారంగా ఇలాంటి వాదాలు మొదలుపెట్టారు, వారిలోఎవరి వాదన నిజం అన్నది పక్కన పెడితే……. 

ఒకానొక సందర్బంలో దేవుడు అన్న భావనే మాయం అయ్యి,యజ్ఞ యాగాలు,పూజా,పునస్కారాల సంస్కృతికి ముప్పు వాటిల్లే స్థితి దాపురించింది అన్నది చరిత్ర చెపుతున్న సత్యం. అలాంటి కఠిన పరిస్థితులు నుండి హిందూ మతాన్ని, సనాతన ధర్మాన్నీ రక్షించిన మహనీయుడు జగద్గురువు శ్రీ ఆది శంకరచార్యులు వారు.

బౌద్ధం జైనం వంటి మతాల ప్రభావం వల్ల హిందు మతం లో  విబేధాలు రావడం,చార్వాకులు వేదాలను దూషించడం లాంటివి జరుగుతు హిందూ మతం క్షీణ దశకి చేరబోతున్న సందర్బంలో సాక్షాత్తు ఆ పరమ శివుడే ఆదిశంకరుడి గా పుట్టి సనాతన ధర్మాన్నీ రక్షించడాని కే అని భక్తులు విశ్వసిస్తారు.

“అహం బ్రహ్మస్మీ తత్త్వమసి” అన్న అద్వైత సిద్ధాంతాన్ని  మించిన ప్రజాస్వామిక భావన ఏ మతం లోనూ లేదు అని, మనము దేవుని పిల్లలం అనే ఇతర మతాల భావన కన్నా “నేనే బ్రహ్మని, నీవు కూడా బ్రహ్మవే ” అన్న నినాదం లో  గొప్ప సమానత్వ భావన ఉందని అంబేద్కర్ వంటి వాళ్ళు కూడా శంకరచార్యులు వారి బోధనలను ప్రశంసించారు. 

ఆది శంకరుల వారు జీవించింది 32ఏళ్ళే అయినా ఆ తక్కువ సమయంలోనే ఎన్నో గొప్ప గొప్ప కార్యాలను చేసి సనాతన ధర్మానికి ఊపిరి పోసారు. వాటిలో దశనామి సంప్రదాయాన్ని స్థాపిస్తూ దేశం లోని నాలుగు వైపులా శృంగేరి, పూరి,ద్వారకా, జ్యోతిర్మఠం అనే చతురామ్నాయాల స్థాపన చేసి, వాటికి ఆచార్యులను నియమించారు.

ఉపనిషత్ లకు,భగవద్గీతకు, విష్ణు సహస్ర నామాలకు, బ్రహ్మ సూత్రాలకు భాష్యాలు రాసారు. భజ గోవిందం, శివానంద లహరీ, కనకధార స్తోత్రం వంటి 108ఆధ్యాత్మిక గ్రంధాలను ప్రపంచానికి అందించారు. దేశం మొత్తం కాలి నడకన ప్రయాణించి ధర్మ భోధన చేస్తూ సనాతన ధర్మం పునరుజ్జీవనానికి పాటుపడ్డారు.

అంతగొప్ప మహనీయుని జయంతి సందర్బంగా May 2నుండి 12 వరకు హైదరాబాద్ లోని నాంపల్లి exhibition గ్రౌండ్ లో జగద్గురువు శ్రీ ఆది శంకరాచార్యుల వారి జయంతి ఉత్సవాలు ఘనంగా జరగబోతున్నాయి. ఈ సందర్బంగా ఆది శంకచార్యుల వారి జీవితం గురించి BPS  audio&video, కొండపాక టీం వారు రూపొందించిన పాట ప్రేక్షకులను అలరిస్తుంది.

ఈ మద్యే BPS audio &video యూట్యూబ్ ఛానల్ లో విడుదల అయిన ఈ పాట భక్తులు ప్రశంసలు పొందుతున్నది . హైదరాబాద్ లోని శంకర్మట్ లో చిత్రికరణ జరుపుకున్న ఈ పాటలో ఆది శంకరుల వారి జీవితం గురించి సంక్షిప్తంగా తెలియ చేశారు. 

దుష్టాచారాలను అంతం చేసి,సనాతన ధర్మానికి ఊపిరి పోయడానికి ఇలపై  జన్మ ఎత్తిన  ఈశ్వరుడే జగద్గురువు ఆది శంకరుడు అనే పల్లవి తో మొదలయ్యే పాట ఆద్యంతం శంకరుని జీవితం లోని విశేషాలను గురించి తెలియచేస్తుంది. తల్లికి సహాయం చెయ్యడానికి పూర్ణా నది ప్రవాహాన్ని మళ్లించడం,పేదరాలి ఆకలి తీర్చడం కోసం కనకధార స్తోత్రాన్ని పాటించడం, చతురామ్నాయాల స్థాపన,108గ్రంధాల రచన, స్మృతులకు భాష్యం చెప్పడం వంటి అనేక విషయాలను గురించి నేటి తరానికి తెలియచేసేలా ఈ పాట సాగుతుంది.

సాకేత్ సాయిరాం సంగీతం అందించిన ఈ పాటకు వంశీ కృష్ణ రచన చేసారు.హరి గాత్రం చాలా బాగుంది.ముఖ్యంగా హంసిని, ఐశ్వర్యల నాట్యం,నటి నటులు హేమంత్, విగ్నేశ్వర, సరస్వతి, ఉదయ్, అభినయ్,సాయినాథ్ నాగరాజుల అభినయం అలరిస్తాయి. Balendar కెమెరా..  ఎడిటింగ్ పనితనం, ఉదయ్ కుమార్ దర్శకత్వం చక్కగా ఉంది.నిర్మాత వక్కలంక శ్రీనివాస రావు, స్వరూప్ రాజ్ , భక్తి భావన సేవ సమితి, హైదరాబాద్. 

https://www.youtube.com/watch?v=DhPcT_wypZo

ఈ పాట  లింక్ లో ఉంది.చూడండి. నచ్చితే మిత్రులతో పంచుకోండి.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!