కార్పొరేట్ కంపెనీలలో లైంగిక వేధింపులు !!

Sharing is Caring...

 Priyadarshini Krishna………..

2018 లో భారత్ లో మొట్టమొదటి METOO కేసు రిపోర్ట్ అయినప్పుడు దేశం లోని దాదాపు అన్ని మీడియా ఛానల్స్, పత్రికలు మొదలుకుని ఇండివిడ్యువల్స్ వరకు అందరూ కూడా ఇలాంటివన్నీ కేవలం సినిమా ఇండస్ట్రీ లోనే జరుగుతాయి అని ఈసడించుకున్నారు. 

ఆడామగా దాదాపు 10గంటలు కలిసి పనిచేసే ఏ రంగంలోనైనా లైంగికవేధింపులకు ఆస్కారం వుంటుంది అని రాసిన వారిని అదోలా చూసే వారు.  TCS ఉదంతంతో కార్పొరేట్ వ్యవస్థలో అమ్మాయిలు అన్ని వివక్షలు, వేధింపులకు గురి అవుతున్నారో  కొంతైనా సమాజానికి తెలిసి వచ్చింది.

సంస్థాగత వేధింపులు, పనిచేసేచోట లైంగిక వేధింపులు, పదోన్నతి కి శృంగారపరమైన ఫేవర్స్, ON Site placements కోసం బ్రైబ్స్ తో పాటుగా s@e£x₹u$al ఫేవర్స్ వంటివి ఎంతగా పేరుకుపోయి ఉన్నవో TCS ఉదంతం చెపుతోంది. దానితోపాటుగా కన్వర్షన్, మతపరమైన వత్తిడులు లాంటివి కూడా పాతుకుపోయి ఉన్నాయని తేటతెల్లం అయింది.

TCS నాసిక్ లో నాలుగేళ్ల క్రితమే ఈ విషయమై కంప్లైంట్ మానేజ్మెంట్ కి వచ్చినా కూడా దానిని ignore చెయ్యడం ఎంతటి విషపరిణామాలకు దారితీసిందో దేశ ప్రజానికానికి అర్థం అయింది. Metoo ఉదంతం తర్వాత ప్రతి కంపెనీ లో ప్రతి ఆఫీస్ లో ప్రతి ఫ్యాక్టరీ లో anti work place harassment cell ప్రత్యేకంగానూ తప్పనిసరిగాను ఉండాలని సుప్రీమ్ కోర్ట్ తీర్పును వెల్లడించింది.

అలాంటిది అంత గొప్ప పేరున్న మల్టీనేషనల్ కంపెనీ  Tata Consultancy Services లో అలాంటిదేదీ ఉన్న దాఖలాలు లేవు. పైగా అక్కడి HR స్వయంగా ఇలాంటి క్రిమినల్ పనులకు ప్రాతినిధ్యం వహించడం గమనార్హం. TCS నాశిక్ లో బైటపడిన నాలుగేళ్ల మతమార్పిడి, రేప్ మొలెస్టేషన్స్ సెక్సువల్ హరాస్మెంట్ కేస్ ల వల్ల ఈ జిహాదీ గ్రూప్స్ ఎంతలా వెళ్లూనుకున్నవో కూడా అర్థం అవుతోంది.

HR head అయిన నిదా ఖాన్ ఇప్పటికే పరారీలో ఉన్నది. ఆమెపైన ఎన్నో కంప్లైంట్స్ ఇప్పటికే కంపెనీ కి చేరగా మరిన్ని మెయిల్స్ నాశిక్ పోలీస్ లకు చేరుకున్నాయి. TCS నాశిక్ కేసు ఏదో ఫ్లుక్ లో బైట పడలేదు. ఎన్నో కంప్లైంట్స్ తర్వాత.మహారాష్ట్ర పోలీసులు ఒక అండర్ కవర్ ఆపరేషన్ దాదాపు 15 రోజులపాటు నిర్వహించిన తర్వాతే ఈ ఏడుగురిని రెడ్ హ్యాండెడ్ పట్టుకున్నారు.

Forceful religious conversions & favour of work for sexual favours అనేవి చిన్న నేరాలు కావు. ఈ జిహాదీ గ్యాంగ్ లను కేవలం ‘వ్యక్తిగతమైనవి’ అని కొట్టిపడేయడానికి TCS chairman చంద్రశేఖరన్ నానా తిప్పలు పడినా కూడా వ్యవహారం ముదిరిపోయింది. అప్పటికే కేసు NIA చేతుల్లోకి వెళ్లిపోయింది.

VISHAKHA guidelines ( అత్యంత ప్రాచుర్యం పొందిన 1992 లోని బన్వరీ దేవి గ్యాంగ్‌రేప్ కేసు ఆధారితమైన విశాఖ Vs స్టేట్ ఆఫ్ రాజస్థాన్ కేసు గా ప్రచురితమైన Sexual Harassment of Women at Workplace (Prevention, Prohibition and Redressal) Act గా రూపొందించారు) గైడ్ లైన్స్ ను కూడా ఈ TCS అనే కంపెనీ పాటిస్తున్నట్టు లేదు. పనిచేసే ప్రదేశం లో తప్పని సరిగా విశాఖ కమిటీ ఒక్కటి ఉండాలి. లైంగిక వేధింపులు అంశాలను కమిటీ పరిశీలిస్తుండాలి.

ఈ విషయంలో ఫెమినిస్టులు గానీ విమెన్ రైట్స్ ప్రొటెక్షన్ గ్రూప్స్ గానీ బయటకు వచ్చి మాట్లాడిన దాఖలాలు లేవు… వీరు ఇప్పుడు తేలుకుట్టిన దొంగల్లా తప్పించుకుంటున్నారు, విమెన్ ప్రొటెక్షన్ గురించి మాట్లాడితే, ఆటోమేటిక్ గా TCS లో జగిన ముస్లిం కన్వర్షన్ గ్యాంగ్ ల గురించి కూడా మాట్లాడాల్సివస్తుంది. అసలు ఈ కార్పొరేట్ కంపెనీలు అన్నీ anti- harassment cells ని కలిగివున్నాయా అనేది కూడా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అంశం.

లవ్-జిహాద్ అనేది ప్రబలిపోతోంది – ఫ్రిడ్జ్ కేసులు ఎక్కువైపోతున్నాయి అని గొంతెత్తి చెప్పేవారిని ఇదంతా ఒక ప్రోపగాండా అని నోర్ముయించే వారు కేరళ ఫైల్స్ అనేది జరుగుతున్న చరిత్ర అని ఎంత చెప్పినా ‘మా మైనారిటీలను బతకనియ్యరా’ అని ఎదురు దాడి చేసేవారు ఇప్పుడు ఏమంటారు… ఈ జిహాదీ పనితనం ఒక క్యాన్సర్‌గా ప్రబలి చివరికి కార్పొరేట్ సంస్థల్లోకి కూడా వ్యాపించిది అని నిరూపితమైనా ఒప్పుకోరు.

కేంద్రం ఈ విషయం పైన కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా ఇటువంటి వ్యవస్థల పైన గట్టి నిఘా ఏర్పాటు చెయ్యాలి. anti-harassment cells లేని కంపెనీల లైసెన్స్ రద్దుచెయ్యాలి. TCS కేసు లాంటి కేసులు ఇంకా చాలా కంపెనీల్లో ఉండే ఉంటాయి. గట్టి నిఘా పెడితే హైదరాబాద్ లో నే వందల కేసులు తేలడం ఖాయం. ఇప్పటికైనా అమ్మాయిలు ధైర్యాన్ని కూడగట్టుకుని తమకు జరిగే అన్యాయాలను mails రూపంలో పోలీస్ శాఖకు she teams కి పంపండి.Better late than never. 

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!