వెలుగు చూడని ఘోరాలు ఎన్నో ?

Sharing is Caring...

యుద్ధం ఎక్కడ  జరిగినా .. .. ఎందుకు జరిగినా.. సైనికుల కర్కశత్వానికి బలైపోయేది మహిళలూ ..పిల్లలే. పురుషాధిక్య సమాజంలో తన, మన, పర అనే తారతమ్యాలేవీ లేకుండా స్త్రీని విలాస వస్తువుగానో, కోరిక తీర్చేయంత్రంగానో భావించడం తరతరాలుగా అలవాటుగా మారింది. యుద్ధం లో కూడా అదే తంతు కొనసాగుతోంది. బలహీనులపై దాడులు సర్వ సాధారణంగా మారాయి. 

ఉక్రెయిన్ పై చేస్తోన్న యుద్ధంలో రష్యా సైనికుల దారుణాలు ఒక్కొక్కటి బయట పడుతున్నాయి. ఇక అసలు ఘటన విషయానికొస్తే అంతర్జాతీయ మీడియా సంస్థ సీఎఎన్ఎన్ నివేదించిన ఒక కథనంలో.. మద్యం మత్తులో ఉన్న ఓ రష్యన్ సైనికుడు.. 16 ఏళ్ల గర్భిణి అయిన యువతిపై లైంగిక దాడి చేశాడు.

ఒకవేళ తన మాట వినకుంటే గొంతునులిమి చంపేస్తానని బెదిరించి మరీ ఆమెపై అకృత్యానికి పాల్పడ్డాడు. ఎంత దారుణం. ఘటన జరిగిన స్థలంలో బాధితురాలితో పాటు మరో ఇద్దరు అమ్మాయిలు, ఆమె తల్లి కూడా ఉంది. కానీ ఆ సైనికుడు బాధితురాలి గురించి అసభ్య పదజాలం వాడుతూ ఆమెను లక్ష్యంగా చేసుకున్నాడు.

ఇక బాధితురాలు చెప్పిన మాటలను బట్టి.. “అతగాడు తనకు సులువుగా లొంగిపోయే అమ్మాయిని వెదుకుతూ వస్తున్నాడట”. మరో 20 మందిని పిలుస్తానని కూడా బెదిరించాడట. రాజధాని కీవ్ లో స్త్రీలను కాల్చి చంపే ముందు కొంతమందిపై అత్యాచారం జరిగిందనే సాక్షాలు తమ వద్ద ఉన్నాయని ఉక్రెయిన్ ఫోరెన్సిక్ వైద్యుడు వ్లాదిస్లావ్ పెరోవ్స్కీ చెప్పడం ఇందుకు అద్దం పడుతోంది.

ఇదంతా నిజమే. ఖెర్సస్ బాధిత యువతి ఘటన గురించి ఉక్రెయిన్ ప్రాసిక్యూటర్లు సీఎన్ఎన్తో మాట్లాడుతూ.. అమె చెప్పిన మాటలు నిజమేనని ధ్రువీకరించారు. దీనిని యుద్ధ నేరంగా అభివర్ణించారు. మార్చి నెల ఆరంభంలో ఉక్రెయిన్ బలగాలు అక్కడ లేని సమయంలో.. రష్యా సైనికులు ఫెర్సనను స్వాధీనం చేసుకున్నపుడు ఈ అకృత్యం జరిగిందని అంటున్నారు. బాధితురాలితో పాటు మరికొందరు కూడా యుద్ధ నేరాలకు బలైపోయారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బయట పడిన ఘటనలివి కాగా … ఇంకా వెలుగు చూడని ఘోరాలు ఎన్నో ?

 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!