శ్రీవారి ఆస్తుల నికర విలువ అన్ని కోట్లా ?

Sharing is Caring...

Richest God………………………….

శేషాచల కొండలపై వెలసిన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి ప్రపంచంలోనే అపర కుబేరుడు. ఆయన సిరి సంపదలు ఎంతో తెలియాలంటే, ఆయన వైభోగం చూస్తే చాలు. శ్రీవారి వద్ద ఉన్న బంగారు నిల్వలు చూస్తే చాలు ఆయన ఎంతటి కుబేరుడో అర్ధం అవుతుంది. ఒక చిన్నపాటి దేశం వద్ద ఉన్నంత బంగారు నిల్వలు స్వామివారి వద్ద ఉన్నాయంటే అది అతిశయోక్తి కాదు.

తిరుమల తిరుపతి దేవస్థానం నిత్యం భక్తుల రద్దీతో ఉంటుంది. కోరి కొలిచే వారికి కొంగు బంగారమై నిలిచే కోనేటి రాయుడికి కావాల్సినంత బంగారం ఉంది. నిత్యం దేశ,విదేశాల నుండి శ్రీవారిని దర్శించుకునే భక్తులు స్వామివారికి బోలెడన్ని కానుకలు సమర్పిస్తుంటారు. బంగారం అయితే లెక్కలేనంత స్వామి వారి ఖజానా కు చేరుతుంది.

నిత్యాలంకార భూషితుడైన శ్రీ వేంకటేశ్వరుడు భక్తులకు రమ్య మనోహరంగా దర్శనం ఇస్తుంటాడు. మొదట్లో శ్రీవారికి ఇన్ని ఆభరణాలు అలంకరించే వారు కారు.ఇప్పుడు శ్రీవారికి 20 కిలోలకు పైబడిన కిరీటాలు కూడా పెడుతున్నారు. మొత్తంగా ఈ ఆభరణాల బరువు వంద కిలోల వరకు ఉంటుందని అంచనా.స్వామి వారి విగ్రహం పద్మాకారంలో ఉన్న ఒక రాతి పీఠంపై ఉంటుంది.

ప్రతి ఏటా కోట్ల సంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకుంటారు.ఈ సందర్భంగా శ్రీవారికి బంగారు ఆభరణాలు, వజ్రాభరణాలు కానుకగా సమర్పించుకుంటారు. చాలా విలువైన, అపురూపమైన ఆభరణాలు స్వామి వారి సొంతం.

మొత్తం శ్రీవారి వద్ద 11.329 కేజీల బంగారం ఉందని అంటారు. గత మూడేళ్లలో వివిధ బ్యాంకుల్లో 4,000 కిలోలకు పైగా బంగారం డిపాజిట్ చేశారు. దేశంలోనే అత్యంత సంపన్న ఆలయాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఒకటి. ప్రస్తుతం ఆలయంలోని మూల మూర్తి అలంకరణకు 120 రకాల ఆభరణాలు, ఉత్సవ మూర్తుల అలంకరణకు 383 రకాల ఆభరణాలు వినియోగిస్తున్నారు.

శ్రీవారికి 6 కిరీటాలు, 20 ముత్యాల హారాలు, 50 కాసుల దండలు, ఉత్సవ విగ్రహాలకు మరో 7 కిరీటాలు ఉన్నట్టు  లెక్కలు చెబుతున్నాయి. స్వామి వారికి హుండీ ద్వారా వచ్చే ఆదాయం నెలకు 4-5 కోట్లు ఉంటుంది. కేవలం శ్రీవారి లడ్డూ ప్రసాదాలు అమ్మడం ద్వారానే ఆలయానికి లక్షల్లో ఆదాయం వస్తుంది.

ఇక వివిధ బ్యాంకులో స్వామి వారికి నగదు డిపాజిట్లు 18,000 కోట్ల మేరకు ఉన్నాయి. అలాగే స్వామి వారికి 7123 ఎకరాల భూములు వివిధ ప్రదేశాల్లో ఉన్నాయి. వీటి విలువ కూడా కోట్లలోనే ఉంటుంది.. దేశ వ్యాప్తంగా 960 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇందులో కళ్యాణ మండపాలు కూడా ఉన్నాయి.ఇందులో కొన్ని లీజు కిచ్చారు. వీటిపై శ్రీవారికి ఆదాయం వస్తుంది. మొత్తం మీద శ్రీవారి ఆస్తుల నికర విలువ 3 లక్షల కోట్లు అని అంచనా.  

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!