ఇదొక స్లో-బర్న్ మిస్టరీ స్టోరీ !!

Sharing is Caring...

This is a different crime movie………

‘ఏలా వీజా పూంచిర’ (Ela Veezha Poonchira) అంటే మలయాళంలో “ఆకులు రాలనటువంటి పూల కొలను లేదా లోయ”అని అర్థం. 2022లో విడుదలైన ఒక విలక్షణమైన మలయాళ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా ఇది . ‘జోసెఫ్’, ‘నాయట్టు’ వంటి సినిమాలకు కథ అందించిన షాహీ కబీర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రముఖ నటుడు సౌబిన్ షాహిర్ ప్రధాన పాత్ర పోషించారు. ఈ చిత్రం తెలుగు డబ్బింగ్‌తో ఆహా ఓటీటీ లో అందుబాటులో ఉంది. 

కథాంశం 
సముద్ర మట్టానికి సుమారు 3000 అడుగుల ఎత్తులో ఉన్న ‘ఏలా వీజా పూంచిర’ అనే కొండ మీద ఉన్న వైర్‌లెస్ పోలీస్ స్టేషన్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ కథ నడుస్తుంది. అక్కడ మధు (సౌబిన్ షాహిర్) అనే పోలీస్ కానిస్టేబుల్ తన తోటి సిబ్బందితో కలిసి డ్యూటీ చేస్తుంటాడు. ఆ ప్రాంతంలో తరచూ పిడుగులు పడుతుంటాయి, పైగా అక్కడ కమ్యూనికేషన్ కూడా చాలా కష్టం. 

ఇలాంటి ఒక నిర్జన ప్రదేశంలో, రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఒక మహిళ హత్య కేసుకు సంబంధించిన శరీర భాగాలు లభ్యమవుతాయి. అసలు ఆ హత్య చేసింది ఎవరు? మధు జీవితానికి, ఈ హత్యకు ఉన్న సంబంధం ఏంటి? అనే మిస్టరీని విప్పడమే ఈ సినిమా కథ.

సౌబిన్ షాహిర్, ఈ సినిమాలో ఒక సీరియస్, ఎమోషనల్ పాత్రలో అద్భుతంగా నటించారు. ఆయన నటన సినిమాకు ప్రధాన బలం.కొండ ప్రాంత వాతావరణం, పొగమంచు, వర్షం, పిడుగుల వంటి ప్రకృతి దృశ్యాలను కెమెరామెన్ చూపించిన విధానం మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది.కేరళ అందాలతో పాటు అక్కడి భయానక వాతావరణాన్ని అద్భుతంగా క్యాప్చర్ చేశారు.

పొగమంచు, మేఘాల మధ్య ఒంటరిగా ఉండే ఆ వైర్‌లెస్ పోలీస్ స్టేషన్‌ను పరిచయం చేసే ఓపెనింగ్ సీన్లు విజువల్ వండర్‌లా ఉంటాయి. అక్కడ పోలీసులు ఎలా బతుకుతున్నారు అనేది చాలా సహజంగా చూపించారు.ఒక మహిళ హత్యకు సంబంధించిన శరీర భాగాలు ఆ కొండపై వేర్వేరు చోట్ల దొరికినప్పుడు, పోలీసులు వాటిని సేకరించే సీన్ కథలో అసలైన సస్పెన్స్‌ను మొదలుపెడుతుంది.

సినిమా రన్‌టైమ్ తక్కువ ఉన్నప్పటికీ (సుమారు 1 గంట 40 నిమిషాలు), ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్‌లో కథ చాలా నెమ్మదిగా సాగుతుంది.ఇతర నటీ నటులు కూడా బాగా నటించారు. రెగ్యులర్ థ్రిల్లర్ సినిమాల్లా ఇందులో వేగవంతమైన స్క్రీన్‌ప్లే, ఫైట్లు లేదా చేజింగ్ సీన్లు ఉండవు. కేవలం వాతావరణం ద్వారానే టెన్షన్ బిల్డ్ చేస్తారు. సినిమాలో చాలా తక్కువ పాత్రలు ఉండటం వల్ల కొంతమందికి బోర్ కొట్టే అవకాశం ఉంది.

సినిమా చివరి 20 నిమిషాలు కథలో కీలకం. అప్పటివరకు చాలా సాదాసీదాగా సాగుతున్న కథలో ఊహించని పెద్ద ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఆ తర్వాత వచ్చే ముగింపు ప్రేక్షకులను షాక్‌కు గురిచేసి, సినిమా చూసాక కూడా వెంటాడేలా చేస్తాయి. ముగింపులో ట్విస్ట్‌లు ఊహించని విధంగా ఉండి, ప్రేక్షకులను షాక్‌కు గురిచేస్తాయి.

ఇది అందరికీ నచ్చే రెగ్యులర్ కమర్షియల్ థ్రిల్లర్ కాదు. కానీ, స్లో-బర్న్ మిస్టరీ సినిమాలు, రియలిస్టిక్ క్రైమ్ డ్రామాలు, విభిన్నమైన మలయాళ సినిమాలను ఇష్టపడే వారికి ఇది ఒక మంచి వాచ్ అవుతుంది. చివరి వరకు ఓపికగా చూస్తే క్లైమాక్స్ ఇచ్చే థ్రిల్ మిమ్మల్ని నిరాశపరచదు  

ఈ చిత్రానికి మనీష్ మాధవన్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. ఆయన విజువల్స్ ప్రేక్షకులను థ్రిల్ చేస్తాయి. ఈ సినిమాకు మిథున్ ముకుందన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) అందించగా, సౌండ్ డిజైన్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.ఈ సినిమాలో అనవసరమైన హడావిడి మ్యూజిక్ ఉండదు. కథ డిమాండ్ మేరకు చాలా సీన్లలో కేవలం నిశ్శబ్దాన్ని వాడుకుంటూ టెన్షన్ బిల్డ్ చేశారు.పిడుగుల శబ్దాలు థ్రిల్ ఫీల్‌ను రెట్టింపు చేస్తాయి.ఆసక్తి ఉన్నవారు చూడ వచ్చు. 

  

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!