అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
పాట ఆహ్లాదం అందించాలి. పాట ఆలోచనని రేకెత్తించాలి. పాట మనుసులను తాకాలి. పాట మనుషులను తట్టి లేపాలి. పాట పనిలో నుండి పుట్టింది అని ఒక కవి అంటాడు. శవాన్ని మోసుకెళ్లే దాన్ని “పాడే” అని అనడం వెనుక కూడా పాట ఉండి ఉండవచ్చు అంటాడు ఆ కవి. అంటే మనిషి పుట్టుక నుండి చావు …
Govardhan Gande ………………………………………… “వాళ్ళు” “వీళ్ల ” చెప్పులు మోయాలట! “వాళ్ళు” అంటే అధికార యంత్రాంగం. “వీళ్ళు” అంటే రాజకీయ నాయకత్వం. ఈ మాట అన్నది కేంద్రంలో గతంలో ఓ మంత్రి పదవిని కూడా వెలగబెట్టిన ఓ మహిళా శిరోమణి. చెప్పులు ఎందుకు మోయాలి? అసలు చెప్పులు మోయడం ఏమిటి? ఎవరైనా మరొకరి చెప్పులు మోయడం …
ఎనిమిదేళ్ల బుడతడు పర్వతారోహణలో రికార్డులు సృష్టిస్తున్నాడు. ఇంత చిన్న వయసులో అంత సాహసం చేయడమంటే మాటలు కాదు. అతగాడెవరో కాదు. ఏపీ క్యాడర్‌కు చెందిన సీనియర్ ఐఎఎస్ అధికారి గంధం చంద్రుడు తనయుడు గంధం భువన్ జయ్. కొద్దీ రోజుల క్రితం భువన్ జయ్ ఐరోపా ఖండంలోనే అతి పెద్ద పర్వత శిఖరం మౌంట్ ఎల్బ్రస్‌ను …
గాడిద పాలతో సబ్బులేమిటి ? అని ఆశ్చర్యపోకండి. నిజమే గాడిద పాలతో సబ్బులు చేయవచ్చు. అలా చేసే అతగాడు ఇపుడు రెండుచేతులా సంపాదిస్తున్నాడు. గాడిద పాల సబ్బు తో ప్రయోజనాలు చాలా ఉన్నాయి. చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది.మృదువుగా మారుస్తుంది. చర్మపు ముడుతలను తొలగిస్తుంది.చర్మాన్ని పునరుత్పత్తి చేస్తుంది. యాంటీ ఏజింగ్ కు దోహదపడుతుంది. ఇవన్నే గమనించే జోర్డాన్‌కు చెందిన 32 ఏళ్ల ఎమాద్ …
Great Ambition……………………………………. ఒక గొప్ప ఆశయంతో స్థాపితమైన సంస్థ గూంజ్. పేదరికం కారణంగా దేశంలో ఎందరికో వంటిపై సరైన బట్టలుండవు. ఇక పిల్లలైతే దిశ మొలతోనే తిరుగుతుంటారు. అలాంటి బీద,బిక్కిజనాలకు అవసరమైన వస్త్రాలను పంపిణీ చేస్తుంది ఈ సంస్థ. గూంజ్ స్వచ్చంద సంస్థ ఎగువ మధ్య తరగతి.. సంపన్నవర్గాల ప్రజల నుంచి పాత బట్టలను లేదా …
Marudhuri Raja …………………………………………. హైదరాబాద్ లో.. రక్తతిలకం..షూటింగ్ జరుగుతోంది..దర్శకుడు B. గోపాల్ . పరుచూరి బ్రదర్స్ రచయితలు.నేను వాళ్ళ దగ్గర సహకార రచయితని కావటంవల్ల..గోపాల్ గారు కూడా అడగటం వల్ల స్క్రిప్ట్ హెల్ప్ కోసం హైదరాబాద్ వెళ్ళాను..అదే టైంలో అక్కినేని వారి బర్త్ డే వచ్చింది..ఆయనకి గ్రీటింగ్స్ చెప్పటానికి గోపాల్ తదితరులు వెళ్తున్నారు. చిన్నప్పటినుండి నాగేశ్వరరావు …
దేశం సంక్షోభంలో చిక్కుకుపోవడంతో ఆఫ్ఘన్లు పలు ఇబ్బందులు పడుతున్నారు. ఏదేశం కూడా ప్రజలను ఆదుకునేందుకు ముందుకు రాని నేపథ్యంలో తమ సమస్య ఎవరికి చెప్పుకోవాలో అర్ధం కాక మానసికంగా నలిగిపోతున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు,బ్యాంకులు, పాఠశాలలు, హోటళ్లు , వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. తెరిచిన కొన్ని బ్యాంకుల్లో డబ్బులేదు. కార్యకలాపాలు స్థంభించడంతో ఆర్ధిక వ్యవస్థ పతనమైంది. ప్రభుత్వ ఉద్యోగులు,టీచర్లు, ఇతరులు జీతాలు రాక, …
తాలిబన్ల వ్యవహారశైలిని ధిక్కరించేందుకు అఫ్గానీ మహిళలు ముందడుగు వేస్తున్నారు. ఒక ప్రయత్నం చేద్దాం పోతే ప్రాణాలే కదా అన్నరీతిలో తమపై విధించిన ఆంక్షల పట్ల వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. కొందరు మహిళలు మాత్రం తెగించి రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు.మరికొందరు సోషల్ మీడియాలోనూ తమ నిరసనను విభిన్న రీతిలో వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా నిరసన అంటే …
స్టాక్ మార్కెట్ దూసుకెళుతోంది.సెన్సెక్స్ 59,460 పాయింట్ల వద్ద కదలాడుతుండగా నిఫ్టీ 17,725 పాయింట్ల ను దాటింది.ఈ నెల 3న తొలిసారి సెన్సెక్స్ 58 వేల మార్కును అందుకోగా.. రెండు వారాల వ్యవధిలోనే మరో మైలురాయిని అధిగమించింది. బీఎస్‌ఈలో సుమారు 400 స్టాక్స్ అప్పర్ సర్క్యూట్‌ను తాకగా.. 280 స్టాక్స్ 52 వారాల గరిష్ఠాలను చేరుకున్నాయి. మార్కెట్ …
error: Content is protected !!