ప్రికాషనరీ పేరిట మూడో వ్యాక్సిన్ డోస్ !

Sharing is Caring...

దేశంలో ఒమిక్రాన్‌ వేరియంట్ వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రికాషనరీ డోస్ పేరిట మరోమారు వ్యాక్సిన్ పంపిణీకి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. వచ్చే జనవరి 10 వ తేదీ నుంచి ఈ ప్రికాషనరీ డోస్ పంపిణీ చేయనున్నట్టు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు.

ఈ ప్రికాషనరీ డోసు తీసుకోవడానికి అందరూ అర్హులు కారు. ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, 60 ఏళ్లు దాటిన వారు .. ఇతరత్రా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి ఈ డోసు  వేస్తారు. ఇది బూస్టర్ డోస్ కాదు. ప్రధాని దానిని ముందు జాగ్రత్త డోస్ గా వర్ణించారు.

బూస్టర్ డోస్ విషయంలో ప్రభుత్వం ఇంకా నిర్ణయానికి రాలేదు. బూస్టర్ కి బదులుగా ఈ ముందు జాగ్రత్త డోస్ ఇస్తున్నారా ? మరి కొంతకాలం తర్వాత మళ్ళీ బూస్టర్ డోస్ ఇస్తారా ? ఇవ్వరా ? అనేది కొన్ని రోజులు పోతే కానీ తేలదు. ప్రస్తుతం రెండవ డోస్ తీసుకుని 9 నెలలు పైబడి… 60 సంవత్సరాలు దాటిన వారికి ఈ ప్రికాషనరీ లేదా ముందు జాగ్రత్త డోస్ ఇవ్వాలని భావిస్తున్నారు.

ఈ అంశంపై అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. రెండో డోసు తీసుకున్న వారికి ఎంత గ్యాప్ ఇచ్చి ముందు జాగ్రత్త డోస్ ఇవ్వాలో రెండురోజుల్లో ఖరారు చేస్తారు. ఆ వెంటనే మార్గదర్శక సూత్రాలను జారీ చేస్తారు.  ఈ ప్రికాషనరీ డోసు కోసం వైద్యుల సర్టిఫికెట్ అవసరమౌతుంది. అనారోగ్యానికి సంబంధించిన వివిధ పత్రాలు కూడా తప్పనిసరి. కోవిన్ పోర్టల్ లో నమోదు చేసుకోవాలి. లేదా వ్యాక్సినేషన్‌ కేంద్రంలో చూపించాల్సిఉంటుంది.

మార్గదర్శక సూత్రాలు వచ్చాక కోవిన్ పోర్టల్ లో బుకింగ్ మొదలవుతుంది.  సుమారుగా 13.7 కోట్ల మంది వయోవృద్ధులు ప్రికాషనరీ  డోసు పంపిణీకి అర్హులని అంచనా వేస్తున్నారు. ఇక 15 నుంచి 18 ఏళ్లలోపు పిల్లలు జనవరి 1 నుంచి కోవిన్ పోర్టల్ తమ పేర్లు  నమోదు చేసుకోవచ్చు. రిజిస్టర్ చేసుకోవడానికి, పిల్లలకు ఆధార్ లేదా మరేదైనా గుర్తింపు కార్డులు లేకుంటే వారి స్టూడెంట్ ఐడి కార్డ్‌లను ఉపయోగించవచ్చు.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!