ఆదానీ టోటల్ గ్యాస్  షేర్లను అమ్ముకోవచ్చు!

Sharing is Caring...

Earn Profits …………………..

ఆదానీ టోటల్ గ్యాస్  … ఆదానీ గ్రూప్ కి చెందిన కంపెనీ ఇది.  రవాణా రంగానికి, పారిశ్రామిక రంగానికి, వాణిజ్య, గృహ వినియోగదారులకు అవసరమైన కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG) పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) సరఫరా చేయడానికి అదానీ టోటల్ గ్యాస్ ‘సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్’ (CGD) నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేస్తోంది.

కంపెనీ గుజరాత్‌లోని అహ్మదాబాద్, వడోదర .. హర్యానాలోని ఫరీదాబాద్, ఉత్తరప్రదేశ్‌లోని ఖుర్జాలో గ్యాస్ పంపిణీ నెట్‌వర్క్‌లను ఏర్పాటు చేసింది.ముందు ముందు ఇతర నగరాలకు విస్తరించాలని ప్లాన్ చేస్తున్నది. కంపెనీ సెప్టెంబర్ 21 తో ముగిసిన త్రైమాసికంలో రూ. 663 కోట్ల ఆదాయంపై రూ 158 కోట్ల నికర లాభాన్ని గడించింది. 

అంతకుముందు మార్చి 21తో ముగిసిన ఆర్ధిక సంవత్సరంలో కంపెనీ రూ 471 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ప్రస్తుతం కంపెనీ షేర్లు రూ 1752 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. 52 వారాల గరిష్ట ధర 1987 కాగా కనిష్ట ధర 315 మాత్రమే. గత మూడేళ్ళుగా షేర్ ధరలో వృద్ధి బాగానే ఉంది. 2021 సంవత్సరం లో ఈ షేర్ ధర 355 శాతం పెరిగింది. 2020 లో 130 శాతం పెరిగింది. 2019 లో 61 శాతం పెరిగింది.

కంపెనీ కి అప్పులు తక్కువగా ఉన్నాయి. ఉన్నవాటిని తగ్గించుకుంటోంది. గత రెండేళ్ల కాలంలో నికర లాభాలు పెరిగాయి. క్రమంగా విదేశీ ఇన్వెస్టర్ల  షేర్ హోల్డింగ్ పెరుగుతోంది. కంపెనీ మంచి పనితీరును కనబరుస్తోంది. తక్కువ ధరల్లో అంటే 400-500 మధ్యలో ఈ షేర్లను కొనుగోలు చేసినవారు ప్రస్తుత ధర వద్ద వాటిని అమ్మేసి లాభాలు స్వీకరించడం మంచి వ్యూహం.

పూర్తిగా కాకపోయినా .. పాక్షికంగా నైనా షేర్లను అమ్మి లాభాలు స్వీకరించండి. కావాలంటే ధరలు తగ్గినపుడు మళ్ళీ కొనుగోలు చేయవచ్చు. ఇంకా ధర పెరుగుతుందని కూర్చోవడం అత్యాశ అవుతుంది. మార్కెట్ కరెక్షన్ వస్తే అమ్ముకునే అవకాశం కూడా ఉండదు. కాబట్టి కొంతమేరకైనా లాభాలు స్వీకరించడం మంచిది. ఇక ఈ దశలో కొనుగోలు చేయడం రిస్క్ తో కూడిన వ్యవహారం. షేర్ ధరలు బాగా తగ్గినపుడు  ఇన్వెస్ట్ చేయవచ్చు. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!