ఆ ఇద్దరి ‘ఇమేజ్’ తో పాజిటివ్ టాక్ !!

Sharing is Caring...

Different Movie…………..

పాన్ ఇండియా మూవీ ‘కుబేర’ కు మంచి స్పందన వస్తోంది. శేఖర్ కమ్ముల తీసిన డిఫరెంట్ మూవీ ఇది. లవ్ స్టోరీ(2021) తర్వాత శేఖర్ తీసిన’ కుబేర’ ఒక డిఫరెంట్ ఫిలిం. కార్పొరేట్ కంపెనీలు .. ప్రభుత్వాల్లో ఉండే రాజకీయ నేతల వ్యవహార శైలి ఎలావుంటుంది ? షెల్ కంపెనీలు ఎలా పుట్టుకొస్తాయి .. వాటి ద్వారా నల్లధనం  మార్పిడి ఎలా జరుగుతుంది? అనే అంశాలను బ్యాక్ డ్రాప్ కథగా మలచుకున్నారు.

కథపై దర్శకుడు శేఖర్ అండ్ టీమ్ మరింత కసరత్తు చేస్తే బాగుండేది. కథలో కొంత మేర కొత్త దనం కనిపిస్తుంది. నాగార్జున,ధనుష్ వంటి స్టార్స్ కథ కు ప్లస్ అయ్యారు. ముఖ్యంగా ధనుష్ పోషించిన భిక్షగాడి పాత్ర సినిమాలో కీలకం. సినిమా మొత్తం నాగార్జున,ధనుష్ పాత్రల చుట్టూ తిరుగుతుంది. నాగార్జున కు కూడా ఇదో వెరైటీ క్యారెక్టర్. 

నలుగురు బిచ్చగాళ్ల ను ఎంపిక చేసుకుని వారి పేరిట షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి ..మనీ ట్రాన్స్ఫర్ చేసే క్రమంలో జరిగిన ఘటనల సమాహారం. ఈ క్రమంలో ధనుష్ తప్పించుకోవడం తో కథలో వేగం పెరుగుతుంది. ధనుష్ ఎందుకు తప్పించుకున్నాడు. కాంట్రాక్టర్ నీరజ్ గ్యాంగ్ ధనుష్ ని పట్టుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించాయా ? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. 

ధనుష్ భిక్షగాడి పాత్రలో జీవించాడు. స్టార్ హీరో అయి కూడా ఈ భిక్షగాడి పాత్ర పోషించడం గొప్ప విషయమే.ఆ పాత్రలో నటనకు స్కోప్ బాగుంది కాబట్టే ధనుష్ చేసాడు. అమాయకత్వం, మంచితనం కలబోసిన పాత్ర .. సెకండ్ హాఫ్ లో తెలివిగా మారతాడు.ధనుష్ పాత్రే సినిమా కు జీవం. దేవా పాత్రను నేచురల్ గా నటించి సత్తా చాటుకున్నాడు. వివిధ సన్నివేశాల్లో ధనుష్ నటన అద్భుతంగా ఉంది.

పాజిటివ్ పోలీస్ ఆఫీసర్ నెగెటివ్ గా మారితే ఎంత ప్రమాదమో నాగార్జున పాత్ర ద్వారా దర్శకుడు శేఖర్ చూపించారు.పైకి పాజిటివ్ గా కనిపిస్తున్నప్పటికీ నాగార్జునది నెగటివ్ రోల్ అని చెప్పుకోవాలి. కాంట్రాక్టర్ నీరజ్ తో గట్టిగా మాట్లాడలేక.. నీరజ్ అనుచరులను నియంత్రించలేక నాగ్ క్యారెక్టర్ వీక్ అయింది. ఉన్నంతలో నాగార్జున బాగానే చేసాడు.కొన్ని భావోద్వేగ సన్నివేశాలు పెట్టి ఉంటే బాగుండేది. ఆ పాత్రకు ఆ స్కోప్ ఉంది.

నాగార్జున పాత్ర కంటే ధనుష్ పాత్ర అందరికి నచ్చుతుంది. ధనుష్,రష్మిక కాంబినేషన్ సీన్లు ప్రేక్షకులను అలరిస్తాయి. రష్మిక కూడా బాగానే చేసింది షాయాజీ షిండే పాత్ర చిన్నదే .. బాగా చేసాడు. బాలీవుడ్ నుంచి జింషర్బ్ ను తీసుకొచ్చి విలన్ గా పెట్టారు. అతగాడు మెప్పించాడు. సినిమా కి పాజిటివ్ టాక్ వచ్చిందంటే అది ధనుష్,ఇమేజ్ ,డైరెక్టర్ శేఖర్ కున్న మంచి పేరు వలన మాత్రమే.

ఈ పాజిటివ్ టాక్ నిలబడి సినిమా హిట్ అవుతుందా ? లేదా అనేది మరికొద్ది రోజులు పోతే కానీ తేలదు. మామూలు ప్రేక్షకుడిలా సినిమా చూడవచ్చు. కథ లో లోపాలు బోలెడు ఉన్నాయి. లాజిక్ కి అందని సీన్లు ఉన్నాయి. వాటి గురించి ఆలోచించకుండా సినిమా చూడవచ్చు.

లాజికల్ గా ఆలోచిస్తూ పోతే సినిమా నచ్చదు. పాన్ ఇండియా సినిమా కాబట్టి కథాపరంగా సినిమా స్వేచ్ఛ ను బాగా వాడుకున్నారు. కాకపోతే రొమాన్స్, డాన్సులు లేవు. మరో డైరెక్టర్ అయితే రష్మిక ,ధనుష్ లతో ఒకటి రెండు సాంగ్స్ అయినా పెట్టేవారు.

తనది కానీ జోనర్ లో శేఖర్ కమ్ముల ఏ మేరకు సక్సెస్ అయ్యారో కాలమే నిర్ణయిస్తుంది. క్లయిమాక్స్ పూర్తిగా సినిమాటిక్ గా ఉంది. కెమెరా పనితనం బాగుంది. దేవిశ్రీ సంగీతం ఆకట్టుకుంటుంది.  సినిమా నిడివి తగ్గిస్తే బాగుండేది. 

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!