హై-వోల్టేజ్ రివెంజ్ డ్రామా !!

Sharing is Caring...

Action revenge movie ……..

‘వరవు’ (Varavu) …మలయాళ దర్శకుడు షాజీ కైలాస్, నటుడు జోజు జార్జ్ కాంబినేషన్‌లో మున్నార్ ప్లాంటేషన్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన హై-వోల్టేజ్ ప్రతీకార చిత్రం.‘వరవు’ (Varavu) అంటే ‘రాక’ లేదా ‘రాకడ’ (Coming / Arrival) అని అర్థం.. జూలై 2026లో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం ZEE5 లో తెలుగు వెర్షన్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

కథ ఎమిటంటే ?

చేయని నేరానికి జైలు శిక్ష అనుభవిస్తున్న పాల్సన్ (జోజు జార్జ్), 10 రోజుల పెరోల్‌పై తన సొంత ఊరైన మున్నార్‌కు తిరిగి వస్తాడు. గతంలో తన కుటుంబాన్ని నాశనం చేసి, తన ఆస్తులను లాక్కున్న క్రూరమైన భూస్వామ్య ముఠాపై ప్రతీకారం తీర్చుకోవడమే అతని రహస్య ఎజెండా.

ఈ క్రమంలోనే తాను చేసే ప్రతి పని ని  నాలుగేళ్లుగా కనిపించకుండా పోయిన తన తమ్ముడు విల్లీ (అర్జున్ అశోకన్) పైకి నెడుతూ పాల్సన్ ఒక మైండ్ గేమ్ ఆడతాడు. ఆ 10 రోజులలో పాల్సన్ తన శత్రువులను ఎలా అంతమొందించాడు, అసలు అతని తమ్ముడు ఏమయ్యాడు అనేదే ఈ చిత్ర కథ.

సినిమా అంతా జోజు జార్జ్ వన్-మ్యాన్ షో గా నడుస్తుంది. పాల్సన్ పాత్రలో జోజు జార్జ్  అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్, మాస్ స్వాగర్, యాక్షన్ సీన్స్‌తో సినిమాను ఒంటిచేత్తో నడిపించాడు. ఆయన నటన సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్.

భూస్వామ్య అహంకారం ఉన్న మేదాయిల్ కొచ్చెట్టన్  పాత్రలో మురళీ గోపీ చాలా పవర్‌ఫుల్‌గా నటించి మెప్పించారు. జోజు, మురళీల మధ్య వచ్చే మైండ్ గేమ్స్, ఫేస్-ఆఫ్ సీన్స్ బాగుంటాయి.

నాలుగేళ్ల జైలు జీవితం తర్వాత జోజు జార్జ్ మున్నార్ కొండల్లోకి అడుగుపెట్టే సీన్ చాలా స్టైలిష్‌గా ఉంటుంది. ఆయన  కాస్ట్యూమ్స్, నడిచే స్టైల్, గంభీరమైన లుక్ మాస్ ప్రేక్షకులను  అలరిస్తాయి. ప్రయాణికులతో వెళ్తున్న ఒక బస్సులో విలన్ మనుషులు పాల్సన్‌పై దాడికి దిగుతారు. ఆ పరిమిత స్థలంలో జోజు జార్జ్ చేసే రా అండ్ రస్టిక్ యాక్షన్ బ్లాక్  ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. షాజీ కైలాస్ మార్క్ టేకింగ్ ఈ సీన్స్ లో స్పష్టంగా కనిపిస్తుంది.

పాల్సన్, విలన్ కొచ్చెట్టన్ (మురళీ గోపీ) ఎదురు పడే సన్నివేశాలు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. ఒకవైపు ఫిజికల్ ఫైట్స్ జరుగుతుంటే, మరోవైపు వీరిద్దరి మధ్య సాగే సంభాషణలు, ఒకరినొకరు మానసికంగా దెబ్బతీసుకోవడానికి వేసే ప్లాన్స్ గ్రిప్పింగ్‌గా అనిపిస్తాయి.

దట్టమైన పొగమంచు, వర్షం కురుస్తున్న వాతావరణంలో మున్నార్ టీ ప్లాంటేషన్స్ బ్యాక్‌డ్రాప్‌లో చేజింగ్ సీక్వెన్సులు విజువల్‌గా చాలా బాగుంటాయి. కెమెరామెన్ శరవణన్ ఈ విజువల్స్‌ను చాలా రిచ్‌గా చూపించారు.

సినిమా ముగింపులో తమ్ముడు విల్లీ (అర్జున్ అశోకన్) ఏమయ్యాడు అనే నిజాన్ని పాల్సన్ రివీల్ చేసే ఎమోషనల్ సీన్, ఆ తర్వాత వచ్చే క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ సినిమాకు సరైన ముగింపునిస్తాయి. సినిమాలో వయొలెన్స్ ఎక్కువ ..ఇది కొందరు ప్రేక్షకులకు నచ్చకపోవచ్చు  

హీరో జైలు నుండి వచ్చి పగ తీర్చుకోవడం అనేది మనం దశాబ్దాలుగా చూస్తున్న రొటీన్ ఫార్ములా. కొత్తదనం లేదు…అయినా కథనం వేగంగా సాగుతుంది. సామ్ సి.ఎస్. అందించిన నేపథ్య సంగీతం బాగుంటుంది. 

‘వరవు’  90ల నాటి పాత శైలి మేకింగ్‌తో సాగే ఒక రొటీన్ యాక్షన్ రివెంజ్ డ్రామా. లాజిక్కులు వెతకకుండా, కేవలం జోజు జార్జ్ పవర్‌ఫుల్ ఫైట్లు, మాస్ యాక్షన్ సీక్వెన్సులు చూడాలనుకుంటే చూడవచ్చు. 

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!