కమల్ ‘హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్’ !!

Sharing is Caring...

Action thriller ………….

‘విక్రమ్’ ఇది 2022 నాటి సినిమా. ఈ హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ లో కమల్ హాసన్,విజయ్ సేతుపతి,ఫహద్ ఫాజిల్ వంటి అగ్రనటులు నటించారు. క్లయిమాక్స్ లో మరో అగ్రనటుడు సూర్య కూడా నటించారు. లోకేష్ కనగరాజ్ ఈసినిమాకు దర్శకత్వం వహించారు.

కథేంటంటే?

డ్రగ్స్ మాఫియాను ఎదుర్కొనే క్రమంలో  ప్రభంజన్ అనే యువ పోలీస్ ఆఫీసర్, అతని తండ్రి కర్ణన్ (కమల్ హాసన్) ముసుగు ధరించిన కొందరు దుండగుల చేతిలో హత్యకు గురవుతారు. ఈ వరుస హత్యల వెనుక ఉన్న నిజాన్ని బయటపెట్టడానికి ‘అమర్’ (ఫహద్ ఫాజిల్) నేతృత్వంలోని ఒక టీమ్ రంగంలోకి దిగుతుంది.

అమర్ ఇన్వెస్టిగేషన్‌లో కర్ణన్ సాధారణ వ్యక్తి కాదని, అతని వెనుక ఒక పెద్ద గతం ఉందని తెలుస్తుంది. ఈ క్రమంలోనే డ్రగ్ మాఫియా డాన్ సంతానం (విజయ్ సేతుపతి) కోల్పోయిన భారీ డ్రగ్స్ కంటైనర్ కోసం వెతుకుతుంటాడు.అసలు కర్ణన్ ఎవరు? అతను బతికే ఉన్నాడా? సంతానం సామ్రాజ్యాన్ని అమర్, కర్ణన్ ఎలా కూల్చారు? అనేదే మిగతా కథ.

కమల్ హాసన్‌  ఒక పవర్‌ఫుల్ యాక్షన్ రోల్‌లో నటించారు. యాక్షన్ బ్లాక్స్‌లో ఆయన నటన అద్భుతం.సినిమా ఫస్టాఫ్‌లో కమల్ హాసన్ కేవలం ఒక సాధారణ, తాగుబోతు తాతగా చాలా సాదాసీదాగా కనిపిస్తారు. తర్వాత ఒక పవర్‌ఫుల్ అండర్‌కవర్ ‘ఏజెంట్ విక్రమ్’అని తెలుస్తుంది.కేవలం ఫైట్లు, ఎలివేషన్లే కాకుండా…కొడుకును కోల్పోయిన తండ్రిగా ఆయన కళ్లల్లో చూపించిన బాధ, అలాగే తన చిన్న మనవడిని కాపాడుకోవడానికి పడే తపన వంటి ఎమోషనల్ సీన్లలో కమల్ హాసన్ తన క్లాసిక్ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. 

సినిమా ఫస్ట్ హాఫ్‌ను ఫహద్ ఫాజిల్ తన ఇన్వెస్టిగేషన్ సీన్లతో వన్‌మ్యాన్ షోలా నడిపించాడు.సినిమా ఫస్ట్ హాఫ్ అంతా ఆయన పాత్ర చుట్టూనే తిరుగుతుంది డైలాగ్స్ కంటే కూడా తన కళ్ళతో, బాడీ లాంగ్వేజ్‌తోనే అమర్ పాత్రలోని సీరియస్‌నెస్‌ను, ఇంటెన్సిటీని ఆయన  పండించారు.డ్యూటీకి ప్రాణమిచ్చే ఆఫీసర్‌గా, అలాగే తన భార్యపై ప్రేమను చూపించే భర్తగా రెండు విభిన్నమైన షేడ్స్ చూపించారు.సెకండ్ హాఫ్‌లో కమల్ హాసన్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే సీన్లలో కూడా ఫహద్ తనదైన నటనతో గట్టి పోటీ ఇచ్చారు.  

‘సంతానం’ అనే భయంకరమైన డ్రగ్ మాఫియా డాన్ పాత్రలో తన కెరీర్‌లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ నెగటివ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సాధారణంగా కనిపించే విలన్ పాత్రలలా కాకుండా, లోకేష్ కనగరాజ్ ఈ క్యారెక్టర్‌ను చాలా విభిన్నంగా, క్రూరంగా డిజైన్ చేశారు. విజయ్ సేతుపతి ఈ పాత్రలో విపరీతమైన కోపం, క్రూరత్వాన్ని చూపిస్తూనే.. మధ్యమధ్యలో ఒక రకమైన విచిత్రమైన బాడీ లాంగ్వేజ్, నవ్వుతో భయాన్ని పుట్టించారు.

లోకేష్ రాసుకున్న స్క్రీన్‌ప్లే, క్యారెక్టరైజేషన్లు సినిమాకు ప్రధాన బలం. 1986 నాటి పాత ‘విక్రమ్’, ‘ఖైదీ’ సినిమాలను లింక్ చేస్తూ ఆయన క్రియేట్ చేసిన ‘లోకేష్ సినిమాటిక్ యూనివర్స్’ ప్రేక్షకులకు మైండ్ బ్లోయింగ్ అనుభూతిని ఇస్తుంది.సినిమా చివర్లో ‘రోలెక్స్’ పాత్రలో సూర్య ఎంట్రీ ఇచ్చే 5 నిమిషాల సీన్ సినిమాకే అతిపెద్ద హైలైట్. 

సినిమా ఫస్ట్ హాఫ్ కొంత నెమ్మదిగా సాగుతుంది. తన చిన్న మనవడిని కాపాడుకోవడానికి కమల్ హాసన్ ఒక చేత్తో బాబును పట్టుకుని, మరో చేత్తో శత్రువులను చీల్చిచెండాడే సీన్ సినిమాకే వన్ ఆఫ్ ది బెస్ట్ హైలైట్. ఇందులో ఎమోషన్ ,యాక్షన్ పర్ఫెక్ట్‌గా కుదిరాయి.ఇంట్లో ఒక సాధారణ వంటమనిషిలా కనిపించే ‘టీనా’ పాత్ర, ఒక్కసారిగా డార్క్ ఆప్స్ ఏజెంట్‌గా మారి శత్రువులపై విరుచుకుపడే ఫైట్ సీన్  ఊహించని  సర్ప్రైజ్.

‘ఖైదీ’ సినిమాలోని  ఢిల్లీ (కార్తీ) పేరును ప్రస్తావించడం, ఆ డ్రగ్స్ కంటైనర్ కథను దీనికి లింక్ చేసిన విధానం లోకేష్ కనగరాజ్ స్క్రీన్‌ప్లే ప్రతిభకు నిదర్శనం.క్లైమాక్స్‌లో కమల్ హాసన్ భారీ మెషిన్ గన్ (మినీగన్) పట్టుకుని విలన్లపై కాల్పులు జరిపే సీన్ విజువల్‌గా అద్భుతంగా ఉంటుంది. 

సినిమా రన్‌టైమ్ దాదాపు 2 గంటల 54 నిమిషాలు ఉండటం వల్ల కొంచెం నిడివి ఎక్కువైనట్లు అనిపిస్తుంది.సెకండ్ హాఫ్‌లో వచ్చే కొన్ని యాక్షన్ సీన్స్ సాగదీసినట్లు ఉంటాయి. సినిమా మొత్తం డార్క్ థీమ్‌లో సాగుతూ,రక్తపాతం, యాక్షన్ ఘర్షణలతో నిండి ఉంటుంది. ఇది ఫ్యామిలీ ఆడియన్స్‌కు అంతగా నచ్చకపోవచ్చు.

‘విక్రమ్’ సినిమా భారీ విజయం సాధించడానికి, ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని ఇవ్వడానికి మ్యూజిక్, సినిమాటోగ్రఫీ ప్రధాన కారణాలుగా నిలిచాయి.ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతం ఒక పెద్ద అస్సెట్.  
అనిరుధ్ ప్రతి ప్రధాన పాత్రకు ఒక ప్రత్యేకమైన థీమ్ మ్యూజిక్‌ను డిజైన్ చేశారు. కమల్ హాసన్ ఎంట్రీ ఇచ్చినప్పుడు వచ్చే ‘విక్రమ్ టైటిల్ ట్రాక్’, ఫహద్ ఫాజిల్ సీన్ల బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, సూర్య (రోలెక్స్) ఎంట్రీకి ఇచ్చిన డార్క్ బీట్స్ ఆకట్టుకుంటాయి. 

నేషనల్ అవార్డ్ విన్నర్ గిరీష్ గంగాధరన్ ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. ఆయన విజువల్స్ సినిమాకు ఒక అంతర్జాతీయ స్థాయి లుక్‌ను తీసుకువచ్చాయి.సినిమా కథ మొత్తం డ్రగ్స్, క్రైమ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. దానికి తగ్గట్టుగా కెమెరా లైటింగ్, కలర్ ప్యాలెట్‌ను చాలా డార్క్‌గా, స్టైలిష్‌గా డిజైన్ చేశారు.  ఈ బ్లాక్‌బస్టర్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా జియో హాట్ స్టార్ లో తెలుగు వెర్షన్ లో స్ట్రీమింగ్ అవుతోంది ..ఆసక్తి ఉన్నవారు చూడవచ్చు,   

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!