తెరపై ఆమె కనబడితే చాలు.. ఈలలు.. కేకలు !!

Sharing is Caring...
Bharadwaja Rangavajhala………………………….  

బాపూగారి ముత్యాలముగ్గులో ముక్కామల కూతురుగా నోట్లో బ్రష్ పెట్టుకుని తరచూ కనిపించే అమాయకురాలి పేరే జయమాలిని అంటే . నీ ఇల్లు బంగారం గానూ…గుగ్గుగ్గు గుడిసుంది…గుడివాడ ఎల్లాను…గుంటూరు పోయాను లాంటి ఐటమ్ సాంగ్స్ కి ఇప్పటికీ క్రేజ్ తగ్గలేదు. అలాగే జయమాలిని కీ క్రేజ్ తగ్గలేదు.

దాదాపు రెండున్నర దశాబ్దాల క్రితం పెళ్లి చేసుకుని తెరచాటుకు వెళ్లిన జయమాలిని ఆ మధ్య ఆత్మకథ రాసే ప్రయత్నంలో ఉన్నట్టుగా ప్రకటించి సెన్సేషన్ క్రియేట్ చేసింది.ఆ కథ ఏమైనా దాదాపు 600 సినిమాల్లో అలుపు లేకుండా నర్తించిన చరిత్ర తనది. తన డాన్సులతో రెండున్నర జనరేషన్స్ ను ఛార్జ్ చేసిన ఘనత జయమాలినిది. జయమాలిని పెళ్లి చేసుకుంటోందట అనేది అప్పట్లో సెన్సేషనల్ న్యూస్.

సినిమాహాల్ బుక్కింగుల ముందు టిక్కెట్ల కోసం పడిగాపులు పడి బుక్కింగు ఎప్పుడు తెరుస్తాడా అని ఎదురుచూసే జనానికి ఆ లోపు ఇదే టాపిక్కు. జయమాలిని పెళ్లాడేస్తోందట ఇంక నటించదట ఇదే గోల… ఫైనల్ గా అనుకున్నంత పనీ చేసేసింది జయమాలిని.

1994 జులై 19న పోలీస్ డిపార్ట్ మెంట్ లో రైటర్ గా పనిచేస్తున్న పార్తీబన్ ను పెళ్లాడేసి…ఇండస్ట్రీకి బై కొట్టేసింది. ఒక్క సౌత్ సినిమాల్లోనే కాదు…బాలీవుడ్ లోనూ సత్తా చాటింది జయమాలిని. షాలీమార్ లాంటి బిగ్ బడ్జట్ సినిమాలో డాన్స్ చేసింది.

జయమాలినిది సినిమా కుటుంబమే. మేనత్త ఎస్పీఎల్ ధనలక్ష్మి తమిళ సినిమాల్లో హీరోయిన్ రోల్స్ చేసేది. జయ పెద్దక్క జ్యోతిలక్ష్మి ఇండస్ట్రీలో ఉండగానే మాలిని ప్రవేశించింది.ఎన్టీఆర్ తో మంచిచెడు లాంటి ఒకటి రెండు సినిమాలు తీసిన రామన్న కూడా జయమాలినికి బంధువే. తన అసలు పేరు అలివేలు మంగ. జానపద బ్రహ్మ విఠలాచార్య జయమాలినిగా మార్చారు.

నార్త్ లో హేమమాలిని జండా ఎగరేస్తున్న రోజులవి. అందుకే విఠలాచార్య తన పేరును అలా డిసైడ్ చేశారంటుంది జయ మాలిని.కేవలం ఐటమ్ సాంగ్స్ మాత్రమే కాదు.కొన్ని సినిమాల్లో కారక్టర్ రోల్స్ కూడా చేసి మెప్పించింది జయమాలిని. బిగ్ కమర్షియల్ డైరక్టర్లు కె.ఎస్.ఆర్ దాస్, రాఘవేంద్రరావు, ఎస్.డి.లాల్ జయమాలిని పాట లేకుండా సినిమా తీసింది లేదు.  దర్శకరత్న దాసరి జయమాలినికి ప్రత్యేక పాత్రలు ఆఫర్ చేశారు.

ఇదెక్కడి న్యాయం మూవీలో జయమాలినిది డిఫరెంటు రోలే. అలాగే కన్యాకుమారి లో హీరోయిన్ గా చేయించారు దాసరి. తన సోదరుడి మిత్రుడ్నే పెళ్లి చేసుకున్న జయమాలిని వెంటనే సినిమాలకు గుడ్ బై చెప్పేసి పూర్తిగా ఇంటికే పరిమితం అయిపోవడం అభిమానులను కాస్త ఇబ్బంది పెట్టినా…జయమాలిని కమిట్ మెంట్ కు ఆశ్చర్యపోయారు. పెళ్లయ్యాక పూర్తిగా ఇంటికే పరిమితం అయిపోయింది జయమాలిని. ఇండస్ట్రీలో ఉండగానూ..బయటకు వచ్చేసిన తర్వాతనూ కూడా నాన్ కాంట్రోవర్సియల్ పర్సన్ గా నిలిచింది.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!