How hard he worked behind the scenes………………..
ఈ ఫొటోలో కనిపించే బుడతడి పేరు ఆవిర్భావ్ … పేరు బాగుంది కదా .. ఈ పిల్లోడు కేరళ నుండి వెళ్లి ముంబయి నగరంలో జరిగిన superstarsinger 2024 పోటీల్లో పాల్గొని తన సత్తా చాటాడు. ఫైనల్స్ లో గెలిచాడు. ‘ఫ్యూచర్ కా ఫినాలే’ పేరుతో జరిగిన గ్రాండ్ ఫినాలే లో పాల్గొన్న ఆవిర్భావ్ అక్కడ అందరిని ఆకట్టుకున్నాడు. పది లక్షల నగదు బహుమతిని అందుకున్నాడు.
ఆవిర్భావ్ మలయాళీ పిల్లాడు.. వయసు ఏడేళ్ళు.. మూడో తరగతి చదువుతున్నాడు. ఒక్కసారి వాడి ప్రోగ్రాం చూస్తే బాల గంధర్వుడని మీరు అంటారు. పిల్లల సంగీత కార్యక్రమాలు చూసే వారందరి మనసును ఈ బుల్లోడు దోచుకున్నాడు. చిన్న వయసులో సంగీతం నేర్చుకోవడం అంటే సులభమైన విషయం కాదు. ఆవిర్భావ్ 2 సంవత్సరాల వయస్సులో పాడటం ప్రారంభించాడు. ఇప్పటికే ఎన్నో రియాలిటీ షోలలో కూడా పాల్గొన్నాడు.
ఆవిర్భావ్ తన సోదరి ని చూసి ప్రేరణ పొంది పాడటం మొదలెట్టాడు. జీ తెలుగు సరిగమప లిటిల్ చాంప్స్ వేదికపై మొదటి సారిగా ఆవిర్భావ్ ప్రదర్శన ఇచ్చాడు. కేరళ రాష్ట్రంలోని ఇడుక్కిలో 17 ఆగస్టు 2016న జన్మించాడు. ప్రస్తుతం కుటుంబంతో కలసి కొచ్చిలో ఉంటున్నాడు.
సోదరి పేరు అనిర్విణ్య.. 2018 జీ తెలుగు సరిగమప లిటిల్ చాంప్స్ పోటీల్లో మూడవ స్థానం లో నిలిచింది. ఆవిర్భావ్ ఇప్పటివరకు తన సొంత ఊళ్ళో జరిగిన అన్ని పాటల పోటీలలో గెలుపొందాడు. ఎన్నోవేదికలపై కూడా ప్రదర్శనలు ఇచ్చాడు పలు అవార్డులు గెలుచుకున్నాడు.
2022లో అవిర్భావ్ సింగింగ్ రియాలిటీ టీవీ షో “ఇన్ ఫ్లవర్స్ టాప్ సింగర్ సీజన్ 3”లో పోటీదారుగా పాల్గొన్నాడు. ఎన్నో ప్రశంసలు అందుకున్నాడు. సూపర్ స్టార్ సింగర్ సీజన్ 3 మార్చి 9, 2024న సోనీ టీవీ ఛానెల్‌లో ప్రారంభమైంది. అక్కడ ఆవిర్భావ్ తన మొదటి ఆడిషన్‌ను ఇచ్చాడు..న్యాయమూర్తుల మెప్పు పొందాడు.
తన స్థిరమైన అద్భుతమైన ప్రదర్శన కారణంగా, ఆవిర్భావ్ ప్రజల నుండి అత్యధిక ఓట్లను పొంది సూపర్ స్టార్ సింగర్ సీజన్ 3 ఫైనల్లో విజేతగా నిలిచాడు. సూపర్ స్టార్ సింగర్ సీజన్ 3లో సైలీ కాంబ్లే టీమ్‌లో ఆవిర్భావ్ ఉన్నాడు.
సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ వారి యూట్యూబ్ ఛానెల్‌లో అవిర్భావ్ ప్రదర్శనలను మిలియన్ల మంది వీక్షకులు చూసారు.చూస్తున్నారు. అక్కా తమ్ముడు కలసి ANIIRVINHYA & AVIRBHAV పేరుతో ఒక YouTube ఛానెల్‌ని సృష్టించారు. ఈ ఛానల్ వీడియోస్ కి కూడా ఆదరణ బాగుంది. లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి.
ఆవిర్భావ్ ,, అనిర్విణ్య లకు తర్జని తరపున అభినందనలు.