గోవా యాత్రకు తెలంగాణ టూరిజం అదిరే ఆఫర్!!

Sharing is Caring...

Telangana Tourism Special Package………………………….

గోవా చూసి రావాలని  చాలామంది కలలు కంటుంటారు. అందమైన బీచ్‌లు, చారిత్రత్మక కట్టడాలు .. సూర్యాస్తమయ సన్నివేశాలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. గోవా లో  పోర్చుగల్,భారతీయ సంస్కృతి సమ్మిశ్రమంగా  కనిపిస్తుంది. ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు.

సొంతంగా గోవా వెళ్లి రావాలంటే చాలా ఖర్చు అవుతుంది. తక్కువ ఖర్చు లో గోవా వెళ్లి రావాలనుకునే  వారి కోసం తెలంగాణ టూరిజం స్పెషల్ టూర్ ప్యాకేజీ ని ఆఫర్ చేస్తోంది. హైదరాబాద్‌ నుంచి గోవాకు ప్రతి సోమవారం ఈ టూర్ ను తెలంగాణ టూరిజం సంస్థ ఆపరేట్ చేస్తున్నది. నాలుగు రోజుల పాటు సాగే ఈ టూర్‌ ప్యాకేజీలో ఏయే ప్రాంతాలు కవర్‌ అవుతాయి.? ప్యాకేజీ ధర ఎంత.? తదితర వివరాలు తెలుసుకుందాం..

టూర్‌ కింది విధంగా సాగుతుంది..

@  తొలిరోజు బషీర్‌బాగ్‌ నుంచి మధ్యాహ్నాం 2 గంటలకు గోవాకు ప్రయాణం మొదలవుతుంది.  మార్గ మధ్యంలో డిన్నర్ ఉంటుంది.  రాత్రంతా ప్రయాణం చేయాలి. 
@  రెండో రోజు ఉదయం 6 గంటలకు కలంగుట్ చేరుకుంటారు. అక్కడ హోటల్‌లో బస చేయాలి.  ఉదయం 10 గంటలకు  నార్త్‌ గోవాలోని మపుసా సిటీ, బోగ్దేశ్వర్ ఆలయం, ఫోర్ట్‌ అగుడా, బాగా బీచ్‌, కలంగుట్‌ బీచ్‌ లను సందర్శిస్తారు. ఆ రాత్రికి ఉదయం దిగిన హోటల్ లోనే రెస్ట్ తీసుకుంటారు. 

@  మూడో రోజు ఉదయం సౌత్‌ గోవా సందర్శనకు తీసుకువెళతారు. డోనా పౌలా బీచ్, మిరామార్ , ఓల్డ్ గోవా చర్చిలు, మంగేషి టెంపుల్, కోల్వా బీచ్, మార్డోల్ బీచ్‌ల ను చూస్తారు.  సాయంత్రం పాన్‌జిమ్‌లో క్రూజ్‌ బోట్‌లో జర్నీ ఏర్పాటు చేస్తారు.  తిరిగి రాత్రి కలంగుట్‌ చేరుకుని.. హోటల్ లో ఉంటారు. 

@  నాల్గవ రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ ముగించుకుని 11 గంటలకు కలంగుట్‌ నుంచి హైదరాబాద్‌ కు రిటర్న్ జర్నీ మొదలవుతుంది. రాత్రంతా ప్రయాణం సాగుతుంది. ఐదవ రోజు ఉదయం 6 గంటలకు బస్ హైదరాబాద్‌కు చేరుకోవడంతో టూర్‌ ముగుస్తుంది. ఈ ప్రయాణానికి  ఏసీ వోల్వో కోచ్ ను పెడతారు. రెండు రాత్రులు హోటల్ లో ఏసీ గదులు ఏర్పాటు చేస్తారు.  

ప్యాకేజీ  ధరలు 

ఇక ప్యాకేజీ లో పెద్దలకు చార్జి  ఒక్కరికి రూ. 11,999గా నిర్ణయించారు. అలాగే పిల్లలు ఒక్కరికి  రూ. 9599గా నిర్ణయించారు. సింగిల్‌ ఆక్యుపెన్సీకి మాత్రం రూ. 14,900 చెల్లించాలి. హోటల్లో బస , భోజనం ఛార్జీలు ప్యాకేజీలో కవర్‌ అవుతాయి. పాన్‌జిమ్‌లో క్రూజ్‌ బోట్‌ జర్నీకి ఛార్జ్ సొంతంగా చెల్లించాలి. టికెట్‌ బుకింగ్.. ఇతర వివరాల  కోసం తెలంగాణ టూరిజం అధికారిక వెబ్‌సైట్‌ను చూడండి. లేదా 9848540371 నంబర్ లో సంప్రదించండి. 

 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!