బీరు బాటిళ్లే వారి బాంబులు !

Sharing is Caring...

Strategic combat ……………………

బీరు బాటిళ్లను బాంబులు గా మార్చుకుని ఉక్రెయిన్ పౌరులు రష్యా సైన్యాన్ని బెంబేలెత్తించారు.ఈ ఘటన 2022మార్చి నెలలో జరిగింది.రష్యా ఉక్రెయిన్ సేనల యుద్ధం సందర్భంగా ఉక్రెయిన్ పౌరులు తమ సత్తా చూపించారు.

అది ఉక్రెయిన్‌ లోని లీవ్‌ పట్టణం  ..పోలాండ్‌ బార్డర్‌కి 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆ నగరంలోకి  ప్రవేశించాలని రష్యా సైనికులు గట్టిగా ప్రయత్నించారు. స్థానిక ప్రజలు వారికి ఆయుధాలు లేని నేపథ్యంలో బీరు బాటిళ్లను ఆయుధాలు మార్చుకుని దాడులు చేశారు.
బీరు బాటిళ్లతో ఎలా దాడి చేశారా ? అని ఆశ్చర్య పోకండి .. దానికో టెక్నిక్ ఉంది.

లీవ్ పట్టణంలో ‘ప్రావ్డా బ్రూవరీ’ బీర్ల తయారీకి చాలా ప్రసిద్ధి. ఈ కంపెనీ యుద్ధం మొదలయ్యాక బీర్ల తయారీని ఆపేసింది. రష్యా సైన్యం పై దాడుల కోసం పెట్రోల్ బాంబులు తయారు చేసింది. కంపెనీ ఉద్యోగులు యుద్ధ ప్రతిపాదికపైన ఈ బాటిల్‌ బాంబులను తయారు చేశారు.

ఈ బీర్‌ బాటిళ్లలో ఆయిల్‌,పెట్రోల్‌ మిక్స్‌ చేశారు.అందులో గుడ్డకు నిప్పు అంటించి రష్యా సైనికులపై విసిరారు. స్థానిక ప్రజలకు కూడా ఆ బాటిళ్లను అందజేశారు. దీంతో ప్రజలు కదనోత్సాహం తో సైనికులపై దాడులు చేశారు.

బాటిల్ లోపల ఉండే కాక్ టెయిల్ పెట్రోల్, ఆల్కహాల్ మాదిరే మండే స్వభావం కలిగి ఉండటం తో .. సీసా మూతభాగంలో ఉన్న వస్త్రానికి నిప్పు అంటించి  రష్యాసేనలపై ప్రజలు విసిరి కొట్టారు.అంతే ..

ఈ పెట్రోల్ బాంబుల ధాటికి రష్యా సైనికులు తట్టుకోలేకపోయారు. 2014 క్రిమియా సంక్షోభం సమయంలో కూడా ప్రత్యర్థులపై  ఇదే పద్ధతిలో పెట్రోల్ బాంబు దాడులు జరిగాయని అంటారు.

గతం లో ఇలాంటి దాడుల్లో పాల్గొన్న వ్యక్తే ప్రస్తుతం బీర్ కంపెనీ కి ఈ పెట్రోల్ బాంబులు తయారు చేయడం లో సహాయ పడ్డారు.రష్యా యుద్ధానికి నిరసనగా కంపెనీ ఉద్యోగులు వారికి చేతనైన రీతిలో పోరాడారు.ఈ కంపెనీ గతంలోనూ ‘పుతిన్‌ ఖుయ్‌లో’ అంటూ పుతిన్‌ ను అవమానిస్తూ బీర్లు తయారు చేసింది.అవన్నీపెద్ద ఎత్తున అమ్ముడు పోవేవి అట.

 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!