ఆకట్టుకునే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ !!

Sharing is Caring...

గరగ త్రినాధరావు………..

సరైన సక్సెస్ లేక కొన్నేళ్ళుగా సతమతమౌతున్న సూర్యకు ఈ యేడాది బాగా కలిసొచ్చింది. మండు వేసవిలో ఆర్.జె. బాలాజీ తెరకెక్కించిన ‘కరుప్పు’ మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు వర్షాకాలంలో చాలా కూల్ గా విశ్వనాథ్‌ అండ్ సన్స్ సినిమాతో మన ముందుకు వచ్చాడు హీరో సూర్య..

‘లక్కీ భాస్కర్’ లాంటి నేషనల్ అవార్డు విన్నింగ్ సినిమా ఇచ్చిన వెంకీ అట్లూరి, అందులోనూ హీరో సూర్యతో జతకడుతున్నాడు అంటేనే ప్రేక్షకుల్లో ఒక రకమైన బజ్ క్రియేట్ అయింది. సినిమా చూసిన తర్వాత అటు దర్శకుడికి ఇటు హీరోకి, హీరోయిన్ కి కూడా మనకు తెలియకుండానే ఫ్యాన్స్ అయిపోతాం.

ఒక రిచ్ ఫ్యామిలీని క్రియేట్ చేసి వాళ్ళ ఏడుపులు, నవ్వులకు మనల్ని రియాక్ట్ అయ్యేలా చేస్తారు. ఇక్కడ దర్శకుడు కి త్రివిక్రమ్ పూనాడేమో అనిపిస్తుంది. ఆ రిచ్నెస్, ఎలివేషన్స్, యాక్షన్ సీక్వెన్సెస్ అన్నీ కూడా త్రివిక్రమ్ ఫార్మాట్ లోనే ఉన్నాయి.

సీన్లే కాదు డైలాగ్స్ కూడా..ఉదాహరణకి – “మన కలల కోసం దేన్నయినా త్యాగం చేయవచ్చు. దేని కోసం మన కలల్ని త్యాగం చేయకూడదు.. ప్రాబ్లంని ప్రైవేట్ జెట్ వేసుకుని మరీ తీసుకొచ్చా.. మనకున్న కోపం,ద్వేషం కొన్నాళ్ళకి అలసిపోతాయి..లాంటి డైలాగులు ఆకట్టు కుంటాయి .

అరమరికలు మరిచిపోయి, ఇగోలను పక్కన పెట్టి అందరూ కలిసి మెలిసి జీవితాన్ని సాగించాలనే ఓ గొప్ప సందేశాన్ని బాగా చూపించారు. అయితే ఈ క్రమంలో మెలో డ్రామా పైన దర్శకుడు బాగానే ఆధారపడ్డాడు.మామూలుగా అయితే ఇలాంటి కథలని డీల్ చేయడం కష్టం.

అయితే సూర్య, మమితాబైజు, రాధికా శరత్ కుమార్ ల నటన సినిమాని నిలబెట్టాయి. దర్శకుడు వెంకీ అట్లూరి ఎక్కడా బ్యాలెన్స్ తప్పకుండా అతి డ్రామా లేకుండా, మంచి డైలాగులు, ఎమోషన్స్‌తో సినిమాను నడిపాడు.
ఐతే ప్రిడిక్టబుల్ కథని బిగువుగా నడపడంలో సెకెండాఫ్‌లో దర్శకుడు తడబడ్డాడనిపిస్తుంది.

కథకు పూర్తిగా అవసరం లేని ఫైట్స్, సబ్‌ప్లాట్స్ అనవసరం అనిపించింది సెకండాఫ్లో..ఇక ప్రీ క్లైమాక్స్ నుంచి చివరి సీన్ వరకు నడిపించిన ఫ్యామిలీ డ్రామా ఉద్వేగానికి గురి చేస్తుంది.దాంతో ఈ మధ్యకాలంలో చక్కటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను చూశామనే ఫీలింగ్ కలుగుతుంది.

నటీనటుల విషయానికి వస్తే.. సూర్య గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.42 ఏళ్ల విశ్వనాథ్ పాత్రలో సూర్య అద్భుతంగా నటించారు. ఆయన స్టైలిష్ లుక్స్, ఎమోషనల్ సీన్స్‌లో ఆయన చూపించిన నటన సినిమాకు మెయిన్ పిల్లర్. కొన్ని సీన్లలో ఆయన పాత ‘గజని’ సినిమా రోజులను గుర్తు చేస్తారు.

ఈ సినిమాను పూర్తిగా తనవైపుకు తిప్పుకొన్న వారిలో మమితా బైజుకు ప్రథమ స్థానం లభిస్తుంది. సూర్యతో పోటి పడుతూ సినిమాకు బ్యాక్ బోన్‌గా నిలిచింది. చిలిపిగా, ఎమోషనల్‌గా, రొమాంటిక్‌గా మమితా మరో జోన్‌లో నటనను ప్రదర్శించింది..రాధిక, రవీనా టాండన్ ల పెర్ఫార్మెన్స్ అద్భుతమనే చెప్పాలి.

సాంకేతిక విభాగాల విషయానికి వస్తే..ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించిన జీవి ప్రకాష్ కుమార్ బిజిఎం స్కోర్ బాగున్నా పాటలు అంత గొప్పగా లేవు, నిమిష్ రవి సినిమాటోగ్రఫి, ఆర్ట్, ఎడిటింగ్ విభాగం పనితీరు చక్కటి సమన్వయంతో బ్రహ్మండంగా పనిచేశాయి. ప్రతీ విభాగం నుంచి దర్శకుడు రాబట్టుకొన్న అవుట్‌ ఫుట్ ఎక్సలెంట్‌గా ఉన్నాయి.

ముఖ్యంగా నిర్మాతలు నాగవంశీ, సౌజన్య అనుసరించిన నిర్మాణ విలువలు హై రేంజ్‌లో ఉన్నాయి. లావిష్, రిచ్ సెట్స్‌ సినిమాను గ్రాండియర్‌గా మార్చాయి. సూర్య, మమితా, రాధికల పెర్ఫామెన్స్, దర్శకుడు వెంకీ అట్లూరి టేకింగ్, విజన్ కోసం ఈ సినిమాను ఈ వీకెండ్ లో ఫ్యామిలీతో తప్పకుండా థియేటర్‌లోనే చూడాలి.

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!