చెన్నైకి చెందిన రేడియో జాకీ, గాయని సుచిత్రా కార్తీక్ 2017లో కోలీవుడ్‌ను ఒక ఊపు ఊపేసింది. సుచీ లీక్స్ పేరిట కొంతమంది నటీ నటులకు సంబంధించిన కొన్ని ప్రైవేట్ వీడియోలు, ఫొటోలను విడుదల చేసి పెద్ద దుమారం సృష్టించింది. సుచి తన ఫేస్ బుక్, ట్వీట్టర్ ఖాతాల ద్వారా ఈ సమాచారాన్ని లీక్ చేసింది.
వీటిలో ధనుష్,రానా,ఆండ్రియా, అమలాపాల్, త్రిష, హన్సిక, అమీ జాక్సన్, అనిరుధ్, సింగర్ చిన్మయి, తమన్నా, పూనమ్ భజ్వా ఇలా పలువురికి సంబంధించిన ఫొటోలు బయటకు వచ్చాయి. ఈ జాబితాలో రజనీకాంత్ అల్లుడు, స్టార్ స్టేటస్ సంపాదించుకన్న ధనుష్ ఉండటం తో అప్పట్లో ఈ అంశం సంచలనం సృష్టించింది.
ధనుష్ తనకు మత్తుమందు ఇచ్చి లైంగికంగా వేధించాడని సుచిత్ర ఒక దశ లో వరుసగా ట్వీట్స్ కూడా చేశారు. ధనుష్ సహాయకులు కూడా తనను మానసికంగా వేధించారని సుచిత్ర ఆరోపించింది. అంతకుముందు తమిళ చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ గురించి కొన్ని ట్వీట్లు చేసింది. అలాగే తమిళ చిత్ర నిర్మాతలు యువ నటీమణులను వేధిస్తున్నారనే అంశంపై మరికొన్ని ట్వీట్లు చేసింది.
ఇదంతా సుచిత్ర ఎందుకు చేసిందనే అంశంపై ఇతమిత్థంగా సమాచారం లేదు. అలాగే సుచిత్ర ఆరోపణలు నిజమేనా ? తాను ఎందుకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు ? అసలు ఆ ఫోటోలు తీసింది ఎవరు ? ఎందుకు తీశారో ఎవరికి తెలీదు. సంగీత దర్శకుడు అనిరుద్ ద్వారా సుచిత్ర ధనుష్ కి పరిచయమైంది అంటారు.
లీక్స్ తర్వాత కొన్నిరోజులు ఆమె భర్త కార్తీక్ కుమార్ సుచిత్ర మానసిక పరిస్థితి బాగాలేదని ప్రకటించాడు. సుచిత్ర అకౌంట్ హ్యాక్ అయిందని చెప్పాడు.ఆమె ట్వీట్లను ఎవరూ వ్యక్తిగతంగా తీసుకోకూడదని కార్తీక్ అందరిని వేడుకున్నాడు. అప్పట్లో ఈ అంశంపై ధనుష్ కూడా మౌనం వహించగా, అతని సోదరి విమలా గీత సుచిత్ర ట్వీట్స్ ను ఖండించింది. సుచిత్ర మనసులో ద్వేషం పెట్టుకునే ఇదంతా చేసిందని ఆరోపించారు.
ఈ క్రమంలోనే తన ఖాతా ను ఎవరో హ్యాక్ చేసారని సుచిత్ర కూడా ప్రకటించింది.అసలు సుచిత్ర ఇలా ఎందుకు చేసింది ? మానసికంగా బాగా లేని పరిస్థితుల్లో ఈ లీక్స్ వ్యహారాన్ని ఎలా నిర్వహించింది ? అనేది ఒక మిస్టరీ.గతంలో తన స్నేహితులుగా ఉన్న వ్యక్తులపై సుచిత్ర తీవ్రమైన ఆరోపణలు చేయడానికి ఆమెను ప్రేరేపించింది ఎవరు ? సుచిత్రకు వీడియో క్లిప్స్ ,ఫోటోలు ఎవరిచ్చారు ?
నిజంగా లీక్స్ వ్యవహారంలో ఆమె పాత్రలేదా ? హ్యాకర్స్ చేసారా ? వారు ఎందుకు చేశారు అనే ప్రశ్నలకు జవాబులు లేవు. అప్పట్లో రేవ్ పార్టీలకు పైన పేర్కొన్న తారలు హాజరయ్యేవారని .. ఆ సందర్భం గానే ఫోటోలు తీశారని అంటారు. అసలు అవి నిజమైనవా ? మార్ఫింగ్ చేసినవా ? కూడా ఎవరికి తెలీదు. సుచీ లీక్స్ పై అప్పట్లో త్రిష ఒక్కరే పరోక్షంగా మాట్లాడింది. మరెవరూ ఈ లీక్స్ పై మాట్లాడలేదు.
కాగా ఇండియన్ నేషనల్ లీగ్ పార్టీ (INLP) సుచిత్రపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఆమెను అరెస్టు చేయాలని డిమాండ్ చేసింది.అయితే పోలీసులు ఈ విషయాన్ని పట్టించుకోలేదు. ఈ లీక్స్ వ్యవహారంలోనే ధనుష్ ఐశ్వర్యలు గొడవలు పడ్డారని, చివరకు చేసేదేమిలేక విడిపోవాలని నిర్ణయం తీసుకున్నారని తమిళ సినీ వర్గాలు చెబుతున్నాయి.
—–KNMURTHY
No Responses