Action thriller……..
‘ఖైదీ’ (Khaidi) ఇదొక మైండ్‌బ్లోయింగ్, యాక్షన్ థ్రిల్లర్,బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్..ఈ సినిమా 2019 లో విడుదలైంది. కార్తీ హీరోగా, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందింది. ఆహ లో తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ అవుతోంది.
కథ ఏమిటంటే ?
ఒకే ఒక్క రాత్రిలో జరిగే కథ ఇది. భారీ ఎత్తున దొరికిన డ్రగ్స్ ను పోలీసులు ఒక రహస్య ప్రదేశంలో దాచడంతో, డ్రగ్ మాఫియా పగతో కమీషనర్ ఆఫీస్ పై రైడ్‌కు ప్లాన్ చేస్తుంది. అదే సమయంలో ఒక పార్టీలో వందలాది మంది పోలీసులకు డ్రగ్స్ ద్వారా విషం ఇస్తారు.
స్పృహ తప్పిన ఆ పోలీసులను కాపాడటానికి ఇన్స్‌పెక్టర్ బిజోయ్ (నరైన్), అప్పుడే జైలు నుండి విడుదలైన ఖైదీ ఢిల్లీ (కార్తీ) సహాయం కోరతాడు. 10 ఏళ్లుగా చూడని తన చిన్న కూతురిని కలవాలనే ఆశతో ఉన్న ఢిల్లీ, ఆ రాత్రి పోలీసులను కాపాడటానికి ఒక లారీ వేసుకుని డ్రగ్ మాఫియాతో ఎదురెళ్లి చేసే పోరాటమే ఈ సినిమా.
సినిమా అంతా కార్తీ వన్‌మ్యాన్ షో గా నడుస్తుంది.’ఢిల్లీ’ పాత్రలో కార్తీ మంచి నటనను కనపరిచారు. రగ్గడ్ లుక్‌లో ఇంటెన్స్ యాక్షన్ సీన్స్ చేస్తూనే, కూతురిపై ఉండే ప్రేమను, ఎమోషన్స్‌ను తన కళ్లతోనే పండించారు. లోకేష్ కనగరాజ్ స్క్రీన్‌ప్లే ఈ సినిమాకి అతిపెద్ద బలం. కమర్షియల్ ఎలిమెంట్స్, హీరోయిన్, లవ్ ట్రాక్ ఏమీ లేకుండా కేవలం కథ,యాక్షన్‌తోనే ప్రేక్షకుడిని క్లైమాక్స్ వరకు ఆకట్టుకుంటారు.
సినిమా మొత్తం రాత్రి వేళ సాగుతుంది. సత్యన్ సూర్యన్ లైటింగ్-సినిమాటోగ్రఫీ, సామ్ సీఎస్ (Sam CS) అందించిన గూస్‌బంప్స్ ఇచ్చే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ (BGM) సినిమా మూడ్‌ను పీక్స్‌కి తీసుకెళ్తాయి. ఇన్స్‌పెక్టర్ బిజోయ్‌గా నరైన్, నెగటివ్ రోల్‌లో అర్జున్ దాస్ , లారీ ఓనర్‌గా ధీనా తమ పాత్రల్లో ఒదిగిపోయారు. నటీ నటులంతా బాగానే చేశారు.
సెకండాఫ్‌లో కొన్ని యాక్షన్ బ్లాక్స్ కాస్త రిపీటేటివ్‌గా, సాగదీసినట్లు అనిపిస్తాయి.యాక్షన్ సీన్స్ రా అండ్ రస్టిక్‌గా ఉండటం వల్ల రక్తం, హింస కాస్త ఎక్కువగా కనిపిస్తాయి.‘ఖైదీ’ కేవలం ఒక యాక్షన్ సినిమా మాత్రమే కాదు.. దాని వెనుక ఒక బలమైన తండ్రి-కూతుళ్ల ఎమోషన్ ఉంటుంది.
జైలు నుండి విడుదలైన తర్వాత ఢిల్లీ (కార్తీ) మొదటిసారి లారీలో వెళ్లే ముందు పెద్ద బకెట్ లో ఉన్న చికెన్ బిరియానీని తినే సీన్ బాగుంటుంది. ఎటువంటి డైలాగ్స్ లేకుండా కార్తీ కేవలం తన బాడీ లాంగ్వేజ్, ఆకలితో తినే విధానంతో ఆ పాత్ర తీవ్రతను, అమాయకత్వాన్ని పండించారు.
చీకటి రోడ్డుపై డ్రగ్ మాఫియా గ్యాంగ్ లారీని అడ్డగించినప్పుడు, ఢిల్లీ మొదటిసారి తన అసలు సిసలైన యాక్షన్ రూపాన్ని చూపిస్తాడు. కూతురిని చూడాలనే తపనతో, అడ్డువచ్చిన రౌడీలను ఒంటిచేత్తో కొట్టే ఈ రా అండ్ రస్టిక్ ఫైట్ సీక్వెన్స్ కుర్రకారు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి.
కమీషనర్ ఆఫీసులో ఒకే ఒక్క కానిస్టేబుల్ నెపోలియన్ (జార్జ్ మేరియన్) నలుగురు కాలేజ్ స్టూడెంట్స్ కలిసి ఒక పెద్ద డ్రగ్ మాఫియా గ్యాంగ్ నుండి ఆఫీస్‌ను కాపాడుకునే సీన్స్ చాలా గ్రిప్పింగ్‌గా ఉంటాయి. నెపోలియన్ క్యారెక్టర్ బిల్డ్ చేసిన సస్పెన్స్, భయం, అతని ధైర్యం ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది.
విలన్ గ్యాంగ్‌లో ఒకడైన ‘అన్బు’ పాత్రలో అర్జున్ దాస్ ఎంట్రీ ఇచ్చి, తన బేస్ వాయిస్‌తో కమీషనర్ ఆఫీస్ బయట మైక్ పట్టుకుని మాట్లాడే సీన్ థ్రిల్ ఇస్తుంది. ఆ వాయిస్, అతని క్రూరత్వం సినిమాకు మరింత హైప్ తెచ్చాయి.
సినిమా మొత్తానికి హైలెట్ క్లైమాక్స్ సీనే. కమిషనర్ ఆఫీస్ లోపలికి రౌడీలు దూసుకొస్తున్న సమయంలో, ఢిల్లీ ఒక భారీ గట్లింగ్ గన్ (Gatling Gun/Machine Gun) పట్టుకుని మాఫియా ముఠాపై ఎదురుదాడి చేసే సీన్ మైండ్‌బ్లోయింగ్‌గా ఉంటుంది. సామ్ సీఎస్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో ఈ సీన్ బాగా వచ్చింది.
పోరాటాలన్నీముగిసిన తర్వాత, పదేళ్లుగా చూడని తన చిన్న కూతురిని మొదటిసారి చూసి, కన్నీళ్లతో ఆమెను హత్తుకునే సీన్ ప్రతి ఒక్కరి గుండెను పిండేస్తుంది.సినిమాను పీక్ ఎమోషన్‌తో ముగించడంలో లోకేష్ ఇక్కడ వంద శాతం సక్సెస్ అయ్యారు.
నైట్ షూట్ చేయడం విజువల్ పరంగా చాలా సవాలుతో కూడుకున్న పని అయినప్పటికీ, సత్యన్ సూర్యన్ తన కెమెరాతో మాయ చేశారు.
సినిమా ఎక్కడా ఆర్టిఫిషియల్‌గా అనిపించకుండా, లారీ లైట్లు, స్ట్రీట్ లైట్లు, టార్చ్ లైట్ల వెలుతురును వాడుకుంటూ సహజమైన చీకటి వాతావరణాన్ని స్క్రీన్‌పై అద్భుతంగా ఆవిష్కరించారు.లారీ చేజ్ సీక్వెన్స్ లు, అడవి దారుల్లో వచ్చే ఫైట్లు, క్లైమాక్స్ కమీషనర్ ఆఫీస్ ముట్టడి సీన్లలో కెమెరా మూవ్‌మెంట్స్ ప్రేక్షకుడికి తానే స్వయంగా ఆ రాత్రి ప్రయాణంలో ఉన్నాననే ‘సర్వైవల్’ ఫీలింగ్‌ను కలిగిస్తాయి.
ఈ సినిమాలో సామ్ సీఎస్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పెద్ద బలం.యాక్షన్ సీన్లకే కాకుండా, తండ్రి-కూతుళ్ల సెంటిమెంట్ సీన్స్,లారీలో ఢిల్లీ తన గతాన్ని వివరించే సీన్లలో సామ్ సీఎస్ ఇచ్చిన మెలోడీ హృదయాన్ని కదిలించే స్కోర్ సినిమాకు ప్రాణంగా నిలిచింది.
క్లైమాక్స్‌లో మెషిన్ గన్ ఫైట్ జరిగేటప్పుడు వచ్చే థంపింగ్ మ్యూజిక్ ప్రేక్షకులలో హుషారు నింపుతుంది. మొత్తంగా చెప్పాలంటే, ‘ఖైదీ’ సినిమాను లోకేష్ కేవలం ఒక కథగా రాస్తే, సత్యన్ విజువల్స్ – సామ్ సీఎస్ మ్యూజిక్ దానికి ఊపిరి పోసి ఒక మాస్టర్‌పీస్‌గా మార్చాయి.

