పై ఫొటోలో కనిపించే జంట చూడ ముచ్చటగా ఉంది కదా. కేవలం పొట్టిగా ఉన్నారు తప్పితే మరే లోపం ఆ ఇద్దరికీ లేదు. మొత్తం ప్రపంచంలోనే అతి పొట్టి వాళ్ళు ఈ ఇద్దరూ. బ్రెజిల్ కి చెందిన పాలో గాబ్రియేల్ వయసు 36 ఏళ్ళు. ఎత్తు 90.28 సెంటీమీటర్లు . కత్యుషియా లీషినో వయసు 33 ఏళ్ళు. ఎత్తు 91. 13 సెంటీమీటర్లు. 2006 లో వీరిద్దరూ ఒకరికొకరు సోషల్ మీడియా ద్వారా పరిచయమయ్యారు.ఇద్దరి ఎత్తులు దగ్గరగా ఉండటం .. అభిరుచులు కలవడంతో ముందు మంచి స్నేహితులయ్యారు. కొంతకాలం ఆన్లైన్ చాటింగ్ లో మాట్లాడుకునే వారు. అలా అలా ప్రేమలో పడిపోయారు.
2008 లో మొదటిసారిగా కల్సి ఒకరినొకరు చూసుకున్నారు. ఆ పై పెళ్లి చేసుకోవాలని నిర్ణయానికొచ్చారు. కానీ అంత సులభంగా ఒకటి కాలేకపోయారు. తర్వాత పెద్ద వాళ్ళ అనుమతి తో 2016లో ముందడుగు వేశారు. లండన్ లోని గిన్నిస్ బుక్ రికార్డు హెడ్ ఆఫీస్ సమీపంలోని చర్చిలో పెళ్లిచేసుకున్నారు. తమ కలను సాకారం చేసుకున్నారు. కత్యుషియా లీషినో ఒక బ్యూటీ పార్లర్ నడుపుతున్నది. ప్రస్తుతానికి పిల్లలు వద్దనుకున్నారు. కిచెన్, ఫర్నిచర్ తదితరాలను వారికి అనుకూలంగా మార్చుకున్నారు. ప్రపంచంలోనే అత్యంత పొట్టి జంటగా వీరు కొత్త రికార్డ్ నెలకొల్పారు. గిన్నిస్ బుక్ వారు ఈ విషయాన్ని ధృవీకరిస్తూ ఒక సర్టిఫికెట్ కూడా జారీ చేశారు. ప్రస్తుతం ఆ ఇద్దరు హ్యాపీగా కలసి జీవిస్తున్నారు. ఆ రికార్డు ను కూడా తర్వాత ఎవరూ అధిగమించలేదు.
Taadi Prakash ………………………………………………. 1976. అది ఎమర్జన్సీ కాలం. విజయవాడ ఎస్ఆర్ఆర్ కాలేజీలో బీకాం చివరి సంవత్సరం చదువుతున్నా.మారుతీ నగర్ లో మా ఇల్లు.శ్రీశ్రీనీ, తిలక్ నీ, చెలాన్నీ చదవడం. ఫిలిం సొసైటీ … Read More
Ramana Kontikarla ………… ముంబై అండర్ వరల్డ్ కు గ్లామర్ అద్దే క్రైమ్ డ్రామాలు, స్టైలిష్ గ్యాంగ్ స్టర్ సినిమాలు చూసేకంటే ముందే… భయం కంటే వేగంగా ముంబైని వణికించిన పేర్లు కొన్ని … Read More
Inappropriate comments…….. ప్రధాన స్రవంతి మీడియా సంస్థగా సన్ టీవీ (Sun TV) నటి సుకన్య విషయం లో అలా వ్యవహరించి ఉండకూడదు. ప్రజాదరణ, టీఆర్పీ రేటింగుల కోసం, ఆమె అభిప్రాయం తీసుకోకుండా, … Read More