investment instruments …………………..
భవిష్యత్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మీరు పెద్ద మొత్తాన్ని కూడబెట్టుకోవాలనుకుంటే, తప్పని సరిగా సొమ్ము ఆదా చేయాలి. ప్రతి నెలా సంపాదించిన సొమ్ములో కొంత పొదుపు చేసి ఎందులో నైనా పెట్టుబడి పెట్టాలి. ఇన్వెస్ట్ చేయడానికి అనేక పెట్టుబడి సాధనాలు ఉన్నాయి. అయితే ఎక్కడ పెట్టుబడి పెట్టాలో చాలామందికి తెలియదు.
కొంత మంది ఎఫ్డి, ఆర్‌డిలో, మరికొంత మంది సిప్ లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. వీటిలో ఏది కరెక్ట్ సాధనమనే సందేహం ఇప్పటికీ చాలామందికి ఉంది. ఆర్ డి లేదా సిప్ ఈ రెండింటిలో పెట్టుబడి రూ.1000 నుండి మొదలవుతుంది. ఆర్డీ మీరు బ్యాంకు లేదా పోస్టాఫీసులో ప్రారంభించవచ్చు. మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి డీమ్యాట్ ఖాతా అవసరం. ఆర్డీ, సిప్ రెండింటికీ కొన్ని ప్రయోజనాలు,ఉన్నాయి.
ఆర్డి ప్రారంభించాలనుకుంటే కనీసం ఐదేళ్ల పాటు నెలకు కొంత సొమ్మును మదుపు చేయాలి. ఆర్డీ ప్రయోజనం ఏమిటంటే మీరు దానిలో హామీతో కూడిన రాబడిని పొందుతారు. చాలా మంది సురక్షితమైన పెట్టుబడిగా దీన్ని ఎంచుకుంటారు. చాలా మంది ప్రజలు ఆర్డి ద్వారా డిపాజిట్ చేసిన డబ్బును ఎఫ్డీ లోకి తిరిగి పెట్టుబడి పెడతారు.
ఆర్డీలో ఆగితే పెనాల్టీ చెల్లించాలి. ప్రస్తుతం పోస్టాఫీసు ఆర్‌డిపై 6.5 శాతం వడ్డీ చెల్లిస్తోంది. మీరు ఆర్డీపై లోన్ లేదా ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యాన్ని కూడా పొందవచ్చు. ఇది మీ డిపాజిట్ మొత్తంలో 80 నుండి 90 శాతం కావచ్చు. ఆర్డీ మెచ్యూరిటీపై వచ్చే వడ్డీపై పన్ను విధిస్తారు. ఆర్డీపై వడ్డీ ఆదాయం రూ.40,000 (సీనియర్ సిటిజన్ల విషయంలో రూ. 50,000) వరకు ఉంటే మీరు దానిపై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. దీని కంటే ఎక్కువ ఆదాయం ఉంటే 10% టీడీఎస్ కట్ చేస్తారు. ఇది పూర్తి గా రిస్క్ ఫ్రీ ఇన్వెస్ట్మెంట్.
ఇక SIP విషయానికొస్తే … మీరు SIP ను చిన్నపెట్టుబడితో కూడా ప్రారంభించవచ్చు. కానీ SIPలో డబ్బును స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడతారు. అందుకే రాబడికి హామీ ఇస్తారు. చాలా మంది నిపుణులు SIPని ఉత్తమ పెట్టుబడి సాధనంగా భావిస్తారు. ఫండ్ మేనేజర్లు పెట్టుబడులను జాగ్రత్తగా నిర్వహిస్తుంటారు. సిప్ అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ .. క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టె సాధనం.
ఆర్డీ లాగా కొంత కాలం పాటు SIPలో పెట్టుబడి పెట్టడం కొనసాగించవచ్చు. లాక్ ఇన్ పీరియడ్ వంటి పరిమితి లేదు. దాన్ని ఆపేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బు తీసుకోవచ్చు. కానీ సిప్ నుంచి మంచి లాభాన్ని పొందాలనుకుంటే దీర్ఘకాలం దాన్నికొనసాగించాలి.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, SIPలో సగటు రాబడి దాదాపు 12 శాతం. కొన్నిసార్లు ఇది అంతకంటే ఎక్కువ ఉండొచ్చు. ఈ రాబడి ఆర్డీ కంటే చాలా ఎక్కువ. మీరు దీర్ఘకాలిక SIP ద్వారా మంచి ఫండ్‌ను నిర్మించుకోవచ్చు. ఇందులో మార్కెట్ రిస్క్ ఉంది. కానీ ఆర్దీ లతో పోలిస్తే రిటర్న్స్ ఎక్కువ. నిపుణుల సలహాలు ..సూచనలు తీసుకుని సిప్ ని ప్రారంభించవచ్చు.