Subramanyam Dogiparthi……………………………
ప్రఖ్యాత బాలీవుడ్ సంగీత దర్శక ద్వయం శంకర్ జైకిషన్లు సంగీత దర్శకత్వం వహించిన ఏకైక తెలుగు సినిమా ఇది.సంగీత దర్శకుల్లో శంకర్ తెలుగువాడే. ఎనిమిది .. తొమ్మిది వారాలు మాత్రమే ఆడిన ఈ సినిమా గొప్ప మ్యూజికల్ హిట్. పాటలు ఇప్పటికీ పాపులరే.
“కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు , కంటి చూపు చెపుతోంది , మధురాతి మధురం , సుడిగాలిలోన దీపం , హాయ్ పిల్లా” పాటలు చాలా మధురంగా ఉంటాయి. ఆరుద్ర రాసిన ఆపాటలన్నీ సూపర్ హిట్టే. ముఖ్యంగా సి నారాయణరెడ్డి వ్రాసిన బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో పాట చాలా చాలా బాగుంటుంది . By the way , కాస్త striptease డాన్స్ కూడా ఉందండోయ్ .
నవశక్తి బేనర్లో పి గంగాధరరావు నిర్మించిన ఈ సినిమాకు సి యస్ రావు దర్శకులు . ఈ సినిమాలో NTR వేసిన పాత్ర సాధారణంగా ANR వేసే పాత్ర . అయినా NTR బాగా నటించారు . డబ్బున్న NTR కుటుంబం కోసం ఉద్యోగం చేసుకునే వాణిశ్రీని ప్రేమిస్తాడు . శ్రావ్యమైన డ్యూయెట్లు పాడుకుంటారు. తప్పని పరిస్థితుల్లో మేనత్త కూతురు శారదని పెళ్ళి చేసుకుంటాడు.
కట్టుకున్న శారదను ప్రేమించలేక , ప్రేమించిన వాణిశ్రీని మరచిపోలేక తనలో తానే నలిగిపోవటమే కధాంశం. . అయితే ఈ సినిమాలో కొత్తదనం ఏమిటంటే ఇద్దరిలో ఒకరిని చంపకుండా.. ఒకరు తన దారిన తాను పోవటం. సినిమా బాగానే ఉంటుంది.
1971 లో వచ్చిన ఈ జీవిత చక్రం సినిమా ప్రేక్షకులకు అంతగా నచ్చలేదు. 1971 లో ఎన్టీఆర్ ఫెయిల్యూర్ సినిమాల్లో ఇది ఒకటి అని చెప్పుకోవచ్చు. దసరాబుల్లోడు హిట్ ప్రభావం ఈ సినిమాపై కూడా పడింది.
NTR , వాణిశ్రీ , శారద , జగ్గయ్య , నాగయ్య , పద్మనాభం , రమణారెడ్డి , రేలంగి , హేమలత , ప్రభాకరరెడ్డి , రావి కొండలరావు , శ్రీరంజని ప్రభృతులు నటించారు . మా నరసరావుపేటలోనే చూసా . థియేటర్ గుర్తులేదు . యూట్యూబులో ఉంది . పాటల వీడియో కూడా ఉంది . చూడబుల్ సినిమాయే . పాటల వీడియో ప్రత్యేకంగా ఉంది కాబట్టి ఆస్వాదించండి . ఈ సినిమాలో కూడా వాణిశ్రీ నటన బాగుంటుంది . గ్లామరస్ గా కూడా ఉంటుంది .