సుదర్శన్.టి ————————– Tremors in the lakhs of crores market
అనంత్ అంబానీ పెళ్లి కార్యక్రమాలు ముగిసాయి.Best wishes to the couple💐. ఈ పెళ్లి గురించి చాలా విమర్శలు వచ్చాయి. కానీ ఓసారి వ్యాపార పరంగా ఈ పెళ్లి తంతును విశ్లేషిద్దాం. వివరాల్లోకి వెళ్ళే ముందు, హైందవ సంస్కృతి మీద వాళ్ళకున్న నమ్మకాన్ని, నిబద్ధతను సందేహించకూడదు, చాలా బాగా పాటించారు.
ఇండియాలో వెడ్డింగ్ ఎకానమీ విలువ 130 బిలియన్ డాలర్లు. అంటే దాదాపు 10లక్షల88వేల కోట్ల రూపాయల మార్కెట్ అది. ఇండియన్ జ్యువలరీ మార్కెట్ విలువ 88 బిలియన్ డాలర్లు. అందులో 55% అంటే 48 బిలియన్ డాలర్ల వ్యాపారం పెళ్లిళ్లతో ముడిపడి ఉంది. ఇండియన్ అప్పారెల్ మార్కెట్ సైజ్ 97 బిలియన్ డాలర్లు. ఇందులో 10% ఇండియన్ వెడ్డింగ్స్ తో ముడిపడి ఉంది. అంటే దాదాపు 1 బిలియన్ డాలర్ల మార్కెట్.
మొత్తం 130 బిలియన్ డాలర్లలో నగలు, దుస్తుల మార్కెట్ మాత్రమే దాదాపు 90 బిలియన్.డాలర్లు. అంటే దాదాపు 7 లక్షల కోట్ల మార్కెట్. ఈ మార్కెట్లో ఏమి జరిగింది…. మీరొక విషయం గమనించి ఉండొచ్చు . దక్షిణ భారత దేశం నుండి వెళ్లిన సినీ నటుల నుండి, నార్త్ నుండి వచ్చిన క్రికెటర్లకు, విదేశాల నుండి వచ్చిన సెలబ్రిటీలకు కూడా కొన్ని ప్రత్యేక దుస్తులు తొడిగారు.
అలాగే జయా బచ్చన్ వేసుకున్న ఆ విచిత్రమైన హారం అలాగే మిగిలిన సెలబ్రిటీలు వేసుకున్న నగలు కూడా గమనించి వుంటారు. అవన్నీ Manish Malhotra, Raghavendra Rathore, Abbu Jani, Sandeep Khosla బ్రాండ్లు. ఇవన్నీ రిలియన్స్ ట్రెండ్ పార్టనర్ బ్రాండ్స్.
1)పెళ్లి తర్వాత ఈ బ్రాండ్ల విలువ ఇబ్బడిముడిగా పెరిగింది 2)ఈ సెలబ్రిటీలు ఇవి వేసుకుని ఫోటోలు దిగడానికి ఎన్ని కోట్లు డిమాండ్ చేస్తారో మనకు తెలుసు అలాంటిది ఈ పెళ్ళిలో ఎటువంటి రుసుము చెల్లించకుండా వీళ్ళు ఇవి ధరించి ఫోటో సెషన్ లో పాల్గొన్నారు. కొందరు డ్యాన్స్ లు కూడా చేసారు. ఈ ప్రక్రియకు విలువ కడితే కళ్ళు బైర్లు కమ్మే సంఖ్య వస్తుంది.
ఈ పెళ్లి రిలయన్స్ కు మాత్రమే లాభం తెచ్చి పెట్టలేదు. ఈ 135 రోజులు జరిగిన పెళ్లి కార్యక్రమంలో దాదాపు 2 లక్షల మందికి అదనంగా పని దొరికిందట. వీళ్ళు freelance caterers, decorators లాంటి వారు.
ఇది కాకుండా ఈ పెళ్ళిలో పాల్గొన్న ప్రతి చిన్న పెద్ద caterer, decorator, supplier లకు ఒక బ్రాండ్ దొరికింది. ఉదాహరణకు ఉదయపూర్ నుండి వచ్చిన ఒక మిఠాయి దుకాణదారుడు ఇకపై అంబానీ పెళ్లికి సప్లయి చేసిన వాడిగా పెద్ద పెద్ద అక్షరాలతో బోర్డు వేసుకుంటాడు. ఈ పెళ్లి తర్వాత ఇలాంటి వాళ్ళ వ్యాపారాలు బాగా పుంజుకున్నాయట.
ఒక్కమాటలో చెప్పాలంటే ఓ 5000 కోట్లు ఖర్చు పెట్టి చేసిన పెళ్ళిలో లక్షల మంది లాభపడ్డారు, లక్షల కోట్ల మార్కెట్లో ప్రకంపనాలు వచ్చాయి. ఇది ముకేష్ ట్రెడ్ మార్క్ ప్లానింగ్.