అ’మాయకుడే’నా ?

Sharing is Caring...

నీలి చిత్రాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కుంద్రా చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆయన సొంత కంపెనీ వియాన్ ఉద్యోగులే వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి ముందుకొచ్చారట .. దీంతో పోలీసులు అన్ని ఆధారాలను,సాక్ష్యాలను సేకరిస్తున్నారు. వాటిలో బలమైన సాక్ష్యాలు దొరికితే రాజ్ కేసు నుంచి తప్పించుకోవడం కష్టమే అంటున్నారు. ముంబయి లోని అంధేరి వెస్ట్ లో ఉన్న రాజ్ కార్యాలయంపై పోలీసులు దాడిచేసినపుడు పెద్ద ఎత్తున పోర్న్ వీడియోల డేటా ను సేకరించారు.

ఏడాదన్నర కాలంలో వంద పోర్న్ వీడియోలు తయారు చేశారని ప్రధాన ఆరోపణ. అలాగే రాజ్ పోర్న్ యాప్ కు 20 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నట్టు పోలీసులు కనుగొన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో రాజ్ భార్య ,సినీనటి శిల్పా శెట్టి ప్రమేయం ఎంతవరకు ఉంది అనే విషయంపై కూడా పోలీసులు కూపీ లాగుతున్నారు. ఇక ఈ నీలి చిత్రాలలో నటించినవారి నుంచి కూడా పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు. వీళ్లంతా ఎవరి ద్వారా రాజ్ కుంద్రా వద్దకు వచ్చారు ?

ఇందులో శిల్పాశెట్టి పాత్ర ఏమిటి ? అనే సంగతులు రాబడుతున్నారు. ఇప్పటికే కొంతమంది మోడల్స్ రాజ్ గురించి పోలీసులకు ఆసక్తికరమైన సమాచారం చెప్పారని అంటున్నారు. కాగా శిల్పా శెట్టి మాత్రం తన భర్త తీసేవి పోర్న్ చిత్రాలు కాదని  శృంగార చిత్రాలని వాదిస్తోంది. ఈ క్రమంలోనే శిల్పాశెట్టిని కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఈ విచారణ సందర్భం గా ఆమె కన్నీళ్లు పెట్టుకున్నట్టు వార్తలు ప్రచారంలో ఉన్నాయి.  శిల్ప కూడా వియాన్ కంపెనీ డైరెక్టర్లలో ఒకరు గా ఉన్నారు. కాబట్టి ఆమె కేసు నుంచి తప్పించుకోవడం కష్టమే. 

శృంగార తారలు షెర్లిన్ ఛోప్రా … పూనమ్ పాండే లు ఇచ్చిన సమాచారం మేరకే పోలీసులు రంగంలోకి దిగారనే కథనాలు కూడా ప్రచారంలో ఉన్నాయి. ఆ ఇద్దరినీ తన చిత్రాల్లో నటించమని రాజ్ ఒత్తడి తెచ్చారట.  బెయిల్ కోసం రాజ్  పెట్టుకున్న పిటీషన్ ను ముంబై మేజిస్ట్రేట్ కోర్టు తిరస్కరించింది. జులై 27 వరకు పోలీస్ కస్టడీకి అప్పగించింది. ఇక ఈ నీలి చిత్రాల ద్వారా సంపాదించిన సొమ్ముతో రాజ్ ఆన్లైన్ బెట్టింగ్స్ కాసే వారని అనుమానిస్తున్నారు. ఇతని బ్యాంకు ఖాతాలను కూడా పరిశీలిస్తున్నారు. వీడియోలను రాజ్ పెద్ద మొత్తానికి అమ్మకానికి పెట్టినట్టు కనుగొన్నారు.

రాజ్ వాట్సాప్ లో ఈ సమాచారం దొరికందని అంటున్నారు. అవతల పార్టీ ఎవరో కూపీ లాగుతున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో చాలామంది పాత్ర ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. రాజ్ కుటుంబం అతని చిన్న వయసులో లండన్ వలస వెళ్ళింది. 18 ఏళ్ళ వయసులో రాజ్ నేపాల్లో శాలువాల వ్యాపారం మొదలుపెట్టాడు. ఆతర్వాత దుబాయ్ వెళ్లి అక్కడ పలు వ్యాపారాలు చేసాడు. పోలీసుల విచారణకు రాజ్ సహకరించడం లేదని అంటున్నారు. కస్టడీ పొడిగింపు కోసం కోర్టును  పోలీసులు అడిగే అవకాశాలున్నాయి. ఇదిలా  ఉంటే రాజ్ పై మనీ లాండరింగ్ , ఫెమా కేసులను కూడా ఈ డీ పెట్టె అవకాశాలున్నాయని అంటున్నారు. 
అన్నట్టు శిల్పాశెట్టి రాజ్ కి మొదటి భార్య కాదు. అంతకు ముందు కవిత అనే ఆవిడను పెళ్లి చేసుకున్నాడు.2007 లో ఆవిషయం కూడా రచ్చయింది.

———–KNM

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!