పక్కా కమర్షియల్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ !!

Sharing is Caring...

An entertaining movie ………..

“సింగం 3” (తెలుగులో ‘యముడు 3’ లేదా S3) తమిళ స్టార్ హీరో సూర్య పవర్‌ఫుల్ కాప్ పాత్రలో నటించిన చిత్రమిది. హై-వోల్టేజ్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో సాగే మాస్ మసాలా ఎంటర్‌టైనర్ . దర్శకుడు హరి మార్క్ బుల్లెట్ స్పీడ్ స్క్రీన్‌ప్లేతో ఈ ఫ్రాంచైజీలో వచ్చిన మూడో చిత్రం ఇది. 

మంగళూరు సిటీ పోలీస్ కమీషనర్ దారుణంగా హత్యకు గురవుతాడు. ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేయడానికి సిబిఐ ఆదేశాల ప్రకారం ప్రత్యేకంగా డీసీపీ నరసింహం (సూర్య) రంగంలోకి దిగుతాడు. నరసింహం తన విచారణ ప్రారంభించగానే స్థానిక గూండాల నుండి సవాళ్లు ఎదురవుతాయి.

అయితే ఈ మర్డర్ కేసు వెనుక అంతర్జాతీయ మెడికల్ వేస్ట్, ఈ-వేస్ట్ స్కామ్ మాఫియా దాగి ఉందని నరసింహం గుర్తిస్తాడు. ఆస్ట్రేలియా కేంద్రంగా భారతదేశంలో కాలుష్యాన్ని వెదజల్లుతున్న విలన్ విఠల్ ప్రసాద్ (ఠాకూర్ అనూప్ సింగ్) ను నరసింహం తన స్టైల్లో ఎలా ఎదుర్కొన్నాడు? ఎలా మట్టుబెట్టాడు? అనేదే మిగిలిన కథ.

సినిమా అంతా సూర్య వన్-మ్యాన్ షో గా నడుస్తుంది. సింగం సిరీస్ అంటేనే సూర్య ఎనర్జీ. ఈ చిత్రంలో కూడా ఆయన మరింత ఫిట్‌గా, పవర్‌ఫుల్ డైలాగులు, అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో సినిమాను ఒంటిచేత్తో నడిపించారు. దర్శకుడు హరి కథనాన్ని ఎక్కడా ఆపకుండా చాలా వేగంగా నడిపించారు ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్, సెకండ్ హాఫ్‌లో వచ్చే ఛేజింగ్ సీన్స్ మాస్ ఆడియన్స్‌కు బాగా నచ్చుతాయి. 

కనల్ కణ్ణన్ రూపకల్పన చేసిన ఫైట్స్ ఎనర్జిటిక్‌గా ఉండి థ్రిల్ కలిగిస్తాయి. అనుష్క శెట్టి సాంప్రదాయ భార్య పాత్రలో అభిమానులను అలరిస్తుంది. ఆపాత్ర లో నటించడానికి స్కోప్ ఏమి లేదు. జస్ట్ కనిపిస్తుంది. అంతే జర్నలిస్ట్‌గా శృతి హాసన్ గ్లామర్ అదనపు ఆకర్షణగా నిలిచింది. తన పాత్రకు న్యాయం చేసింది. సూరి కామెడీ పర్వాలేదు. 

విలన్‌గా అనూప్ సింగ్ బాడీ లాంగ్వేజ్ బాగుంది. సూర్య కు ధీటుగా ఉన్నాడు. టెంపర్మెంట్ ఎక్కువ ఉన్న క్యారెక్టర్ అది.అతగాడు బాగా చేసాడు.రాధికది చిన్న పాత్ర. అందులో ఇమిడిపోయారు. విలన్ మధుసూదన్ రెడ్డి  పాత్రను ప్రముఖ నటుడు శరత్ సక్సేనా పోషించారు. మిగతా పాత్రధారులంతా వారి పరిధి మేరకు చక్కగా నటించారు.  

మొదటి రెండు భాగాలకు డిఎస్పీ అందించిన హిట్ ఆల్బమ్స్, బిజీఎం ఈ సిరీస్‌కు పెద్ద ప్లస్. కానీ ఈ మూడో భాగానికి హారిస్ జయరాజ్ అందించిన పాటలు, సంగీతం అంతగా మెప్పించలేకపోయాయి.ఈ సినిమాకు కెమెరా వర్క్ చేసింది సినిమాటోగ్రాఫర్ ప్రియన్. దర్శకుడు హరి స్క్రీన్‌ప్లే ఎంత వేగంగా ఉంటుందో, కెమెరా వర్క్ కూడా అంతే స్పీడ్‌గా ఉంటుంది.

ప్రియన్ ఈ చిత్రంలో సూర్య పవర్‌ఫుల్ నటనను, పోలీస్ గంభీరత్వాన్ని ఎలివేట్ చేయడానికి డైనమిక్,ఫాస్ట్ కెమెరా మూవ్‌మెంట్స్ ఉపయోగించారు. ఏ సీన్ కూడా ఎక్కువ సేపు ఒకే యాంగిల్‌లో నిలకడగా ఉండకుండా, నిరంతరం మారుతూ ప్రేక్షకుడికి బోర్ కొట్టకుండా చేస్తుంది.

కథ పాతదే కావడం, కేవలం విలన్ నెట్‌వర్క్‌ను మాత్రమే అంతర్జాతీయ స్థాయికి పెంచడం వల్ల కొత్తదనం లోపించింది. కొన్ని సీన్లలో సినిమాటిక్ లిబర్టీ ఎక్కువై లాజిక్స్ పూర్తిగా మిస్ అయ్యాయి.సినిమా వేగంగా పరుగెడుతోంది..ఎక్కడా బోర్ కొట్టదు.  

“సింగం 3” అనేది పక్కా కమర్షియల్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్. లాజిక్స్ వెతకకుండా, కేవలం సూర్య పవర్‌ఫుల్ పోలీస్ యాక్షన్, స్పీడ్ స్క్రీన్‌ప్లే, ఫైట్స్ కోసం చూడాలనుకుంటే ఈ సినిమా నిరాశపరచదు. కానీ మొదటి రెండు భాగాల స్థాయి కథను ఆశిస్తే మాత్రం కొంచెం నిరాశ పడక తప్పదు. ఈ చిత్రం జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. 

 

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!