స్టాక్ మార్కెట్ లో లాభాలు అర్జించాలంటే ఇన్వెస్టర్లు ఈ దిగువ నిచ్చిన సూత్రాలను పాటించాలి. లాభాలు రాకపోయినా నష్టాల పాలవ కుండా సేఫ్ గా ఉండొచ్చు. ఈ సూచనలన్నీ చిన్న లేదా కొత్త ఇన్వెస్టర్ల కోసమే.
@ అందరు షేర్లను అమ్ముకుంటున్న సమయం లో ట్రెండ్ ను బట్టి కొనుగోళ్ళు చేయాలి. @ మనసు ప్రశాంతం గా వున్నపుడు మాత్రమే ఇన్వెస్ట్ మెంట్ నిర్ణయాలు తీసుకోవాలి. @ ఎవరు పడితే వారిచ్చే టిప్స్ ను అనుసరించ కూడదు.. క్రాస్ చెక్ చేసుకోవాలి. @ మంచి షేర్లలో చౌక ధర కు దొరికే వాటిపైనే గురి పెట్టాలి.
@ మంచి షేర్లలో కూడా నూటికి నూరు పాళ్ళు బెస్ట్ షేర్ ఏది ఉండదని గుర్తుంచుకోవాలి. @ మార్కెట్ పడుతున్న తరుణం లో షేర్లను కొనుగోలు చేయమని సలహాలు ఇవ్వడం చాల సులభం. కాని కొనడమే కష్టం. ధైర్యం చాలదు. కానీ ధైర్యం చేయక తప్పదు.
@ టిప్స్ పైనే ఆధారపడి షేర్లను కొనగూడదు. కొంత మేరకైనా స్వీయ విశ్లేషణ వుండాలి.@ షేర్లలో మదుపు చేసి సైలెంట్ గా ఉండకూడదు. @ ఇన్వెస్ట్ చేసే ముందు షేర్ల తాలూకూ కంపెనీల మంచి చెడ్డ ల గురించి తెలుసుకోవాలి. @ మార్కెట్ పోకడ తో నిమిత్తం లేకుండా కొన్ని షేర్లు పెరుగు తుంటాయి. కొన్ని తగ్గు తుంటాయి. వాటిలో మంచి వాటిని ఎంపిక చేసుకోవాలి.
@ ఒకే కంపెనీ లేక ఒకే గ్రూపు కి చెందిన కంపెనీల షేర్లలో మొత్తం సొమ్మును ను మదుపు చేయకూడదు.భిన్న రంగాలకు చెందిన కంపెనీల షేర్లను ఎంపిక చేసుకోవాలి. @ కొనుగోలు చేసిన షేర్ల ధరల కదలికలను నిత్యం పరిశీలిస్తుండాలి. కంపెనీల తాలుకు బోనస్,డివిడెండ్,ఇతర సమాచారాన్ని కూడా తెలుసు కుంటుండాలి. @ షేర్లను ప్రేమించ కూడదు. ధర పెరిగితే వెంటనే స్పందించి అమ్మేసుకోవాలి.
@ షేర్ల ధరలు పతనమయ్యే తరుణం లో బెంబేలెత్తి పోకూడదు , ఓర్పు వహించాలి. చేతిలో సొమ్ము వుంటే మరిన్ని మంచి షేర్లను కొనాలి. ఇది కూడా అంత సులభమైన విషయం కాదు. @ మార్కెట్ ఏ కారణాల వలన పతనమైనా కొన్నాళ్ళకు పెరుగుతుంది. ఇన్వెస్టర్లు ఎపుడు ఆశాభావంతో ఉండాలి. @ ఇన్వెస్టర్లు మరీ ఆశ బోతులుగా ఉండకూడదు, దశలు వారీ గా లాభాలు గడించాలి అన్న దృక్పధం తో మదుపు చేయాలి.