చూడదగిన లీగల్ డ్రామా !!

Sharing is Caring...

Court room Drama ………

కోర్ట్: స్టేట్ వర్సెస్ ఎ నోబడీ (Court: State Vs A Nobody ) 2025 నాటి  లీగల్ డ్రామా సినిమా. హీరో  నాని సమర్పణలో రామ్ జగదీష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రియదర్శి ప్రధాన పాత్ర పోషించారు. 

కథ ఏమిటంటే ? 
వైజాగ్ నేపథ్యంలో సాగే కథ ఇది. 19 ఏళ్ల చందు (హర్ష రోషన్) అనే ఒక వాచ్‌మెన్ కొడుకు, జాబిలి (శ్రీదేవి) అనే సంపన్న కుటుంబానికి చెందిన అమ్మాయితో ప్రేమలో పడతాడు. కానీ అనుకోకుండా చందు ఒక  లీగల్ కేసు (POCSO యాక్ట్ పరిధిలోకి వచ్చే కేసు) లో ఇరుక్కుంటాడు. అతని తరపున ఒక జూనియర్ లాయర్ (ప్రియదర్శి) కోర్టులో ఎలా పోరాడాడు? న్యాయ వ్యవస్థలోని లోపాలను, సామాన్యుడి కష్టాలను ఈ సినిమా ఎలా చూపించింది? అనేదే కథ. 

ప్రియదర్శి తన కెరీర్‌లోనే అత్యంత పరిణతి చెందిన, నిశ్శబ్దమైన నటనను ప్రదర్శించారు. రోహిణి, హర్ష రోషన్ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. సినిమాలోని భావోద్వేగాలు, ముఖ్యంగా పేద కుటుంబాల ఆవేదన ప్రేక్షకుడిని కదిలిస్తుంది.కోర్టు డ్రామా సీన్లు కొన్ని చోట్ల చాలా సాధారణంగా సాగుతాయి. లాయర్ మేధస్సు కంటే లక్ లేదా ఈజీగా ఆధారాలు దొరకడం ద్వారా కేసు సాగినట్లు అనిపిస్తుంది. స్క్రీన్‌ప్లే కొంత నెమ్మదిగా ఉంటుంది. 

సినిమాలో హీరోయిన్ బాబాయ్ ‘మంగపతి’ పాత్రలో శివాజీ బాగా నటించారు. ఫస్ట్ హాఫ్‌లో క్లాస్ పాలిటిక్స్, అహంకారంతో ఒక సామాన్యమైన కుర్రాడిని ఇబ్బంది పెట్టే సీన్లలో ఆయన నటన చాలా ఇంటెన్స్‌గా ఉండి, ప్రేక్షకుల్లో ఒకరకమైన ఉత్కంఠను రేపుతుంది.

సెకండ్ హాఫ్‌లో వచ్చే కోర్టు రూమ్ డ్రామా సినిమాకు ప్రధాన బలం. అనవసరపు అరుపులు, భారీ డైలాగులు లేకుండా చాలా సహజంగా, నిశ్శబ్దమైన టెన్షన్‌తో సాగే ఈ సీన్లు హైలైట్‌గా నిలుస్తాయి. 

లాయర్ సూర్య తేజ పాత్రలో ప్రియదర్శి చాలా పరిణతి చెందిన నటనను కనబరిచారు. ముఖ్యంగా సామాన్యుడి తరపున నిలబడి, వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతూ సాగే విచారణా సన్నివేశాల్లో ఆయన హావభావాలు, డైలాగ్ డెలివరీ ఆకట్టుకుంటాయి.

స్వచ్ఛమైన ప్రేమకథ, ఆ తర్వాత అది POCSO చట్టం పరిధిలోకి వెళ్లే మలుపుల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్లు హార్ట్-టచింగ్‌గా ఉంటాయి. నటీ నటులంతా బాగా నటించారు. పోలీసులు,న్యాయవాదులు ధనబలం లేని వారిని ఎలా కేసుల్లో ఇరికిస్తారో సినిమా లో బాగా చూపించారు. విజయ్ బుల్గానిన్ అందించిన సంగీతం, నేపథ్య సంగీతం కథలోని మూడ్‌ను బాగా ఎలివేట్ చేశాయి.దినేష్ పురుషోత్తమన్ కెమెరా పని తనం బాగుంది.  

రూ .10 కోట్ల లోపు పరిమిత బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్లలో భారీ వసూళ్లను రాబట్టింది. థియేట్రికల్ రన్‌లో ప్రపంచవ్యాప్తంగా ఏకంగా ₹57 నుండి ₹58.15 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టి సంచలనం సృష్టించింది. ప్రియదర్శి, శివాజీల నటనకు ప్రశంసలు దక్కడంతో పాటు, ప్రేక్షకుల నుండి వచ్చిన అద్భుతమైన పాజిటివ్ టాక్  ఈ సినిమాను వందల కోట్ల బడ్జెట్ సినిమాలకు ధీటుగా నిలబెట్టింది.

ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో, ప్రస్తుతం దీనిని తమిళంలో ‘రంజన్ – ది అడ్వకేట్’ పేరుతో రీమేక్ కూడా చేస్తున్నారు. కమర్షియల్ హంగులు ఆశించకుండా, ఒక మంచి సందేశాత్మక ఎమోషనల్ డ్రామా చూడాలనుకునే వారికి ఈ సినిమా నచ్చుతుంది. ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్‌లో చూడవచ్చు.  

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!