Horror……..
దహాన్: ది ఈవిల్ వితిన్’ (Dahaan: The Evil Within). ఈ చిత్రానికి అనుపమ్ పట్నాయక్ దర్శకత్వం వహించారు.ఒరిజినల్‌గా ఒడియా భాషలో రూపొంది, థియేటర్లలో మంచి విజయాన్ని అందుకున్న ఈ చిత్రం, ప్రస్తుతం ఆహా లో తెలుగు వెర్షన్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
కథాంశం
ఒక పాత భవనంలో అనుకోకుండా తెరిచిన ఒక పురాతన పెట్టె లో నుంచి ఒక ప్రేతాత్మ (ఇజ్రాయెలీ దెయ్యం కాన్సెప్ట్) బయటకు వస్తుంది.ఆ ప్రేతాత్మ అక్కడ ఉన్న మాన్యత అనే ఒక యువతిని ఆవహిస్తుంది. ఆ తర్వాత ఆ ఇంట్లో జరిగే భయానక పరిణామాలు ఏంటి? ఆ యువతిని, ఆమె కుటుంబాన్ని కాపాడుకోవడానికి వారు ఎలాంటి పోరాటం చేశారు? అనేదే ఈ సినిమా కథ.
బర్షా పట్నాయక్, సామ్రాట్ మహాపాత్ర తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ముఖ్యంగా ప్రేతాత్మ పట్టిన యువతిగా నటించిన నటి ఔరోశిఖా మిశ్రా నటన సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.సినిమా మొదటి భాగం కథను ఎస్టాబ్లిష్ చేయడానికి దర్శకుడు ఎక్కువ సమయం తీసుకోవడం వల్ల కొంచెం స్లోగా సాగుతుంది.నటీ నటులంతా బాగానే చేశారు.
కథనం ద్వితీయార్ధంలో వేగం పుంజుకున్నప్పటికీ, హారర్ జానర్లో వచ్చే కొన్ని సీన్లు రెగ్యులర్ ఫార్మాట్లోనే అనిపిస్తాయి.
పెట్టెను తెరవడం ద్వారా ప్రేతాత్మ బయటకు రావడం, అది మనుషులను ఆవహించడం, దాన్ని వదిలించడానికి చేసే ప్రయత్నాలు..వంటివి మనం గతంలో అనేక హారర్ సినిమాలలో చూసినవే.
కథనంలో కొత్తదనం లోపించడం వల్ల కొన్ని సీన్లు పాత సినిమాలను గుర్తుచేస్తాయి, ప్రేక్షకులను భయపెట్టడానికి వాడిన కొన్ని ట్రిక్స్ చాలా రొటీన్‌గా ఉండటం వల్ల, హారర్ జోనర్‌ను ఎక్కువగా ఇష్టపడే ఆడియన్స్ పూర్తిస్థాయి థ్రిల్‌ను పొందలేరు.
పెట్టెను తెరిచే సీన్ ఉత్కంఠభరితంగా ఉంటుంది. ఆ సమయంలో వచ్చే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకుడిని కథలోకి లాగేస్తుంది.
ప్రేతాత్మ ఆవహించినప్పుడు నటి ఔరోశిఖా మిశ్రా బాడీ లాంగ్వేజ్,హావభావాలు సినిమాకే హైలైట్. థియేటర్ ఆర్టిస్ట్‌లా ఆమె పండించిన హారర్ ఎక్స్ప్రెషన్స్ ఆకట్టుకుంటాయి.
కేవలం క్యాండిల్ లైట్ లేదా మొబైల్ ఫ్లాష్ లైట్ వెలుతురులో మాత్రమే ఇంట్లో దెయ్యం తిరుగుతున్నట్లు చూపించే సీన్లు బాగున్నాయి. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అనే సస్పెన్స్ మెయింటైన్ అవుతుంది.
చివరి 20 నిమిషాల్లో ఆ ప్రేతాత్మ ను అంతం చేయడానికి కుటుంబ సభ్యులు చేసే పోరాటం, అందులోని ఎమోషన్స్, విజువల్ ఎఫెక్ట్స్ బాగుంటాయి. హారర్ మూవీస్ రెగ్యులర్ గా చూసే వారికి ఈ సినిమాలోని హారర్ డోస్ చాలదు. కథపై మరింత కసరత్తు చేసి ఉంటే బాగుండేది.
సినిమాకు సంగీతం,సినిమాటోగ్రఫీ రెండు ప్రధానమైన పిల్లర్స్‌గా నిలిచాయి. ఈ సినిమాలో రెగ్యులర్ హారర్ సినిమాల్లా కేవలం గట్టిగా అరవడం, పెద్ద పెద్ద శబ్దాలు చేయడం కాకుండా…నిశ్శబ్దాన్ని వాడుకుంటూనే భయాన్ని పుట్టించే ప్రయత్నం చేశారు.
ఒక సాధారణ సీన్ నుంచి హారర్ సీన్లోకి మారేటప్పుడు వచ్చే విచిత్రమైన వాయిస్ టోన్స్,గిటార్, ఫ్లూట్ నోట్స్ ప్రేక్షకుడికి తెలియకుండానే ఒక రకమైన టెన్షన్‌ను క్రియేట్ చేస్తాయి.సినిమాటోగ్రాఫర్ తక్కువ వెలుతురుతో నిగూఢమైన వాతావరణాన్ని చూపించారు.ఓ మాదిరి థ్రిల్ ఫీలింగ్ ఇచ్చే ఈ సినిమాను ఆసక్తి ఉన్నవారు ఆహా లో చూడవచ్చు.

