Priyadarshini Krishna………
That’s a bad idea’ అనే యూట్యూబ్ కామెడీ ఛానల్ ని రన్ చేసి హిట్ కొట్టి కోట్ల మంది ఫాలోవర్స్ ని సొంతం చేసుకున్న Curry Barker మరో విజయం సాధించాడు. అతగాడు కేవలం 20 రోజుల్లో 5 కోట్ల మైక్రోబడ్జెట్ తో తీసిన సినిమా ప్రపంచవ్యాప్తంగా మే 19 న రిలీజ్ అయి భారత్ లో కూడా సంచలనం రేపి కలెక్షన్ల దుమ్ము దులుపుతోంది.
వందల కోట్లు పెట్టి సినిమా తీసి వారాలైనా బ్రేక్ ఈవెన్ అవ్వలేదని బాధపడుతున్న ప్రొడ్యూసర్లు ఈ సినిమా చూసి చర్చించుకోవాలని ఒక సినిమా టెక్నీషియన్ గా మాత్రమే కాకుండా సగటు ప్రేక్షకురాలిగా కోరుకుంటున్నాను.
ప్రతిరోజూ అద్భుతమైన సినిమా పుట్టదు… ప్రతీ సినిమా సూపర్ హిట్ కొట్టదు … ప్రతీ శుక్రవారం మేజిక్ జరుగుతుందని ఎదురు చూడటం కూడా కరెక్ట్ కాదు…అద్భుతాలు అప్పుడప్పుడు జరుగుతాయి అంతే …!కానీ ఆ అద్భుతానికి ఉపకరించిన అంశాలు ఏంటి అనేది తెలుసుకుంటే మనల్ని మనం మార్చుకోడానికి ఉపయోగపడుతుంది.
ఇదే ఫిల్మ్ మేకర్స్ ప్రొడ్యూసర్స్ తెలుసుకోవలసిన నిజం…ప్రపంచం ఈ సినిమా గురించి ఎందుకు ఇంత వెర్రులెత్తిపోతోంది… యూత్ ఎందుకు అన్ని కలెక్షన్స్ ఇస్తున్నారు … ఎన్ని మంచి ఎలిమెంట్స్ లేకపోతే జనాలు ఎందుకు కాసులవర్షం కురిపిస్తారు … చూద్దాం.
Obsession నిజంగానే ప్రేక్షకులకు ఒక అబ్సెషన్ అయింది, not in a negative sense…. కథ కొద్దిగా చెప్పుకుందాం …. బేర్ (Michael Johnston) ఒక మ్యూజిక్ స్టోర్ ఉద్యోగి. తన చిన్ననాటి నేస్తం, కోవర్కర్ అయిన నిక్కీ (Inde Navarrette) పట్ల చాలా కాలంగా మనసులో ప్రేమ దాచుకుంటాడు .
ఆమెను డేట్‌కి అడగడంలో పదే పదే విఫలమైన తర్వాత, బేర్ నిస్పృహతో ఒక న్యూ ఏజ్ షాప్‌కి వెళ్లి “వన్ విష్ విల్లో” అనే విచిత్రమైన వస్తువును కొనుక్కుని దానిని ప్రయోగిస్తాడు — దీన్ని రెండు ముక్కలు చేస్తే కోరిక నెరవేరుతుందని నమ్మకాన్నీ యూత్ లో బాగా ప్రచారంలో వుంటుంది.
నిక్కీ తనను మిగతా అందరికంటే ఎక్కువగా ప్రేమించాలని అతను కోరుకుంటాడు . అక్కడినుండి ఏమైంది, తనకోరిక నెరవేరిందా లేదా, నెరవేరితే మరి గొడవేంటి, నెరవేరకుంటే బేర్ ఎంచేసాడు ….అనేవి తెరమీద చూసి తీరాల్సిన విషయాలే !
ప్రపంచం మొత్తం యూత్ ఈ సినిమాను చూసి గంగవేరెత్తి పోవడానికి కారణం … అందులో యూత్ కి కావలసిన రసవత్తరమైన సీన్లు ఉండటం ఏమాత్రం కాదు … నిజానికి భారత్ లో చాలా cuts తో A సెరిఫికేట్ ఇచ్చింది సెన్సార్ బోర్డు….ఈ సినిమా యువతకు పిచ్చిగా నచ్చడానికి చాలా కారణాలు వున్నాయి.
మొదటిది అందరూ నటులు చాలా సహజంగా నటించారు, మన పక్కింట్లో జరిగినట్లే అనిపిస్తుంది. వందకు తొంభై మంది యువత ప్రేమలోనో, రిలేషన్ లోనో,లివ్-ఇన్ లోనో. కనీసం డేటింగ్ లోనో ఉన్నారు. వారందరిలో సినిమా చూసి థ్రిల్ అవ్వాలని వుండటం సహజం.
నేను సినిమాకి వెళ్ళినప్పుడు ఆడపిల్లలే ఎక్కువగా ఉండటం నాకు నవ్వు వచ్చింది … ఎందుకో మీరు సినిమా చూసినప్పుడు అర్థం అవుతుంది…ఇంకా మిగతా విషయాలకు వస్తే … రెండో అంశం- కథ కానీ కథనం కానీ మాటలు కానీ simply superb…. నిక్కి పాత్ర చాలా చోట్ల మాట్లాడదు , కవితలు చెప్తుంది… ప్రియునికోసం కవిత్వం చెప్పడం – ఓహ్ ఎంత రొమాంటిక్.
మూడో అంశం- లైటింగ్ & సినిమాటోగ్రఫీ. …సినిమా కి సినిమాటోగ్రఫీ అనేది ప్రాణం, అలాంటి సినిమాటోగ్రఫీకి లైటింగ్ అనేది ప్రాణవాయువు…. సినిమా మొత్తం అసలు లైట్లు వాడలేదా అన్నట్లు – అంటే మన మణిరత్నం లాగా కాకుండా- ఒక ఇంటిలో సహజంగా వుండే లైట్లతోనే తీశారా అన్నత సహజంగా వుంది.
కెమెరా యాంగిల్స్ తో, లైటింగ్ ఎఫెక్ట్స్ తో చిన్న చిన్న చమక్కులు కురిపించాడు డైరెక్టర్ & కెమెరామన్ టైలర్ క్లెమన్స్ …చిన్న లైటింగ్ ఎఫెక్ట్స్, సరైన కెమెరా ఫ్రేమింగ్ & యాంగిల్స్ తో ప్రేక్షకుల వెన్నులో మాత్రమే కాదు ప్రపంచంలో ఇతర ఫిల్మ్ మేకర్స్ వెన్నులో కూడా వణుకు పుట్టించారు….
నాలుగో అంశం- బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ..సాధారణంగా హాలీవుడ్ సినిమాల్లో BGM కి పెద్ద స్కోప్ వుండదు, స్పెషల్ / డిఫరెంట్ మూవీస్ లో తప్ప దానిపైన పెద్దగా ఫోకస్ పెట్టరు, ఏదో మన DPS లాగా తమన్ లాగా చేసి పడేస్తారు…
స్పీల్బర్గ్, క్రిస్టోఫర్ నోలన్, జెమ్స్ కామెరాన్, మార్టిన్ స్కోర్స్, క్వెంటిన్ తరన్షియో,డెనిస్ వెళ్ళెనూయి, ఫ్రాన్సిస్ ఫోర్డ్, వోల్ఫ్గ్యాంగ్ పీటర్సన్…. వంటి మహా మహులైన హాలీవుడ్ డైరెక్టర్స్ మాత్రమే Sound కూడా సినిమాలో ఒక పాత్ర లాగా స్క్రిప్ట్ రాసుకుంటారు… ఫైనల్ ఔటపుట్ కూడా అంత జాగ్రత్తగా వుండేలా చూసుకుంటారు…
ఈ సినిమాలో కూడా డైరెక్టర్ సౌండ్ స్కోర్ కోసం రాక్ బర్వెల్ పైన పూర్తిగా డిపెండ్ అయ్యాడు, దానిని రాక్ బర్వెల్ పూర్తిగా నిర్వర్తించాడు….చాలా చోట్ల వణుకు పుట్టించాడు… అన్నిటికంటే, అందరికంటే ముఖ్యంగా మాట్లాడుకోవలసింది నిక్కీ పాత్ర చేసిన ఇండీ నవ్రాట్టే.
హాల్ నుండి బయటకు వచ్చినా కూడా ఆమెని మర్చిపోలేము…బయటకి వస్తూ మీరంతా ‘NO..no no no…’ అనకుండా వుండలేరు…ఈ సంవత్సరం ఈ సినిమాకి అవార్డుల పంటనే …. Mark my words !!!మైక్రో బడ్జెట్ తో, మైక్రో వర్కింగ్ డేస్ తో ఇంత మంచి ఔటపుట్ తీసుకురావడం అసామాన్యం …ఈ సంచలనాత్మక సైకలాజికల్ హారర్-రొమాన్స్ సినిమాని పెద్ద స్క్రీన్ మీద చూడాల్సిందే… వీలైతే ఇవాళే ప్లాన్ చేసుకోండి……

