పుష్కరానికో మారు పూచే పూలను చూసారా ?

Sharing is Caring...

పై ఫొటోలో కనిపించే పూలు ఎంతో అద్భుతంగా ఉన్నాయి కదా. ఫొటోలోనే అంత అందంగా ఉన్న పూలను దగ్గర నుంచి చూస్తే ఆ ఫీలే వేరుగా ఉంటుంది.ఈ పూల పేరు నీల కురింజి. ఈ పూల గురించి చాలామందికి తెలియదు. ఈ పూలు పన్నెండేళ్లకు ఒక మారు మాత్రమే పూస్తాయి. అపుడు మాత్రమే వాటిని చూడగలం. 

ప్రపంచంలోనే అరుదైన పువ్వులలో ఈ నీల కురింజి ఒకటి. మన దేశంలోని నైరుతి రాష్ట్రమైన కేరళలో ప్రతి 12 సంవత్సరాలకు ఈ పూలు ఒక్కసారి పూస్తుంటాయి. ఈ పూలు కొండలను అద్భుతమైన వైలెట్ రంగులో కప్పేస్తాయి.ఈ సంవత్సరం ఈ పూలు వికసించాయి. పర్యాటకులు ..ప్రకృతి ప్రేమికులు ఇక్కడికి ఎక్కువగా వస్తుంటారు. పూలను చూసి పులకించిపోతుంటారు. సంతన్పర పంచాయతి పరిధిలోని ఇడుక్కిలోని శలోమ్ కొండలు వికసించిన ఈ నీలిరంగు పూలతో కొత్త అందాలను సంతరించుకున్నాయి.

ఆ దృశ్యాలన్నీ కళ్ళకు అద్భుతమైన విజువల్ ట్రీట్ ఇస్తాయి. మలయాళం …  తమిళంలో నీలకురింజి .. కురింజి అని పిలువబడే ఈ పూల శాస్త్రీయ నామం  స్ట్రోబిలంతెస్. రాంక్ జాతికి చెందిన ఈ  పూలు కేరళ, తమిళనాడులోని పశ్చిమ కనుమలలోని షోలా అడవులలో మాత్రమే కనిపిస్తాయి. ఆ కొండలపై పెరిగే ఒక రకమైన పొదల్లో ఈ పూలు పూస్తాయి . నీలగిరి కొండలపైన పొదలలో ఈ పూలు పూస్తాయి కాబట్టి  వీటిని  నీలంకురింజి పూలు అంటారు. వీటినే బ్లూ ఫ్లవర్స్ అని కూడా పిలుస్తారు. 

Watch vedeo………………………      పుష్కరానికో మారు పూచే పూలు

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!