యావరేజ్ గ్యాంగ్‌స్టర్ డ్రామా !!

Sharing is Caring...

A movie without novelty…….

‘కింగ్ ఆఫ్ కొత్త’ (King of Kotha) మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో, అభిలాష్ జోషి దర్శకత్వంలో రూపొందింది. ఈ కథ 1980, 90ల మధ్య కాలంలో ‘కొత్త’ అనే  టౌన్ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది.

అక్కడ గంజాయి, డ్రగ్స్ మాఫియాతో కన్నన్ భాయ్ (షబీర్ కల్లరక్కల్) రాజ్యాన్ని ఏలుతుంటాడు. అతన్ని అణచడానికి అక్కడికి వచ్చిన కొత్త పోలీస్ ఆఫీసర్ షాహుల్ హసన్ (ప్రసన్న) ఒక ప్లాన్ వేస్తాడు. ఒకప్పుడు ఆ ఊరిని శాసించి, ఆ తర్వాత ఊరు విడిచి వెళ్లిపోయిన ఓరిజినల్ గ్యాంగ్‌స్టర్ రాజు (దుల్కర్ సల్మాన్) ను మళ్లీ వెనక్కి రప్పిస్తాడు.

అసలు రాజు ఎవరు? కన్నన్‌తో అతనికి ఉన్న పాత పగ ఏమిటి? రాజు మళ్లీ వచ్చి ‘కొత్త’ టౌన్‌ను ఎలా తన కంట్రోల్‌లోకి తెచ్చుకున్నాడు? అనేదే మిగతా కథ. 

గ్యాంగ్‌స్టర్ ‘రాజు’ పాత్రలో దుల్కర్ సల్మాన్ తన యాక్టింగ్, స్టైలిష్ లుక్స్,మేనరిజమ్స్‌తో అద్భుతంగా నటించారు.మాస్ యాక్షన్ సీన్లలో ఆయన నటన మెప్పిస్తుంది. కన్నన్ భాయ్‌గా నటించిన షబీర్ కల్లరక్కల్  దుల్కర్‌కు గట్టి పోటీనిస్తూ పవర్‌ఫుల్ విలనిజాన్ని పండించారు. 

ఇద్దరు స్నేహితులు శత్రువులుగా మారడం, ఒకరు ఊరు వదిలి వెళ్లడం, మళ్లీ వచ్చి పగ తీర్చుకోవడం అనేది దశాబ్దాలుగా వస్తున్న పాత గ్యాంగ్‌స్టర్ ఫార్ములా కథ. కథనంలో ఎలాంటి కొత్తదనం లేదు. దాదాపు మూడు గంటల సినిమాలో ఫైట్స్ ..నరుక్కోవడాలు ఎక్కువ.కథలో పోలీస్ లు నిస్సహాయక వ్యక్తులు.. ముందుగానే విషయం తెలిసిపోతుంది.  

సినిమాలో అనవసరమైన సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయి. వెబ్ సిరీస్ తీయాలనుకుని సినిమా గా ఫిక్స్ అయినట్టున్నారు.నిడివి మరింత తగ్గితే బాగుండేది. దర్శకుడు యాక్షన్, ఎలివేషన్లపై పెట్టిన శ్రద్ధ తండ్రి-కొడుకుల సెంటిమెంట్‌లో గానీ, హీరో-హీరోయిన్ల లవ్ స్టోరీలో గానీ పెట్టలేదు.

హీరో లవ్ స్టోరీ చాలా బలహీనంగా సాగుతుంది. హీరో హీరోయిన్ల మధ్య ఉండాల్సిన లవ్ కెమిస్ట్రీ ఎక్కడా పండలేదు. ఈ చిత్రంలో మదర్ సెంటిమెంట్, సిస్టర్ సెంటిమెంట్తో పాటు ప్రేమ, స్నేహ బంధం.. ఇలా అన్ని అంశాలు ఉన్నాయి. కానీ వాటిని ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా చూపించడంలో డైరెక్టర్ సఫలం కాలేదు.

మదర్,సిస్టర్ సెంటిమెంట్ సీన్లు ఫరవాలేదు.సినిమాలో రాజు తన చెల్లెలిని రక్షించే సన్నివేశం హీరో పాత్రలోని అసలైన మాస్ ఇంటెన్సిటీని, ఎమోషన్‌ను బయటకు తీసే అత్యంత కీలకమైన బ్లాక్. ప్రేమించిన అమ్మాయి (తార) కోసం రౌడీయిజం వదిలేయాలని అనుకున్న రాజు.. తన చెల్లెలిని రక్షించుకోవడానికి మళ్లీ కత్తి పట్టాల్సి వస్తుంది.

ఈ సంఘటనతోనే రాజు, అతని ప్రాణ స్నేహితుడు కన్నన్ భాయ్ మధ్య బంధం పూర్తిగా తెగిపోయి, ఇద్దరూ శత్రువులుగా మారుతారు. కొన్ని సన్నివేశాల చిత్రీకరణ బాగుంటుంది.  నిర్మాణ విలువలు బాగున్నాయి.సినిమా చూస్తుంటే మనం చదివిన వార్తలు ..తెలిసిన సంఘటనలు గుర్తుకొస్తాయి.  

దుల్కర్ సల్మాన్ స్టైలిష్ యాక్షన్‌తో విజువల్స్ పరంగా బాగున్నప్పటికీ, బలహీనమైన కథ, కథనాల వల్ల ఒక సాధారణ యావరేజ్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా మిగిలిపోయింది. సినిమాలో హింస చాలా ఎక్కువ అని చెప్పుకోవాలి. జేక్స్ బిజోయ్ అందించిన నేపథ్య సంగీతం (BGM)  నిమిష్ రవి సినిమాటోగ్రఫీ చాలా రిచ్‌గా ఉన్నాయి.

80ల నాటి వాతావరణాన్ని విజువల్స్‌లో చాలా బాగా చూపించారు. గ్యాంగ్‌స్టర్ డ్రామా,క్రైమ్ స్టోరీస్ ఇష్టపడేవాళ్ళకు ఈ సినిమా నచ్చుతుంది. ఈ సినిమా ప్రస్తుతం జియో హాట్‌స్టార్  ఓటీటీలో తెలుగు వెర్షన్ తో  అందుబాటులో ఉంది. ఆసక్తి ఉన్నవాళ్లు చూడవచ్చు.

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!