ఫాంటసీ కోర్ట్ డ్రామా!!

Sharing is Caring...

Not as expected……

‘వీరభద్రుడు’ (తమిళంలో ‘కరుప్పు’) చిత్రం ఒక వైపు దైవత్వం, మరోవైపు న్యాయవ్యవస్థలోని లోపాల చుట్టూ తిరిగే ఒక భిన్నమైన కమర్షియల్ ఫాంటసీ డివోషనల్ డ్రామా. గతంలో ‘అమ్మోరు తల్లి’ (మూక్కుతి అమ్మన్) సినిమాతో మెప్పించిన ఆర్జే బాలాజీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా ఒక ముఖ్యమైన పాత్రలో నటించారు.  స్టార్ హీరో సూర్య, త్రిష ప్రధాన పాత్రల్లో నటించారు.

కోర్టులో బేబీ కృష్ణ (ఆర్జే బాలాజీ) అనే లాయర్ సామ్రాజ్యం నడుస్తుంటుంది. లాయర్లను, జడ్జిలను తన గుప్పెట్లో పెట్టుకుని, హ్యూమర్, సెటైర్లు వేస్తూనే చాలా కేర్ లెస్‌గా ఎదుటివారిని మోసం చేస్తుంటాడు. వ్యవస్థలోని ఈ లూప్‌హోల్స్ వల్ల సామాన్యులకు తీవ్ర అన్యాయం జరుగుతున్న సమయంలో, సమాజంలో విఫలమవుతున్న న్యాయాన్ని రక్షించడానికి, ఒక పవర్‌ఫుల్ గార్డియన్ (క్షేత్ర పాలకుడు – వీరభద్రుడు) రూపంలో సూర్య రంగంలోకి దిగుతాడు. ఆ తర్వాత కథ ఎలాంటి మలుపులు తిరిగింది అనేది అసలు సినిమా.

క్షేత్ర పాలకుడిగా, లాయర్‌గా సూర్య పవర్‌ఫుల్ పర్‌ఫార్మెన్స్ ఇచ్చారు. స్క్రీన్‌పై ఆయన కనిపించినప్పుడల్లా అభిమానులకు గూస్‌బంప్స్ వస్తాయి. ఈ సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్. సూర్య ఎలివేషన్ సీన్స్, కోర్టు రూమ్ డ్రామాకు ఇచ్చిన మ్యూజిక్ సినిమా రేంజ్‌ను పెంచింది.

త్రిష రెగ్యులర్ హీరోయిన్‌లా కాకుండా ఒక సెటిల్డ్ పాత్రలో మెప్పించింది. ఫస్ట్ హాఫ్‌లో తండ్రీకూతుళ్లుగా నటించిన ఇంద్రాన్స్, అనఘా రవిల ఎమోషనల్ సీన్స్ కంటతడి పెట్టిస్తాయి.ఇంద్రాన్స్ పాత్రలో జీవించాడు. వాస్తవానికి ఇంద్రాన్స్ సూర్య లాంటి స్టార్ హీరో పక్కన నటించడానికి భయపడ్డారట. డైరెక్టర్ ఆర్జే బాలాజీ,సూర్య నచ్చచెప్పడంతో  ఈ పాత్రను చేయడానికి ఆయన ఒప్పుకున్నారు.

సినిమాలో సూర్య మాస్ ఇమేజ్ పక్కన కూడా ఇంద్రాన్స్ తన ప్యూర్ యాక్టింగ్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.కోర్టు సీన్స్లో ,కూతురు చనిపోయిందని తెలిసినపుడు  ఇంద్రాన్స్ నటన సినిమాకు హైలైట్ గా నిలిచింది. సినిమాలో సూర్య, ఇంద్రాన్స్ కాంబినేషన్‌లో వచ్చే దృశ్యాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.

ఇంద్రాన్స్ అమాయకంగా సూర్యను చూస్తూ “కేసు గెలిచాం కానీ.. అంతా కోల్పోయాం సార్” అనే  డైలాగ్ సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అయింది. ఈ సీన్‌లో సూర్య తన రౌద్ర రూపాన్ని పక్కన పెట్టి, ఒక సాధారణ మనిషిలా ఇంద్రాన్స్ భుజంపై చేయి వేసి ఓదార్చే ఎమోషనల్ టచ్ చాలా బాగుంటుంది.

జీకే విష్ణు సినిమాటోగ్రఫీ చాలా రిచ్‌గా ఉంది. ముఖ్యంగా దైవత్వానికి సంబంధించిన ట్రాన్స్‌ఫర్మేషన్ సీన్స్ బాగున్నాయి.సూర్య స్క్రీన్ టైమ్ తక్కువ.. సినిమా మొదలైన మొదటి 40 నిమిషాల వరకు సూర్య ఎంట్రీ ఉండదు. ఆర్జే బాలాజీ తన పాత్రకే ఎక్కువ ఎలివేషన్స్ ఇచ్చుకోవడం సూర్య ఫ్యాన్స్‌కు కాస్త నిరాశ కలిగిస్తుంది.

సూర్య లాంటి పవర్‌ఫుల్ హీరో ఇమేజ్ ముందు ఆర్జే బాలాజీ నెగెటివ్ షేడ్స్ పాత్ర నిలబడలేకపోయింది.
పాటలలో తెలుగు లిరిక్స్ మిక్సింగ్ సరిగా కుదరలేదు. కొన్ని కోర్టు సీన్లలో డైలాగ్స్ డబ్బింగ్ కూడా అంతగా సింక్ అవ్వలేదు.ద్వితీయార్థంలో కొన్ని సీన్లు సాగదీసినట్లు అనిపిస్తాయి. కొన్ని చోట్ల వీఎఫ్‌ఎక్స్ (VFX) క్వాలిటీ కూడా అంతగా బాలేదు. కొంత గందరగోళంగా ఉంటుంది.

 ‘వీరభద్రుడు’ న్యాయవ్యవస్థపై సెటైర్లు వేస్తూనే, దైవత్వపు బ్యాక్‌డ్రాప్‌తో సాగే ఫాంటసీ మూవీ ఫస్ట్ హాఫ్ బాగున్నా సెకండాఫ్ స్లో గా నడుస్తుంది.సెకండాఫ్ స్క్రిప్ట్ పై సరైన కసరత్తు జరగలేదు. సూర్య అభిమానులు కూడా శించిన స్థాయిలో సినిమా లేదని పెదవి విరుస్తున్నారు.

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!