దూసుకుపోతున్న పళని స్వామి !!

Sharing is Caring...

 Chance for Palaniswami ……….

అన్నాడీఎంకే (AIADMK) ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి కె. పళనిస్వామి (EPS)  తన సొంత నియోజకవర్గమైన ఎడప్పాడి (Edappadi) నుండి పోటీ చేస్తున్నారు. సేలం జిల్లాలోని ఈ నియోజకవర్గం ఆయనకు కంచుకోట అని చెప్పుకోవచ్చు.

ఎడప్పాడి పళనిస్వామికి సొంత నియోజకవర్గం.ఆయన ఇక్కడి నుండి ఇప్పటికే వరుసగా మూడు సార్లు (2011, 2016, 2021 ఎన్నికల్లో, అంతకుముందు 1989, 1991లో కూడా విజయం సాధించారు. 2021 ఎన్నికల్లో ఆయన రికార్డు స్థాయిలో 93,802 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

ఈసారి ఇక్కడ డీఎంకే (DMK) తరపున ‘కాశీ’,  విజయ్ పార్టీ టీవీకే (TVK) తరపున ‘ఎం. అరుణ్‌కుమార్’ బరిలోకి దిగారు. దీంతో త్రిముఖ పోటీ అనుకున్నారు. అయితే, టీవీకే అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైనట్టు తెలుస్తోంది. దీంతో పోటీ రెండు ప్రధాన పార్టీల మధ్యనే ఉంటుంది. 

కొన్ని తాజా ఒపీనియన్ పోల్స్ (ఉదాహరణకు VoteVibe సర్వే) ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా అన్నాడీఎంకే కూటమికి 41% ఓట్లతో స్వల్ప ఆధిక్యం లభించే అవకాశం ఉందని, పళనిస్వామి ముఖ్యమంత్రి రేసులో డీఎంకే అధినేత స్టాలిన్‌తో సమానంగా (39%) ప్రజాదరణ కలిగి ఉన్నారని తెలుస్తోంది.

నియోజకవర్గంలో ప్రజల డిమాండ్లను నెరవేర్చడంలో, స్థానిక అభివృద్ధి పనుల విషయంలో పళనిస్వామికి మంచి పేరు ఉండటం ఆయనకు కలిసొచ్చే అంశం. ఎడప్పాడి నియోజకవర్గంలో గౌండర్ (Gounder) సామాజిక వర్గం అత్యంత బలంగా ఉంది. పళనిస్వామి కూడా గౌండర్ సామాజిక వర్గానికి చెందినవారే.

పశ్చిమ తమిళనాడు (కొంగు నాడు) లో ఈ కులస్తుల మద్దతు అన్నాడీఎంకేకు పెద్ద ఎత్తున ఉంటుంది.
పళని స్వామి కి  తన సామాజిక వర్గంలో ఉన్న పట్టు వల్ల ఇక్కడ తిరుగులేని విజయం సాధిస్తూ వస్తున్నారు. డీఎంకే ఇక్కడ ఎంత ప్రయత్నించినా, కులపరమైన ఓట్ల చీలిక తీసుకురాలేకపోతోంది. 

ఇక డీఎంకే అభ్యర్థి కాశీ ఈ నియోజకవర్గంలో గణనీయంగా ఉన్న వన్నియార్ ఓట్లను, ఇతర వెనుకబడిన వర్గాల ఓట్లను ఆకర్షించగలరని డీఎంకే భావిస్తోంది. కాశీ స్థానిక నాయకుడు కావడం,క్షేత్రస్థాయిలో ప్రజలతో సంబంధాలు కలిగి ఉండటం ఆయనకు ప్లస్ పాయింట్.

ప్రభుత్వ సంక్షేమ పథకాలు తమను గట్టెక్కిస్తాయని డీఎంకే గట్టిగా నమ్ముతోంది.మొత్తం మీద  ఎడప్పాడి నియోజకవర్గంలో పళనిస్వామికి అత్యంత అనుకూలమైన వాతావరణం ఉందని, ఆయన మళ్ళీ భారీ మెజారిటీతో విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!