Couldn’t he excel as a movie producer?………………..
పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా సినిమా రంగంలో కూడా అడుగు పెట్టారు. అయితే ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయారు. రతన్ టాటా తీసిన సినిమా పేరు ఏత్ బార్… బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఇందులో నటించారు.
ఈ సినిమాకు మరో ముగ్గురు నిర్మాతలు కూడా ఉన్నారు. రతన్ టాటా ప్రధాన నిర్మాత గా వ్యవహరించారు. జతిన్ కుమార్, ఖుష్రు బుద్రా, మన్‌దీప్ సింగ్ అనే నిర్మాతలు ఈ చిత్రానికి పెట్టుబడి పెట్టారు.
ఈ సినిమా 2004లో విడుదలైంది. 1992లో వచ్చిన హాలీవుడ్ ‘ఫియర్’ ఆంగ్ల చిత్రం స్ఫూర్తితో ఏత్ బార్ తెరకెక్కించారు.. ప్రముఖ దర్శకుడు విక్రమ్ భట్ డైరెక్ట్ చేసారు. ఆయనే కథ రాసుకున్నారు. ఇదొక రొమాంటిక్ సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం.
ఈ చిత్ర కథ ప్రేక్షకులకు నచ్చలేదు. డైరెక్టర్ కథ నడిపిన తీరు ఆసక్తికరంగా లేకపోవడం సినిమా జనాలను ఆకట్టుకోలేకపోయింది.అప్పట్లో రివ్యూలు కూడా దారుణంగా వచ్చాయి. అమితాబ్ ఇమేజ్ కూడా సినిమాను కాపాడలేకపోయింది.
ఈ సినిమాలో లో అమితాబ్ బచ్చన్‌తో పాటు జాన్ అబ్రహం, బిపాసా బసు, సుప్రియా పిల్గాంకర్ తదితరులు నటించారు. 2004లో జనవరి 23 న రిలీజయింది. ఈ సినిమా బడ్జెట్ 9.50 కోట్లు కాగా బాక్సాఫీస్ వద్ద కేవలం 8 కోట్లు మాత్రమే వసూలు చేయగలిగింది.
ఈ చిత్రం బాక్స్ ఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచిపోయింది. ఈ సినిమా అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని రతన్ టాటా మళ్లీ సినిమాలు తీయలేదు. ఈ సినిమా వలన టాటా కంపెనీకి దాదాపు మూడు కోట్ల నష్టం వచ్చింది. అలా ఏత్ బార్.. ఆయన మొదటి చిత్రం గా .. చివరి చిత్రంగా చరిత్రకెక్కింది. దీంతో అయన సినిమా రంగం కలసి రాదని భావించి మళ్ళీ ఈ రంగం వైపు చూడలేదు.